E-Paper
Advertisement

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”
Advertisement

Yash Toxic Movie Review: ప్రముఖ కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో మాలీవుడ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో ఆగస్టు 26న ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం టాక్సిక్(Toxic).ఇందులో యశ్ డ్యూయల్ షేడ్స్ లో నటించారు. రాయ, టికెట్ అనే రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఇందులో కియారా అద్వానీ (Kiara Advani), నదియా(Nadiya ) పాత్ర పోషించగా.. నయనతార (Nayanthara) గంగా పాత్ర తారా సుతారియా (Tara sutharia), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), హుమా ఖురేషి (Huma Qureshi) తదితరులు కీలకపాత్రలు పోషించారు . వెంకట్ కె నారాయణ, యశ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా.. ఇంటెన్స్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాల మధ్య ఊహించని ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అసలు ఆడియన్స్ ను మెప్పించిందా? ఈ సినిమా కథ ఏంటి? రివ్యూ ? తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.

యశ్ టాక్సిక్ మూవీ రివ్యూ..

అనాధలుగా పెరిగిన అక్కాతమ్ముళ్లు గంగ (నయనతార), రాయ (యశ్). పరిస్థితుల ప్రభావంతో చిన్నప్పుడే ఆయుధం పట్టిన రాయ.. పెద్దయ్యాక ఘోర నేర సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఆ గ్యాంగ్ స్టర్ లైఫ్ లోకి నదియా (కియారా అద్వానీ) ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అనుకోని పరిస్థితుల్లో రాయకు నదియా దూరమవుతుంది. అలా నదియా ఎందుకు దూరమైంది? వారి బిడ్డ టికెట్ (మరో పాత్రలో యశ్) తన తండ్రిని కలిశాడా? తండ్రీ కొడుకుల మధ్య సాగిన రౌద్ర పోరాటం ఏ తీరానికి చేరింది? అనేది తెరపై చూడాల్సిందే.

టాక్సిక్ మూవీ ప్లస్ పాయింట్స్..

Advertisement

యశ్ వన్ మ్యాన్ షో.. రాయ, టికెట్ పాత్రల్లో యశ్ నటన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్లు అదిరిపోయాయి. రాఖీ భాయ్ వైబ్స్ మళ్ళీ కనిపిస్తాయి.

హాలీవుడ్ తరహా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు , రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ ,గ్రాండ్ మేకింగ్ విలువలపై ఎక్కడా రాజీ పడకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు.

Advertisement

నయనతార మరొకసారి తన గంభీరమైన నటనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. కియారా అద్వానీ భావోద్వేగాల పాత్ర ప్రధమార్ధానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇంటర్వెల్ సీన్స్, ట్విస్టులు సినిమాపై ఊహించని ఆసక్తిని పెంచేసాయి.

సినిమా మైనస్ పాయింట్స్..

మితిమీరిన రక్తపాతం , కథ, బలమైన భావోద్వేగాల కంటే చేతులు , కాళ్లు తెగే వయలెన్స్ , కాల్పుల మోతకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

సెకండ్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఘర్షణ ఆశించినంత ప్రభావంతంగా రాసుకోలేదు. లెక్కలేనన్ని పాత్రలు భారీ డైలాగులతో ల్యాగ్ బాగా పెరిగింది.

పాశ్చాత్య గ్యాంగ్ స్టార్ శైలి ప్రభావంతో కొన్ని సన్నివేశాలు సాధారణ ప్రేక్షకుడికి అంత త్వరగా కనెక్ట్ కావు.

చివరి ఆఖరి మాటగా..

యాక్షన్ ప్రియులకు , యశ్ ఫ్యాన్స్ కు పసందైన రక్తపాత విందు ఇది. కానీ కేజీఎఫ్ స్థాయి సెంటిమెంటు, డ్రామా ఆశించి వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు.

Toxic Movie Rating: 1.75/5

Related News

మయూఖ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

చకోర మూవీ రివ్యూ..

రివ్యూ: కామ్రేడ్‌ కళ్యాణ్‌.. మెప్పించిండా? 

‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. ప్రేమ గెలిచిందా? తండ్రి మాట గెలిచిందా?

‘అనకాపల్లి’ మూవీ రివ్యూ..రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ మెప్పించిందా?

సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ … సీఎం కొడుకు హిట్ కొట్టాడా?

‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ మూవీ రివ్యూ.. ఆఖరి చిత్రం ఎలా ఉందంటే?

తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ హిట్ కొట్టాడా?

Big Stories

Advertisement
×