Irumudi Movie Review: మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఈ ఏడాది చివరిగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈసారి సక్సెస్ కోసం ఏకంగా జానర్ మార్చేశారు. ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి డివోషనల్ యాడ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ (Siva nirvana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇరుముడి (Irumudi). జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతాన్ని అందించగా.. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీగా పని చేశారు. మరి ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? జానర్ మార్చిన రవితేజ కి కలిసొచ్చిందా? ఆడియన్స్ ఏమంటున్నారు? తదితర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సీలేరు పరిసరాల్లోని ఒక ప్రశాంతమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) , కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో సంతోషంగా జీవించే వ్యక్తి త్రినాథ్ (రవితేజ). అయ్యప్ప భక్తుడిగా క్రమశిక్షణతో ఉండే అతనికి కుటుంబమే సర్వసం. అయితే ఆ ప్రాంతంలో స్కూల్ కి వెళ్లే కొందరు బాలికలు అనుమానాస్పద స్థితుల్లో ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతుంది. ఈ సంఘటనలకు సంబంధించిన ఒక కీలక విషయం త్రినాథ్ కూతురికి తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత తన బిడ్డతో పాటు గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు త్రినాథ్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
also read:స్పిరిట్ మూవీ నుండి దీపికాను తొలగించడంపై సందీప్ సోదరుడు క్లారిటీ!
డైరెక్టర్ శివ నిర్మాణ భక్తి, కుటుంబ అనుబంధం, ఆడపిల్లల రక్షణ వంటి అంశాలను కలిపి కథను నడిపే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ గ్రామీణ వాతావరణం, తండ్రి కూతురు అనుబంధం, భక్తి నేపథ్యం ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి భాగం పెద్దగా హడావిడి లేకుండా చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే మలుపు కథకు అవసరమైన వేగాన్ని తీసుకొస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా సీరియస్ టోన్ లోకి వెళ్ళిపోతుంది. కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులు, తండ్రి ఆవేదన , సామాజిక సమస్య చుట్టూ వచ్చే సన్నివేశాలు ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని చోట్ల కథను మరింత కుదించి ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త బలంగా ఉండేది అనే అభిప్రాయం ఆడియన్స్ లో కలుగుతోంది. కొన్ని పరిణామాలు ముందుగానే ఊహించగలిగేలా ఉండడం కూడా సినిమా కథకు మైనస్ అనే చెప్పాలి.
రవితేజ తనకు అలవాటైన మాస్ ఎనర్జీకి భిన్నంగా చాలా సాధారణమైన తండ్రి పాత్రలో కనిపించారు. పాత్రలోని బాధ, ఆవేదనను ఓవర్ చేయకుండా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో రవితేజ నటన ఆకట్టుకుంది. సాయికుమార్ తనదైన పాత్ర చేయడం జరిగింది . అయితే సాయికుమార్ పాత్రలో ఒక బ్లెండర్ మిస్టేక్ జరిగింది. అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక చిన్నారి నక్షత్ర చెప్పుకోదగ్గ బలమైన అంశాలలో ఆమె నటన ఒకటి. అమాయకత్వం, భయం భావోద్వేగాలను చాలా చక్కగా పలికింది. ఇక కుటుంబాన్ని మోసుకెళ్ళే తల్లి పాత్రలో సహజమైన నటనతో ప్రియా భవాని శంకర్ మెప్పించింది. అజయ్ ఘోష్, సాయికుమార్ తమ అనుభవంతో కీలకపాత్రలకు మరింత బలం చేకూర్చారు.
రవితేజ నుంచి వచ్చిన విభిన్నమైన తండ్రి పాత్ర
తండ్రీ – కూతురు అనుబంధం
సామాజిక బాధ్యతను గుర్తుచేసే కథాంశం
నేపథ్య సంగీతం
సహజమైన గ్రామీణ విజువల్స్
అక్కడక్కడ నెమ్మదించే కథనం
కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండటం
సెకండ్ హాఫ్ లో సాగదీత
కొన్ని సీరియస్ ఎపిసోడ్స్ అందరికీ కంఫర్ట్ గా అనిపించకపోవచ్చు.
భక్తి ఉంది.. బాధ్యత ఉంది.. మెసేజ్ కూడా గట్టిగానే ఉంది.. కానీ కథ మాత్రం అయ్యప్ప మాల వేసుకున్నట్టే కాస్త నెమ్మదిగా సాగుతుంది . రవితేజ కొత్త లుక్ బాగుంది కానీ మాస్ కి మాత్రం ఇరుముడి కాస్త తేలిగ్గానే అనిపిస్తుంది.బి సోషల్ డ్రామాను ఇష్టపడే వారికి ఇరుముడి ఒకసారి చూడదగ్గ చిత్రం అని చెప్పవచ్చు.