Sorakaya Chapati: సాధారణంగా ఇంట్లో సొరకాయ కూర అని తెలియగానే.. పిల్లలు నాకొద్దు అంటూ ముఖం చాటేస్తుంటారు. కానీ అదే సొరకాయతో ఇప్పుడు మనం చెప్పుకునే సింపుల్ పద్ధతిలో వేడివేడి చపాతీలు చేసి పెడితే.. ప్లేట్లు ఖాళీ చేసేస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆప్షన్ ఈ సొరకాయ చపాతీ. చాలా తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే దీన్నెలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read: ఆదివారం స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ టేస్ట్‌ను తలదన్నే సీక్రెట్ రెసిపీ ఇదే!
గోధుమపిండి – ఒక కప్పు
సొరకాయ తురుము – ఒక కప్పు
పచ్చిమిర్చి – రెండు (సన్నని తరుగు)
కొత్తిమీర, కరివేపాకు – కొద్దిగా
జీలకర్ర – ఒక టీస్పూన్
మిరియాల పొడి – అర టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి.. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. లాస్ట్‌లో టీస్పూన్ నూనె వేసి కలుపుకుని, పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
తర్వాత పిండిని ఉండలుగా చేసుకుని, పొడి పిండి చల్లుకుంటూ చపాతీల్లా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, చపాతీని వేసి రెండు వైపులా నూనె రాస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో మృదువైన సొరకాయ చపాతీలను ఆవకాయతో లేదా పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది.
Also Read: చపాతీ, పుల్కాల్లోకి బెస్ట్ కాంబినేషన్.. ఇంట్లోని పదార్థాలతో ‘కాజూ పనీర్ బుర్జీ’ తయారీ విధానం!