E-Paper
Advertisement

కల్మషం లేని రెండు మనసులను ‘దూరదర్శని’ ఎలా కలిపిందో తెలియాలంటే?.. ఫుల్ రివ్యూ.

కల్మషం లేని రెండు మనసులను ‘దూరదర్శని’ ఎలా కలిపిందో తెలియాలంటే?.. ఫుల్ రివ్యూ.
Advertisement

Doordarshini Review: సువిక్షిత్ బొజ్జ, గీతికా రతన్ జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో తెరకెక్కిన వింటేజ్ రూరల్ డ్రామా ‘దూరదర్శిని’ (కలిపింది ఇద్దరిని). 90వ దశకం నాటి పల్లెటూరి నేపథ్యం, నాస్టాల్జియా ఎలిమెంట్స్‌తో రూపొంది, ఈరోజే (మే 15న) థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం.

Read also-ఇళయరాజా మొదటి సినిమాకు 50 ఏళ్లు.. ‘మాస్ట్రో’ఎమోషనల్..

కథ

Advertisement

ఈ కథ 90ల కాలంలో మట్టిపర్రు అనే పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. హరి (సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన పేద యువకుడు. అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన వాణి (గీతికా రతన్) అంటే అతనికి ప్రాణం. వాణి కూడా హరిని ప్రేమిస్తుంది. అప్పట్లో ఊరిలో అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడంతో, వీరిద్దరూ ప్రతి శుక్రవారం ‘దూరదర్శిని’లో వచ్చే ‘చిత్రలహరి’ ప్రోగ్రామ్ చూడటానికి ఊరిలోనే పేక రాజు (భాస్కర్ గొడుగునూర్) అనే వ్యక్తి ఇంటికి వెళ్తుంటారు. ఆ టీవీనే వీరి ప్రేమకు వారధిగా మారుతుంది.

అయితే, స్త్రీ లోలుడైన పేక రాజు కన్ను వాణిపై పడుతుంది. ఆమె హరిని ప్రేమిస్తోందని తెలిసి, ఎలాగైనా వారిని విడదీయాలని కుట్రలు పన్నుతాడు. వాణి అన్నయ్య, ఊరి పెద్ద అయిన పరశురామ్ (విజయ్ కృష్ణారెడ్డి)ని రెచ్చగొట్టి ఊరిలో కులాల చిచ్చు పెడతాడు. ఈ పరిస్థితుల మధ్య హరి, వాణిల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? పేక రాజు కుట్రలను, కుల వివక్షను దాటి ఈ జంట ఎలా ఒకటయ్యారు? అరుణాచలంలో ఒక యాచకుడి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనకు, ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన సినిమా.

సినిమా ఎలా ఉందంటే..

Advertisement

90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని, దూరదర్శిని టీవీ చుట్టూ తిరిగే ప్రపంచాన్ని, చిత్రలహరి క్రేజ్‌ను దర్శకుడు బాగానే గుర్తుచేశారు. ఆ తరం ఆడియన్స్‌కు కొన్ని సీన్స్ పాత జ్ఞాపకాలను ఆవిష్కరిస్తాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో లవ్ ఎమోషన్స్, కుల వివక్ష చుట్టూ సాగే డ్రామా కాస్త సీరియస్‌గా సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. సునీల్ పొన్నం అందించిన విజువల్స్ పల్లెటూరి అందాలను, గోదావరి నేటివిటీని స్క్రీన్‌పై సహజంగా చూపించాయి. అంతస్తుల భేదాలు, కుల వివక్ష, ఊరి పెద్ద అడ్డుపడటం వంటివి మనం నైంటీస్ నుంచి చూస్తున్న పాత చింతకాయ పచ్చడి కథే.

కథ పరంగా ఎలాంటి కొత్తదనం లేదు. కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని అనవసరమైన సీన్స్, లవ్ ట్రాక్స్ ప్రేక్షకుడి ఓపికను పరీక్షిస్తాయి. 2 గంటల 5 నిమిషాల నిడివి ఉన్నా కూడా సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇటీవల వచ్చిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో ఫ్రెష్ ఫీలింగ్ మిస్ అయింది. నటీనటుల మేకప్, డ్రెస్సింగ్, క్యారెక్టరైజేషన్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది.

Read also-Nindu Noorella Saavasam Serial Today Episode May 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ నుంచి సీక్రెట్స్ తెలుసుకోవడానికి తీవ్రవాదల ప్లాన్     

నటీనటుల పనితీరు..

హీరో సువిక్షిత్ బొజ్జ పాత్రకు తగ్గట్టుగా పల్లెటూరి అబ్బాయిగా సింపుల్‌గా కనిపించినా, నటనలో, లుక్స్ పరంగా ఇంకా చాలా పరిణతి చెందాల్సి ఉంది. కొన్ని క్లోజప్ షాట్స్‌లో ఎమోషన్స్ సరిగ్గా పండలేదు. హీరోయిన్ గీతికా రతన్ పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా చక్కగా నటించింది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో భాస్కర్ గొడుగునూర్ నటన సినిమాకు ప్లస్ అయింది. జెమినీ సురేష్, భద్రం గ్రూప్ కామెడీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక విభాగం

దర్శకుడు కార్తికేయ కొమ్మి ఎంచుకున్న నాస్టాల్జియా పాయింట్ బాగున్నా, దాన్ని అంతే ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయారు. ఆనంద్ గుర్రన నేపథ్య సంగీతం పల్లెటూరి మూడ్‌ను సెట్ చేయడానికి సహకరించింది కానీ పాటలు అంతగా గుర్తుండవు. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది.

ప్లస్ పాయింట్స్

  • సినిమాలోని పల్లెటూరి వాతావరణం
  • హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్
  • క్లీన్ ఎమోషన్స్
  • సినిమాటోగ్రఫీ, లొకేషన్స్.

మైనస్ పాయింట్స్

  • కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం
  • స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా సాగడం.

 

మొత్తంగా… ‘దూరదర్శిని’ అనేది ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, పల్లెటూరి మనుషులు, వారి అమాయకత్వం ఎమోషన్స్ చుట్టూ సాగే ఒక సాదాసీదా గ్రామీణ కథా చిత్రం.  ఇలాంటి సినిమా చూడాలిసిందే ఒక సారి అయిన

రేటింగ్ – 2.75/ 5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×