E-Paper
Advertisement

Humming Bridge: కూని రాగాలు తీసే రైల్వే వంతెన.. ఎక్కడుందో తెలుసా?

Humming Bridge: కూని రాగాలు తీసే రైల్వే వంతెన.. ఎక్కడుందో తెలుసా?
Advertisement

Glenfinnan Viaduct Humming Bridge: ప్రపంచ వ్యాప్తంగా బోలెడు వింతైన రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిలు కాగా, మరికొన్ని సముద్రం మీదుగా, దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా, ఇంకొన్ని ఎడారులలో నిర్మించిన రైల్వే మార్గాలు ఉన్నాయి. రీసెంట్ గా భారత్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, మనం ఇప్పుడు ప్రపంచంలోనే యూనిక్ రైల్వే వంతెన గురించి తెలుసుకుందాం.

కూని రాగాలు తీసే అద్భుతమైన వంతెన!

అవును.. మీరు విన్నది నిజమే. ప్రపంచంలో కూని రాగాలు తీసే రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంది. బ్రిడ్జి పాటలు పాడటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది ముమ్మాటికీ నిజం. అరుదైన లక్షణం కలిగిన ఈ బిడ్జి స్కాట్లాండ్‌ లో ఉంది. దానికి పేరు గ్లెన్‌ఫిన్నన్ వయాడక్ట్ (Glenfinnan Viaduct). దీనిని హ్యారీ పోటర్ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ చుట్టుపక్కల స్కాటిష్ సంప్రదాయ సంగీతం వస్తుంది. అర్థరాత్రి సమయంలో ఈ బ్రిడ్జి నుంచి సన్నటి శ్రావ్యమైన హమ్మింగ్ వినిపిస్తుంది. ఎంతో వీనులు విందుగా ఉంటుంది. అయితే, ఈ సంగీతం ఎలా వస్తుంది? అని తెలుసుకునేందుకు చాలా మంది పరిశోధకులు ప్రయత్నించారు. కానీ, ఎలాంటి విషయాన్ని కనిపెట్టలేకపోయారు. అక్కడి అట్మాస్పియర్ కారణంగా బ్రిడ్జి నుంచి ఒకరమైన మ్యూజిక్ వస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే.. ఆ మ్యూజిక్ మనుషుల చెవులకు వినిపించినప్పటికీ, రికార్డింగ్ కు చిక్కడం లేదు.

Advertisement

Read Also: 580 అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ హోటల్, దుబాయ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

గ్లెన్‌ఫిన్నన్ వయాడక్ట్ గురించి..

ఇది స్కాట్లాండ్ హైలాండ్స్‌ లో, లోచ్ షీల్ (Loch Shiel) సరస్సు పక్కన ఉంటుంది. ఫోర్ట్ విలియం నుంచి సుమారు 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. దీనిని1897-1901 మధ్య నిర్మించారు. 21 ఆర్చ్‌లతో 380 మీటర్ల పొడవు, 30 మీటర్ల ఎత్తులో ఉంది. స్కాట్లాండ్‌ లోనే అతి పెద్ద కాంక్రీట్ రైల్వే బ్రిడ్జ్ గా గుర్తింపు తెచ్చుకుంది.  హ్యారీ పోటర్ సినిమాల్లో హాగ్వార్ట్స్ ఎక్స్‌ ప్రెస్ ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్లే సీన్స్ ఉంటాయి. అందుకే చాలా మంది దీనిని హ్యారీపాటర్ బ్రిడ్జి అని పిలుస్తారు.  ఈ బ్రిడ్జ్ మీదుగా జాకోబైట్ అనే పాతకాలపు స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ప్రయాణిస్తుంది. రోజుకు 2 నుంచి 4 సార్లు సీజన్ బట్టి రాకపోకలు కొనసాగిస్తుంది. ఆ సమయంలో హార్న్ మోగుతూ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ చూడటానికి బెస్ట్ వ్యూపాయింట్స్ ఉన్నాయి. అక్కడ బ్యాగ్‌ పైపర్లు ఆడుతూ కూనిరాగాలు తీస్తుంటారు. ఒకవేళ మీరు కూడా స్కాట్ లాండ్ కు వెళ్తే తప్పకుండా ఈ బ్రిడ్జిని చూసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలోనే వింతైన బ్రిడ్జిని చూసిన అనుభూతి పొందండి!

Advertisement

Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

Big Stories

Advertisement
×