“అరేయ్.. ఇటు చూడండి భయ్యా! సుహాస్ అంటేనే ఒక మినిమం గ్యారెంటీ బ్రాండ్ అయిపోయింది. అసలు ముందు ‘హే భగవాన్’ అని పెట్టి, లాస్ట్ మినిట్ లో ‘బల్వంత్’ గా మార్చినప్పుడే మాకు ఏదో తేడా కొట్టింది. ఉన్నది ఉన్నట్టు, దంచి కొడితే ముచ్చట గిట్లుంటది:” మన రివ్యూ ఇంకా వెళ్తాము పద మరి !
హీరో కృష్ణ (సుహాస్ ) తన తండ్రి (నరేష్) నడుపుతున్న బిజినెస్ ఏమీటీ అని క్యూరాసిటీ ఉంటుంది కృష్ణ కి కానీ అది కొడుక్కి చిన్నప్పటి నుండి తెలియకుండా జాగ్రత్త పడుతున్న తండ్రి చివరికి ఎలా తెలిసింది. ఏమీ బిజినెస్ అది చేయదానికి కారణం. ఏంటి అ బిజినెస్ ఏంటి ?తెలిసాక హీరో కి అది చేయటం ఇష్టం లేదు . చివరికి ఆ బిజినెస్ చేస్తాడా లేదా అని సినిమా ? అనుకోకుండా హీరో కి ప్రాబ్లెమ్ రావటం .. లాడ్జి లో అందులో హీరోయిన్ అందులోకి ఎలా వస్తుంది అని తెలియాలి అంటే మీరు సినిమా చూడాలి మరి చివరకు తండ్రి చేసే బిజినెస్ కరెక్ట్ అని తెలుసుకొని తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకుని, ఆ లాడ్జిని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కమ్ కేర్ సెంటర్గా మార్చి, తండ్రి బిజినెస్ ని గౌరవప్రదంగా నిలబెట్టడమే ఈ సినిమా అసలు కథ.
సుహాస్: వీడు నటుడు కాదు భయ్యా.. ఒక ఎమోషన్! భయం వచ్చినా, నవ్వు వచ్చినా.. వాడు ఆ కళ్లతోనే పలికిస్తాడు. గీ సినిమాలో కూడా సుహాస్ తన మార్క్ యాక్టింగ్ తో సినిమాని భుజాన వేసుకున్నాడు. శివాని నాగారం: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ తర్వాత ఈ పిల్లకు మంచి రోల్ దొరికింది. పక్కింటి అమ్మాయి లెక్క పద్ధతిగా ఉంటూనే.. తన యాక్టింగ్ తో మెప్పించింది. ఈ జోడీ చూడటానికి మస్తు ముచ్చటగా ఉంది! ఇంకా ఇందులో నరేష్ , సుదర్శన్ , వెన్నల కిశోరె , బాబూమోహన్ కి అయితే ఒక్క డైలాగ్ లేదు మరి ! ఇక అజయ్ గోష్ కి మాత్రం సైరయినా పాత్ర పడలేదు మరి అనుకోవచ్చు .
వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకి ఒక రకమైన మూడ్ సెట్ చేసింది , కానీ విజువల్స్ మాత్రం కళ్లకు కట్టినట్టు ఉన్నాయి. డైరెక్టర్ గారు.. కథలో అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తది, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు మన సహనానికి పరీక్ష పెడతాయి. కానీ ఆ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ అండ్ ఎమోషన్ మాత్రం గుండెకి తగులుతది ! వెన్నెల కిశోర్, అజయ్ ఘోష్, సుదర్శన్ లాంటి మొనగాళ్లు ఉన్నప్పుడు నవ్వులకి కొదవ ఉండదు. దర్శకుడు గోపీ అచ్చర గారు “మనిషిని మనిషిలా చూడాలి” అనే పాయింట్ ను చాలా సున్నితంగా డీల్ చేశారు.”అరేయ్ భయ్యా.. సుహాస్ ని చూసి అందరూ ‘వీడు మనోడు రా’ అనుకుంటారు. అందుకే వాడు ఏం చేసినా జనం చూస్తారు. కాకపోతే, సుహాస్ గారు.. గీసారి కొంచెం కొత్త కథలు ట్రై చెయ్యి భయ్యా, ప్రతిసారి అదే ప్రేమకథ మల్లి రొట్ట కొట్టుడు అంటే మాకు కూడా కొంచెం ‘బల్వంత్’ గా అనిపిస్తది. అయినా పర్వాలేదు.. బొమ్మ అయితే పర్వాలేదు అనుకో మరి !” ఈ సారికి ఇట్లా కన్నియ్యే మరి.
నరేష్ గారి యాక్టింగ్: అరేయ్ భయ్యా.. ఈ సినిమాకి అసలైన హీరో నరేష్ గారే! ఒక బాధ్యత గల తండ్రిగా, ఆ మనసున్న మనిషిగా ఆయన చేసిన నటన చూస్తుంటే.. మన నాయన గుర్తొస్తాడు. పక్కా ప్రాణం పోసిండు!
సుహాస్ మార్క్ ఎమోషన్: సుహాస్ అంటేనే మన పక్కింటి కుర్రాడు. ఎంబీఏ చదివిన కుర్రాడిగా మొదట ప్రాక్టికల్ గా ఉండి, తర్వాత తండ్రి బాధను అర్థం చేసుకునే కొడుకుగా ఎమోషన్లు పండించడంలో సుహాస్ మళ్ళీ హిట్టు కొట్టిండు.
కామెడీ గ్యాంగ్: వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆయనతో పాటు సుదర్శన్, అజయ్ ఘోష్ అక్కడక్కడ వేసే పంచులు సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చాయి.అని చెప్పుకోవచ్చు
మెయిన్ పాయింట్: “మనిషిని మనిషిలా చూడాలి” అనే పాయింట్ ఏదైతే ఉందో.. అది గుండెకు హత్తుకునేలా ఉంది.
ఎడిటింగ్ & విజువల్స్: సినిమా లెంత్ మరీ ఎక్కువ లేకుండా నీట్ గా ఎడిట్ చేశారు. వాతావరణాన్ని వివేక్ సాగర్ మ్యూజిక్ తో కలిపి బాగా చూపించారు.
స్లో నెరేషన్: సినిమా కథ కొంచెం నెమ్మదిగా సాగుతది భయ్యా. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు “ఎప్పుడైతది రా బాబు” అన్నట్టు కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి.
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం: అరేయ్.. ఇది పక్కా క్లాస్ అండ్ ఎమోషనల్ సినిమా. ఊర మాస్ ఫైట్లు, ఐటెం సాంగులు, గాల్లో లేచే విలన్లు కావాలనుకునే మాస్ ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టొచ్చు.
ప్రెడిక్టబిలిటీ: కథ అక్కడక్కడ మనం ఈజీగా గెస్ చేసేలా ఉంటది. అంటే తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలిసిపోవడం వల్ల కొంచెం కిక్ తగ్గుతది.
లవ్ స్టోరీ: సుహాస్-శివాని మధ్య లవ్ ట్రాక్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండు అనిపిస్తది. అసలు లేదు అనుకోండి