E-Paper
Advertisement

రక్షాబంధన్ స్పెషల్… శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్!

రక్షాబంధన్ స్పెషల్… శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్!
Advertisement

Bhogi Movie: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే త్వరలోనే ఈయన మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో ”భోగి” (Bhogi)సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే పోస్టర్ విడుదల చేశారు.

మాస్ లుక్ లో శర్వానంద్..

నేడు రక్షాబంధన్(Raksha Bandhan) కావడంతో శర్వానంద్ భోగి సినిమా నుంచి అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో భాగంగా శర్వానంద్ లుంగీ కట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తూ చేతిలో కత్తి పట్టుకొని తాటి కాయలను కట్ చేస్తూ కనిపించారు. అయితే ఇదే పోస్టర్ లో ఆయన పక్కన ఐదుగురు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. ఇలా ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శర్వానంద్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమా కథ మొత్తం చెప్పేసారని తెలుస్తోంది. రక్షాబంధన్ సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమా మొత్తం అన్నా చెల్లెల నేపథ్యంలోనే కొనసాగుతుందని తెలుస్తోంది.

అన్నా చెల్లెల కథ నేపథ్యం..

Advertisement

రక్షాబంధన్ సందర్భంగా ఈ పోస్టర్ విడుదల కావడంతో తన అక్క చెల్లెళ్లకు ఏదైనా ఆపద వస్తే వారికి అండగా ఉండే అన్న పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నారు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోస్టర్ తోనే డైరెక్టర్ కథ మొత్తం లీక్ చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల విషయానికి వస్తే ఈ సినిమా ఈ ఆగస్టు నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమా మరికాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు..

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా బైకర్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే భోగి అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఇదివరకు ఎప్పుడు కనిపించని విధంగా ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×