పండుగ సీజన్ కావడంతో రైలు టికెట్ల విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో IRCTC వెబ్ సైట్ తో పాటు యాప్ సర్వర్ డౌన్ అయ్యింది. ఫలితంగా తత్కాల్ రైలు టికెట్లను బుక్ చేసుకోవడంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ వేళ కలిగిన అసౌకర్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి ప్రయాణాల కోసం టికెట్లను పొందడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడటంతో చిరాకు కలిగించింది. అయితే, తత్కాల్ వ్యవస్థను ఉపయోగించకుండా అదే రోజు రైలు టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా? అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థను ఉపయోగించకుండా ప్రయాణీకులు అదే రోజు రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే ప్రత్యామ్నాయ మార్గాలను కల్పిస్తున్నది. ఆఫ్ లైన్ రైలు టికెట్ బుకింగ్ ను ఇష్టపడే ప్రయాణీకుల కోసం, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లను నడిపిస్తుంది. అక్కడి వెళ్లడం వల్ల కొన్నిసార్లు అదే రోజు ప్రయాణానికి కన్ఫార్మ్ టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది. తత్కాల్ సేవను ఉపయోగించకుండా అదే రోజు రైలు టికెట్‌ను బుక్ చేసుకునేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
⦿ ముందుగా రైల్వే అధికారిక వెబ్ సైట్ www.irctc.co.inలోకి లాగిన్ కావాలి.
⦿ మీరు బయల్దేరే, దిగే స్టేషన్ పాయింట్లు, ప్రయాణ తేదీని ఎంటర్ చేయాలి.
⦿ మీరు ఎంచుకున్న మార్గంలో అందుబాటులో ఉన్న అన్ని రైళ్లను చూపించే రైళ్ల లిస్ట్ కనిపిస్తుంది.
⦿ మార్గం, సమయాలను చూడటానికి లిస్టులోని రైలు పేరు మీద క్లిక్ చేయాలి.
⦿ ఛార్జీలను తనిఖీ చేయడానికి ఆయా క్లాస్ ల మీద క్లిక్ చేయాలి.
⦿ సీటు లభ్యతను చూడటానికి మీకు ఇష్టమైన రైలులో మీకు నచ్చిన క్లాస్ మీద క్లిక్ చేయాలి.
⦿ బుకింగ్ కోసం రైలును ఎంచుకోవడానికి ‘ఇప్పుడే బుక్ చేయండి’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ మీరు వేరే రైలును ఎంచుకోవాలనుకుంటే ‘రీసెట్’ మీద క్లిక్ చెయ్యొచ్చు.
⦿ రిజర్వేషన్ పేజీలో రైలు పేరు, స్టేషన్లు సరిగా నింపారో? లేదో? సరిచూసుకోవాలి.
⦿ ప్రయాణీకుల పేర్లు, వివరాలతో పాటు బెర్త్ ప్రయారిటీని ఎంటర్ చేయాలి.
⦿ ప్రయాణీకులు సీనియర్ సిటిజన్స్ అయితే (పురుషులకు 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ, మహిళలకు 58 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ), సీనియర్ సిటిజన్ రాయితీని పొందడానికి బాక్స్ లో టిక్ చేయాలి. పురుషులకు 40%, మహిళలకు 50% రాయితీ లభిస్తుంది.
⦿ కొనసాగడానికి ‘చెల్లింపు చేయండి’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ పేమెంట్ తర్వాత మీకు ఇ టికెట్ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రయాణించేటప్పుడు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్స్ తో పాటు డిజిటల్ టికెట్‌ను తీసుకెళ్లవచ్చు.
Read Also: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!