E-Paper
Advertisement

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?
Advertisement

Kiku Chiranjeevi:ప్రముఖ డైరెక్టర్ శుభా సాయి వెంకట్ దర్శకత్వంలో కికు యనమల, కశిష్ ఖాన్, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కికు చిరంజీవి. దీప్తి నడిమింటి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే విషయాలు ఈ చిత్ర రివ్యూలో చూద్దాం..

కికు చిరంజీవి మూవీ స్టోరీ..

చిరంజీవి ( కికు యనమల) జీవితమే ఒక విచిత్రమైన రహస్యం.అరుదైన డెక్స్ట్రోకార్డియా కారణంగా అతని గుండె సాధారణంగా ఉండాల్సిన ఎడమవైపు కాకుండా కుడివైపు ఉంటుంది. అనాథగా పెరిగిన చిరంజీవి ఫోటోగ్రాఫర్ గా జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు మను ( కశిష్ ఖాన్) కూడా అనాథే. తన జీవితంపై , కుటుంబం అనే బంధంపై ఆమెకు కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను కనడం లేదా పెంచడం విషయంలో ఆమె పెట్టుకునే షరతులు కథకు ఒక ప్రత్యేకమైన నేపథ్యాన్ని తీసుకొస్తాయి. అనుకోకుండా కలిసిన చిరంజీవి, మను మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది.. రోడ్డు ట్రిప్, ఫారెస్ట్ లో జరిగే పరిణామాలు, ఊహించని ప్రమాదాలు వారి బంధాన్ని మరింత దగ్గర చేస్తాయి. ఈ ప్రయాణంలో చిరంజీవి గతానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా బయటపడతాయి.
ధనవంతురాలైన ఓ మహిళ పాత్ర ప్రవేశంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. చివరకు వీరిద్దరి వివాహం జరుగుతుంది.అసలు కథ మాత్రం పెళ్లి తర్వాతే మొదలవుతుంది.

Advertisement

ఫస్ట్ నైట్ ముగిసిన మరుసటి రోజు, మను జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసే విషయం గమనిస్తుంది. ఎప్పుడూ కుడివైపు వినిపించే చిరంజీవి గుండె చప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపు వినిపిస్తుంది. రాత్రికి రాత్రే గుండె స్థానం ఎలా మారింది? మను పక్కన ఉన్న వ్యక్తి నిజంగానే చిరంజీవినా? లేక అతడి రూపంలో మరెవరైనా ఉన్నారా?
ఈ మిస్టరీ వెనుక ఉన్న మాస్క్ మ్యాన్ ఎవరు?ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ:

ఒక అరుదైన మెడికల్ కండిషన్‌ను కేవలం సెంటిమెంట్ కోసమో లేదా పాత్రకు ప్రత్యేకత ఇవ్వడానికో ఉపయోగించకుండా, దాన్నే కథలోని ప్రధాన సస్పెన్స్ ఎలిమెంట్‌గా మార్చే ప్రయత్నం చేశారు దర్శకుడు శుభ సాయి వెంకట్. కాన్సెప్ట్ స్థాయిలో చూస్తే ‘కికు చిరంజీవి’లో కొత్తదనం ఉంది.ఫస్ట్ హాఫ్ ప్రధానంగా పాత్రల పరిచయం, హీరో–హీరోయిన్ మధ్య రిలేషన్, వారి ప్రయాణం చుట్టూనే తిరుగుతుంది. కొన్ని రోడ్ ట్రిప్, ఫారెస్ట్ సీక్వెన్స్‌లు కథకు అవసరమైన బ్యాక్‌డ్రాప్‌ను అందించినప్పటికీ, నరేషన్ అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా కథ అసలు పాయింట్‌లోకి వెళ్లడానికి తీసుకున్న సమయం కొంతమందికి సహన పరీక్షగా అనిపించవచ్చు.అయితే ఇంటర్వెల్‌కు వచ్చేసరికి సినిమా ఒక్కసారిగా తన అసలు ట్రాక్‌లోకి వస్తుంది.

Advertisement

నిన్న కుడివైపు ఉన్న గుండె చప్పుడు… ఈ రోజు ఎడమవైపు ఎందుకు ఉంది?” అనే ప్రశ్నతో వచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇదే పాయింట్ సెకండాఫ్‌కు ప్రధాన బలం.

