Dude Twitter Review: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం డ్యూడ్.. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది.. కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు.. ఇందులో నేహా శెట్టిలు హీరోయిన్‌లుగా నటించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి తదితరులు నటించారు. లవ్ టుడే డ్రాగన్ వంటి చిత్రాలలోలవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలలో నటించి మెప్పించిన ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన మూవీ డ్యూడ్ భారీ అంచనాలు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో..? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
డ్యూడ్ మూవీ మొదటి 30 నిమిషాలు బాగానే ఉంది ఆ తర్వాత ప్రేమ, స్నేహమంటూ గందరగోళం మొదలైంది. అంటూ ఓ నేటిజన్ ట్రీట్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో బ్లడ్ సాంగ్ బాగుందంటూ అటు ట్వీట్ లో పేర్కొన్నారు..
30 mins into the movie… Going good so far follows…love friendship confusion #Dude 🔥
— Rakita (@Perthist_) October 16, 2025
డ్యూడ్ మూవీలో చాలా ప్రపోజల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సాయి అభయాంకర్ బీజిఏం చాలా బాగుంది. చాలామంది యువతను ఆకట్టుకునేలా ఉంది. అతని మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
#Dude very good proposal scene👌❤️ too good bgm from @SaiAbhyankkar very soothing nd heart warming 😍❤️👌
— తేజ (@teja1409) October 16, 2025
డ్యూడ్ మూవీకి మ్యూజిక్ హైలెట్ అయ్యింది. సాయి అభయాంకర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతని సంగీతం ప్రాణం పోసింది అంటూ మరొకరు ట్విట్ చేశారు.
@SaiAbhyankkar what have you done bro, seriously 🤌🏻🔥brilliant composition!!#Kannukulla #Dude @jonitamusic @pradeeponelife @_mamithabaiju @Keerthiswaran_
— Vikraanth Murali (@vikraanthmurali) October 16, 2025
Dude – Winner 🏆 What a fabulous debut for @Keerthiswaran_ 💯👏 A proper Gen Z rom-com ❤️🔥 @SaiAbhyankkar BGM & songs are a major plus ✨ Both PR & Mamitha were perfect in their roles 🤩 Much needed social message said in the most entertaining way 🔥#Dude #DudeDiwali #DudeReview pic.twitter.com/SdCJTKqxWD
— Alex (@callmeajas) October 17, 2025
VERY GOOD first half. Right from the first scene, there’s entertainment and the screenplay is engaging. The chemistry of @pradeeponelife and @_mamithabaiju is EXCELLENT. The storyline is good, the moments are cute, emotions land and the music is great. If this holds for the… pic.twitter.com/IrbdKWSbNw
— Sharat Chandra (@Sharatsays2) October 17, 2025
అమెరికాలో శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ‘డ్యూడ్’ మొదటి షో పడింది. ఈ మూవీ హీరో హీరోయిన్ల కన్నా మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అదే సినిమాకు హైలైట్ అంటూ ప్రీమియర్ షోల ద్వారా నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మన ఇండియాలో షో పడిన తర్వాత టాక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే మ్యూజిక్ మాత్రం 100% మార్క్స్ పడిపోయాయి. సాయి అభయాంకర్ ఈ మూవీతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నట్లే.. ఇండియాలో మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అప్పుడు రివ్యూలు మారే అవకాశం ఉంది.
తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో డ్యూడ్‌పై అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ప్రదీప్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. మరి తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా కూడా అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడిపోయిందని చెప్పాలి. ఇప్పటికే బుక్ మై షోలో బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతుండడంతో కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏ కలెక్షన్లు ఎంత వసూలు చేస్తుందో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే..