E-Paper
Advertisement

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?
Advertisement

Palla Burusu Movie Review: ‘పళ్ళ బురుసు’…మొదటగా ఈ సినిమా గురించి ఎక్కడా పెద్దగా వినబళ్ళేదు ,కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా నాగార్జుననే ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేయడం తో సినిమా ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపించింది.

సినిమా లో కేవలం పళ్ళ బురుసు కొనివ్వకపోవడం వల్లే కొడుకు కేసు వేశాడు అన్న కథ తో ఈ సినిమా తెరకెక్కింది అని వినిపించడం తో అసలు సినిమా ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపించింది,మరి క్యూరియాసిటీని దర్శకుడు ఉదయ్ చౌహాన్ హోల్డ్ చేయగలిగాడా ..?తొలి సినిమాతో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నాడా ?చూసేద్దాం.

కథ

Advertisement

కథ విషయానికి వస్తే శంబు అనే పెద్దమనిషి తెలంగాణ లోని ఒక పల్లెటూరిలో జీవిస్తుంటాడు.అతనికి వయసు మీద పడుతుండటంతో వయసు రీత్యా వచ్చే పళ్ళ సమస్యలు అతడిని వెంటాడుతాయి.దీంతో డాక్టర్ ఇక వేపపుల్లలు వాడింది చాలు ఒక మంచి టూత్ బ్రష్ కొనుక్కోమని సలహా ఇస్తాడు.దాంతో నాకు పళ్ళ బ్రష్ కొనివ్వమని కొడుకుని అడుగుతాడు .

అయితే తన పనుల్లో పడి బిజీగా ఉన్న తండ్రి మాటని పట్టించుకోడు,పైగా తనకి తెలీకుండానే తన మనవరాలి పెళ్లి చేయడంతో బాగా హార్ట్ అయిపోతాడు.దానితో అసలు తన కొడుకు తనని పట్టించుకోవట్లేదు అన్న బాధ,కోపంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాడు.ఇక అది కాస్తా చిన్నగా మొదలై చివరికి కోర్టు మెట్లు ఎక్కుతుంది. మరి నిజంగానే శంభు టూత్ బ్రష్ కోసమే కేసు పెట్టాడా లేక మరేదైనా కారణం ఉందా ?అసలు అతని మనసులో ఉన్న బాధ ఏంటి ?చివరికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య ఎలా పరిష్కారం అయింది అన్నదే సినిమా

కథనం 

Advertisement

‘పళ్ళ బురుసు’ కథలో మంచి పాయింట్ ఉంది. ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రులు చివరి దశలో పిల్లల ప్రేమ, గౌరవం కోసం ఎదురుచూసే పరిస్థితిని ఒక చిన్న సంఘటనతో చెప్పాలనుకోవడం ఆసక్తికరంగా ఉంది.

ఫస్ట్ హాఫ్‌లో సినిమా స్లోగా సాగుతుంది. టూత్ బ్రష్ చుట్టూ కథ మొదలవుతుందని ఆసక్తిగా చూస్తున్న సమయంలో లవ్ ట్రాక్, పెళ్లి సన్నివేశాలు రావడంతో మెయిన్ పాయింట్ పక్కకు వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్‌లో కోర్టు డ్రామా మొదలవడంతో కథ కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఒక చిన్న టూత్ బ్రష్ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం అనే ఐడియా బాగానే ఉంటుంది.

అయితే కోర్టులో వచ్చే కొన్ని సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. భూమి పంచాయితీకి సంబంధించిన ఎపిసోడ్లు కూడా కథను మరింత సాగదీసినట్టుగా అనిపిస్తాయి. తండ్రి, కొడుకుల మధ్య ఉండాల్సిన అసలు సంఘర్షణను బలంగా చూపించి ఉంటే ఈ భాగం మరింత బాగా వర్కౌట్ అయ్యేది.

సినిమాకు అసలు బలం చివరి భాగమే. ఇంతవరకు బ్రష్ కోసం నడిచిన గొడవ వెనుక అసలు కారణం బయటకు వచ్చినప్పుడు కథకు ఒక ఎమోషనల్ కనెక్షన్ వస్తుంది.

ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయి. శంభు పాత్రలో సుధాకర్ రెడ్డి తన నటనతో సినిమాను నిలబెట్టారనే చెప్పాలి .. క్లైమాక్స్‌లో ఆయన పలికించే బాధ, ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి.

నటీనటులు ఎలా చేశారు?

శంభు పాత్రలో సుధాకర్ రెడ్డి చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా చివరి సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు పెద్ద ప్లస్.కొడుకు తిరుపతి పాత్రలో మురళీధర్ గౌడ్ కూడా ఆకట్టుకున్నారు. .ప్రజ్వల్, గోమతి తమ పాత్రల పరిధిలో ఓకే అనిపించారు. అయితే వీరి లవ్ ట్రాక్‌కు ఇచ్చిన స్క్రీన్ టైమ్ కథకు అంతగా ఉపయోగపడలేదనే చెప్పాలి.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

వినోద్ బంగారి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. పవన్ సీహెచ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని ఎమోషనల్ సీన్లలో బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషన్‌ను ఎలివేట్ చేయడంలో సంగీతం సహకరించింది.

ప్లస్ పాయింట్స్

* డిఫరెంట్ కాన్సెప్ట్
* సుధాకర్ రెడ్డి సహజమైన నటన
* క్లైమాక్స్‌లో ఎమోషన్
* మురళీధర్ గౌడ్ కామెడీ

మైనస్ పాయింట్స్

* స్లోగా సాగే కథనం
* అవసరం లేని లవ్ ట్రాక్
* బలంగా లేని తండ్రీకొడుకుల కాన్ఫ్లిక్ట్
* కొన్ని సిల్లీ కోర్టు సన్నివేశాలు

చివరికి 

‘పళ్ళ బురుసు’లో పాయింట్ కొత్తగా ఉంది. వృద్ధ తల్లిదండ్రుల ఒంటరితనం, పిల్లల నిర్లక్ష్యం వంటి సీరియస్ విషయాన్ని ఒక టూత్ బ్రష్ చుట్టూ కథగా చెప్పాలనుకోవడం మంచి ప్రయత్నమే. కానీ ఆ పాయింట్‌కు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేను టైట్‌గా రాసి ఉంటే సినిమా మరింత బలంగా ఉండేది.

ఓవరాల్‌గా చూస్తే.. మంచి పాయింట్ ఉంది.. ఎమోషన్ ఉంది.. కానీ ఎగ్జిక్యూషన్‌లోనే తేడా కొట్టింది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి చూడొచ్చు.

Palla Burusu Movie Review &Rating : 2/5

Tags

Related News

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ: సూర్య ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి?

‘అగధ’ మూవీ రివ్యూ.. కామాక్షి ఖాతాలో హిట్ పడినట్లేనా..?

డీ.సీ.మూవీ రివ్యూ.. హీరోగా లోకేష్ కనగరాజ్ పర్ఫామెన్స్ ఎలా ఉంది?

జీ.డీ.నాయుడు మూవీ రివ్యూ.. బయోపిక్ లో ఆర్.మాధవన్ మెప్పించారా?

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?

Big Stories

Advertisement
×