E-Paper
Advertisement

Eggless Omelette: ఎగ్ లేకుండానే ఆమ్లెట్.. ఇదిగో ఇలా తయారు చేయండి, భలే టేస్టీగా ఉంటుంది!

Eggless Omelette: ఎగ్ లేకుండానే ఆమ్లెట్.. ఇదిగో ఇలా తయారు చేయండి, భలే టేస్టీగా ఉంటుంది!

Eggless Omelette: సాధారణంగా ఆమ్లెట్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కోడిగుడ్లు. కానీ కొంతమంది గుడ్డు తినరు, మరికొంతమందికి ఆ వాసన పడదు. అలాగని ఆమ్లెట్ రుచిని మిస్ అవ్వాలా ఏంటి? గుడ్డు వాడకుండానే, అదే సాఫ్ట్‌నెస్, టేస్ట్‌తో అదిరిపోయే వెజ్ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. అయితే, ఇది మామూలు శనగపిండి అట్టులా కాకుండా, రెస్టారెంట్లలో దొరికే సాఫ్ట్ ఆమ్లెట్‌లా రావాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి.

పిండి కలుపుకునే విధానం:

ఎక్కువ శాతం శనగపిండితో మాత్రమే అట్లు వేస్తుంటాం. కానీ ఎగ్ ఆమ్లెట్ లాంటి మెత్తదనం రావాలంటే.. ఒక కప్పు శనగపిండికి, రెండు చెంచాల బియ్యపు పిండి, ఒక చెంచా కార్న్ ఫ్లోర్ కలపాలి. దీనిలో తగినంత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసి దోశ పిండి కంటే కొంచెం మందంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి భలే రుచిగా ఉంటుంది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర వేస్తే ఇంకా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.

Also Read: దూది లాంటి మెత్తని బన్ దోశ.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి దీనికి మించిన బెస్ట్ ఆప్షన్ లేదు!

ఫ్లఫీగా రావాలంటే?

హోటల్ స్టైల్లో ఆమ్లెట్ బాగా ఉబ్బి రావాలంటే.. పిండిని పాన్ మీద వేసే ముందే అందులో ఒక పావు స్పూన్ ENO లేదా చిటికెడు బేకింగ్ సోడా వేయాలి. దాని మీద కొంచెం నీళ్లు చల్లి కలిపితే పిండిలో గాలి చేరి ఆమ్లెట్ ఫ్లఫీగా తయారవుతుంది. పాన్ వేడెక్కాక నూనెతో పాటు కొంచెం వెన్న వేసి, ఈ బ్యాటర్‌ను కొంచెం మందంగా పోయాలి. మంట తగ్గించి మూత పెడితే, ఆ ఆవిరికి ఆమ్లెట్ భలే మెత్తగా ఉడుకుతుంది.

ఆ టేస్ట్ అదుర్స్ అంతే:

ఆమ్లెట్ రెండు వైపులా ఎర్రగా కాలాక, పైన కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా చల్లుకోండి. మీకు చీజ్ అంటే ఇష్టమైతే చివర్లో కొంచెం చీజ్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే.. ఇది ఎగ్ లేకుండా చేసిన ఆమ్లెట్ అంటే ఎవ్వరూ నమ్మరు చెప్పండి. వేడివేడి ఆమ్లెట్ మీద మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే ఇంట్లో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.

Also Read: కోవా బన్ ఎక్కడ బాగా ఫేమస్? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి?

Related News

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Big Stories

×