E-Paper
Advertisement

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!
Advertisement

Chihuahua Commando: సాధారణంగా సైన్యం, పోలీస్‌ దళాల్లో కుక్కలంటే ముందుగా గుర్తొచ్చేది జర్మన్ షెపర్డ్‌, లాబ్రడార్‌ లాంటి పెద్ద జాతులే. కానీ, మెక్సికోలో మాత్రం ఓ చిన్న చివావా అడుగు పెట్టింది. దీని పేరు కమాండో. వయసు 13 నెలలు.. బరువు కేవలం 7 కిలోలు.. ఎత్తు 21 సెంటీమీటర్లు. ఇంత చిన్నగా ఉన్నప్పటికీ మెక్సికో నేషనల్ గార్డ్‌ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

చిన్న కుక్క.. పెద్ద బాధ్యత!

మెక్సికో నేషనల్ గార్డ్‌ లో దాదాపు 350 శునకాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా గాలింపు, భద్రత లాంటి పనులకు పేరున్న జర్మన్ షెపర్డ్‌ లు, లాబ్రడార్‌ రిట్రీవర్‌ లు ఉన్నాయి. వాటి మధ్య కమాండో మాత్రం పూర్తిగా భిన్నం. చిన్న శరీరంతో కనిపించే ఈ చివావాను అధికారులు కేవలం వేడుకల్లో చూపించేందుకు మాత్రమే ఉంచలేదు. ప్రస్తుతం దీనికి సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. మెక్సికో సిటీలో జరిగిన ఓ శిక్షణలో ఈ కమాండో మెట్లు ఎక్కుతూ, అడ్డంకులను దాటుతూ కనిపించింది. దాని పక్కనే రోకో అనే పెద్ద, పూర్తిగా శిక్షణ పొందిన కుక్క కూడా ఉంది.

పేరు వెనుక కూడా ఓ కథే..

Advertisement

ఈ కమాండోను మెక్సికో నేషనల్ గార్డ్ సుమారు ఆరు నెలల క్రితం దత్తత తీసుకుంది. ఉత్తర మెక్సికోలోని చివావా రాష్ట్రానికి చెందిన ఈ కుక్కను, వృద్ధ యజమానులు ఇకపై చూసుకోలేకపోవడంతో దళం స్వీకరించింది. ఇది చివావా రాష్ట్రం నుంచి రావడంతోనే దానికి ‘కమాండో’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే పేరు దాని ప్రత్యేక గుర్తింపుగా మారింది.

హెల్మెట్‌.. గాగుల్స్‌.. కెమెరా కూడా!

కమాండోను చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దాని చిన్న శరీరానికి సరిపోయేలా ప్రత్యేకమైన టాక్టికల్ జాకెట్‌ ను తయారు చేశారు. కళ్లకు చిన్న గాగుల్స్‌, తలకు చిన్న హెల్మెట్‌.. దానిపైనే కెమెరా కూడా అమర్చారు. పెద్ద జాతుల కుక్కలు ధరించే పరికరాలనే దాని సైజుకు తగ్గట్టుగా రూపొందించడం ఇప్పుడు కమాండోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. శిక్షణలో భాగంగా ఈ పరికరాలతోనే అది వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటోంది.

పరేడ్‌ నుంచి స్కూళ్ల వరకు..

Advertisement

కమాండో పని కేవలం శిక్షణకే పరిమితం కాలేదు. పౌర కార్యక్రమాలు, పాఠశాలల సందర్శనలు, సామాజిక కార్యక్రమాల్లోనూ  కనిపిస్తోంది. మెక్సికో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో కూడా కమాండో పాల్గొంది. దీంతో ప్రజల్లో దానిపై ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కమాండోకు సంబంధించిన మీమ్స్‌, యానిమేటెడ్ రూపాలు కూడా వైరల్ అవుతున్నాయి.

కమాండో ప్రజలకు నేషనల్ గార్డ్‌లోని మరో కోణాన్ని పరిచయం చేస్తోంది. యూనిఫాం వెనుక ఉన్న మనుషుల్లోనూ మానవీయత ఉందనే భావన ప్రజలకు చేరేలా చేస్తోందని లెఫ్టినెంట్ డెబోరా హెర్నాండెజ్‌ తెలిపారు. ప్రస్తుతం కమాండో శిక్షణ తీసుకుంటుందని.. అయినప్పటికీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటుందని ఆమె వెల్లడించారు.

Read Also: జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

Tags

Related News

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

ఇసుకను జల్లెడ పడితే బంగారం దొరుకుతుందట.. మునేరులో వింత వేట!

మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

పెట్రోల్‌ రూల్స్‌ లో బిగ్‌ చేంజ్‌.. లైసెన్సు లేకుండా బిజినెస్ చేస్తే ఇక అంతే సంగతులు!

ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

Big Stories

Advertisement
×