E-Paper
Advertisement

రైతులపై హైపర్ ఆది ఎమోషనల్ కామెంట్స్!

రైతులపై హైపర్ ఆది ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు హైపర్ ఆది (Hyper Aadi). ఎప్పుడూ అదిరిపోయే పంచ్ డైలాగులతో సోషల్ మీడియాలో రచ్చ లేపే ఈయన.. అటు సినిమాలలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఇటు షోలలో సందడి చేస్తూ బిజీగా మారారు హైపర్ ఆది. తనదైన కామెడీతో అందరినీ నవ్వించే హైపర్ ఆది తాజాగా రైతుల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లకు అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతేకాదు ఆయన చేసిన కామెంట్లు ఆలోచింప చేస్తున్నాయని చెప్పాలి.

రైతులపై హైపర్ ఆది కామెంట్స్..

విషయంలోకి వెళ్తే .. ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ పంచెస్ కి సంబంధించిన ఒక ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో డైరెక్టర్ ఎమ్మెస్ రాజు(MS Raju ) తన అగధ చిత్ర బృందం తో వచ్చి సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సీరియల్ నటుడు వర్షాల కారణంగా పంట నీటిలో మునిగిపోయి.. చేతికి రాక.. కౌలు దారులకు కౌలు కట్టలేక అప్పుల ఊబిలో మునిగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక స్కిట్ చేశారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ..” నేను కచ్చితంగా నమ్ముతున్నాను.. ఫ్యూచర్లో సిస్టంతో పని చేసే వాడికంటే ఇలా కష్టంతో పనిచేసే వాడికే ఎక్కువ వ్యాల్యూ ఉంటుందని నేను నమ్ముతున్నాను” అంటూ తెలిపారు.

Advertisement

also read:మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!

సహాయం చేసే చేతులు ఎక్కడ – హైపర్ ఆది

ఆది మాట్లాడుతూ..” వ్యవసాయంలోనే సాయం ఉందంటారు.. వాళ్లు కష్టపడి అందరికీ తిండి సహాయం చేస్తున్నారు. కానీ వారికి మాత్రం ఎవరు సహాయం చేయట్లేదు” అంటూ రైతులకు సహాయం చేసే చేతులు ఎక్కడ? అంటూ హైపర్ ఆది కామెంట్లు చేశారు. మొత్తానికైతే రైతుల గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి చేసిన ఈ స్కిట్, ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

టాలెంట్ కు వేదికగా నిలుస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ..

Advertisement

ఇకపోతే బుల్లితెరపై ఎన్నో చానల్స్ లో ఎన్నో షోలు ప్రసారమవుతున్నాయి. అయితే ఆ షోలలో సెలబ్రిటీలు మాత్రమే వచ్చి సందడి చేస్తున్నారు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఎంతోమంది మారుమూల గ్రామాల నుండి తమలోని టాలెంట్ను నిరూపించుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ పెద్ద వేదికగా నిలుస్తోంది. జానపద కళలను మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా అంతరించిపోతున్న కళలకు సంబంధించిన విషయాలను కూడా ఈ వేదికపై చూపెడుతూ ఆ కళలకు ప్రాణం పోస్తున్నారు. అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ టాలెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు రష్మీ హోస్ట్ గా వ్యవహరించగా.. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×