BigTV English

Telusu kada Review : ‘తెలుసు కదా’ రివ్యూ : కష్టం కదా

Telusu kada Review : ‘తెలుసు కదా’ రివ్యూ : కష్టం కదా
Advertisement

Telusu kada Review : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మహిళా దర్శకులు ఉన్నారు. అయితే ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు సాధించుకున్న నీరజకోన తెలుసు కదా సినిమాతో దర్శకురాలుగా మారారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా నటించిన తెలుసు కదా సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:


కథ :

వరుణ్( సిద్దు జొన్నలగడ్డ) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాధ అనే ఫీలింగ్ లో బ్రతుకుతాడు. అందువల్ల తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని కలలు కంటాడు. అందుకోసం కష్టపడి చదివి పెద్ద బిజినెస్మెన్ అవుతాడు. తర్వాత అంజలి( రాశీ కన్నా) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెకు పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది. దీంతో సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తారు వరుణ్, అంజలి. ఈ క్రమంలో రాగ (శ్రీనిధి శెట్టి) ని అంజలి ఎంపిక చేసుకుంటుంది. ఆమె కూడా అందుకు రెడీ అవుతుంది. అయితే రాగ .. వరుణ్ ఎక్స్ లవర్ అనేది ఇక్కడ ట్విస్ట్. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వరుణ్ .. రాగ ఎందుకు బ్రేకప్ అయ్యారు. ఆమె మళ్ళీ వరుణ్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ..అతని లైఫ్ లో వచ్చిన సమస్యలు ఏంటి? తర్వాత అంజలి – వరుణ్ కలిసున్నారా? విడిపోయారా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

కొన్ని వందల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన నీరజ కోన దర్శకురాలిగా మారి తీసిన సినిమా ఇది. కథ చెప్పుకోడానికి చాలా సింపుల్. కానీ మహిళా దర్శకురాలిగా ఆమె ఈ సినిమా తీసినట్టు లేదు. ఒక ఫెమినిస్ట్ గా మారి తీసినట్టు ఉంది. పెళ్లైన తర్వాత పిల్లలు కనలేని భార్య .. ఈ బాధని అర్ధం చేసుకుని సరోగసి ద్వారా తన ప్రియుడికి పిల్లల్ని కని ఇవ్వడానికి ప్రియురాలు ముందుకు రావడం.. ఈ లైన్ ఇప్పటి సమాజానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఆమె దృష్టిలో ఇది మెచ్యుర్డ్ లవ్ స్టోరీ కావచ్చు. కానీ హిందీ సినిమా ‘చోరీ చోరీ చుప్ కె చుప్ కే ‘ నుండీ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ‘దిల్లున్నోడు’ వంటి సినిమాల పోలికలు చాలా కనిపిస్తాయి ఇందులో..!


పోనీ స్క్రీన్ ప్లే ఏమైనా బాగుందా అంటే ఆడియన్స్ కి ఇది ఒక డైలీ సీరియల్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు అనిపించినా తర్వాత తేలిపోయింది సినిమా. నిర్మాతలు ఈ సినిమాకి పెద్దగా ఖర్చు పెట్టింది కూడా ఏమీ లేదు. స్పాన్సర్స్ ద్వారా ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చి ఉండొచ్చు. వాటి వల్ల నిర్మాతలు ఏమీ ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు. రివర్స్ లో హాస్పిటల్ వాళ్ళే తమ హాస్పిటల్ ను ప్రమోట్ చేసినందుకు డబ్బులు ఇస్తారు. ఆర్టిస్టుల పారితోషికాలకే ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ.. గుంటూరు కారం, ఓజీ సినిమాల్లో ట్యూన్ లు అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది.

నటీనటులు విషయానికి వస్తే .. సిద్దు జొన్నలగడ్డ బాగానే చేశాడు కానీ ఎక్కువ శాతం అతను బిజినెస్ మెన్ లో మహేష్ బాబుని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అతని మేకప్ తేడా కొట్టింది. కొన్ని చోట్ల అతని లుక్ బాగానే ఉన్నా .. ఇంకొన్ని చోట్ల పింపుల్స్ వంటివి ఎక్కువ కనిపించాయి. రాశీ ఖన్నా లుక్స్ బాగున్నాయి. పెర్ఫార్మన్స్ పరంగా శ్రీనిధి శెట్టి బెటర్ అనిపించింది. వైవా హర్ష కామెడీ పెద్ద రిలీఫ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో అన్నపూర్ణ కూడా నవ్వించే ప్రయత్నం చేసింది. ఇక రోహిణి వంటి మంచి నటిని ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారో మేకర్స్ కే తెలియాలి. ఆమె పాడింగ్ ఆర్టిస్ట్ గా ఉంది అంతే.

ప్లస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

వైవా హర్ష కామెడీ

సంభాషణలు

మైనస్ పాయింట్స్

సెకండాఫ్

క్లైమాక్స్ హడావిడిగా తెవిల్చేయడం

శ్రీనిధి శెట్టి – సిద్దు లవ్ ట్రాక్

మొత్తంగా : ‘ తెలుసు కదా’ ఏమాత్రం ఊపు లేని ఓ సాదా సీదా రామ్ కామ్ మూవీ. ఎంతో ఓపిక ఉంటే తప్ప క్లైమాక్స్ వరకు కూర్చో లేము.

Telusu Kada Telugu Movie Rating  : 2/5

Related News

Dude Twitter Review: ‘డ్యూడ్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Mitra Mandali Review : ‘మిత్రమండలి’ మూవీ రివ్యూ.. చిత్ర హింసే

ARI Movie Review : ‘అరి’ మూవీ రివ్యూ.. గురి తప్పింది

Kantara Chapter 1 Movie Review : కాంతార చాప్టర్ 1 రివ్యూ

KantaraChapter 1 Twitter review : కాంతారా చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

Idli Kottu Movie Review : ఇడ్లీ కొట్టు రివ్యూ.. మూవీలో చట్నీ తగ్గింది

OG Movie Review : ‘ఓజి’ మూవీ రివ్యూ – ఫుల్ మీల్స్ కాదు.. ప్లేట్ మీల్సే

Big Stories

×