సెకండాఫ్‌లో సినిమా పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్‌లోకి మారుతుంది. భర్త ప్రవర్తనలో కనిపించే చిన్నచిన్న మార్పులు, వాటిని గమనిస్తూ హీరోయిన్ పడే మానసిక సంఘర్షణ, ఒక్కొక్కటిగా బయటపడే రహస్యాలు ప్రేక్షకుడిని కథతో పాటు ప్రయాణించేలా చేస్తాయి.

దర్శకుడు కొన్ని చోట్ల మంచి సస్పెన్స్ వాతావరణాన్ని సృష్టించడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకబోతుందనుకునే సమయంలో మరో అనుమానాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తిని నిలబెడుతుంది.కానీ ఈ ప్రయాణంలో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తాయి.

కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్‌కు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతాయి. కొన్ని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరింత బలమైన స్క్రీన్‌ప్లేతో వివరించి ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. అలాగే కొన్ని చోట్ల సస్పెన్స్‌ను మరింత టైట్‌గా నడిపే అవకాశం ఉన్నప్పటికీ, డ్రామా వైపు ఎక్కువగా వెళ్లడం వేగాన్ని తగ్గిస్తుంది.

క్లైమాక్స్‌లో కథకు సరైన ముగింపు ఇచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ, అంతకుముందు పెంచిన సస్పెన్స్ స్థాయికి తగ్గట్టుగా చివరి డ్రామా మరింత పవర్‌ఫుల్‌గా ఉండి ఉంటే ప్రేక్షకుడికి మంచి హై ఇచ్చేది.

నటీనటుల ప్రతిభ:

కికు యనమల పాత్రలోని విభిన్న షేడ్స్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను తన హావభావాలతో డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడం అతడికి ప్లస్ అయింది. సినిమా మొత్తం అతడి పాత్ర చుట్టూనే తిరగడంతో బాధ్యతను బాగానే మోశాడు.

కశిష్ ఖాన్ పాత్రకు సెకండాఫ్‌లో మంచి స్కోప్ దొరికింది. అనుమానం, అయోమయం, భయం, నిజం తెలుసుకోవాలనే ఆత్రుత వంటి భావాలను ఆమె సమర్థంగా పలికించే ప్రయత్నం చేసింది.

ఈశ్వరీరావు తన అనుభవంతో పాత్రకు బలం చేకూర్చారు. శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ల భరణి వంటి అనుభవజ్ఞులైన నటులు తమ పాత్రల పరిధిలో కథకు సపోర్ట్ అందించారు. ఇతర నటీనటులు కూడా కథ అవసరానికి తగ్గట్టుగా కనిపించారు

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు కథ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ మూడ్‌ను పెంచడంలో సహాయపడింది.కెమెరా వర్క్ కొన్ని సన్నివేశాల్లో కథకు అవసరమైన మిస్టీరియస్ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండి, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేది.

also read:రైతులపై హైపర్ ఆది ఎమోషనల్ కామెంట్స్!

ప్లస్ పాయింట్స్:

అరుదైన మెడికల్ కాన్సెప్ట్‌ను మిస్టరీగా మలచిన విధానం

ఇంటర్వెల్‌లో వచ్చే ఆసక్తికరమైన ట్విస్ట్

సెకండాఫ్‌లోని కొన్ని సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్
కికు యనమల, కశిష్ ఖాన్ నటన
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్‌లో నెమ్మదిగా సాగే నరేషన్

కొన్ని చోట్ల లాజిక్ లోపించడం

మరింత టైట్‌గా ఉండాల్సిన స్క్రీన్‌ప్లే

క్లైమాక్స్ డ్రామా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం..

చివరి ఆఖరి మాటగా :

‘కికు చిరంజీవి’ ఒక కొత్త పాయింట్‌తో రూపొందిన మెడికల్ మిస్టరీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్‌లో ఓపికగా సాగాల్సి వచ్చినా, ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సినిమా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. సెకండాఫ్‌లోని మిస్టరీ ఎలిమెంట్స్, నటీనటుల ప్రయత్నం సినిమాను నిలబెడతాయి.
అయితే స్క్రీన్‌ప్లే ఇంకాస్త పటిష్టంగా ఉండి, లాజిక్‌కు సంబంధించిన లోపాలను తగ్గించి, క్లైమాక్స్‌ను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దితే ఈ కాన్సెప్ట్ మరింత బలమైన థ్రిల్లర్‌గా నిలిచేది.కొత్త తరహా కాన్సెప్ట్‌తో, కొన్ని మంచి ట్విస్టులతో సాగే డీసెంట్ వన్‌టైమ్ మెడికల్ మిస్టరీ థ్రిల్లర్.

Kiku Chiranjeevi Movie Rating: 2.75 / 5

Related News

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×