KRamp Movie Review : పరభాషా లవ్ స్టోరీలకంటే తన సినిమా బాగుంది అంటూ ప్రమోట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం ఈ కె ర్యాంప్ సినిమాను. ఈ క్రమంలో చిన్నపాటి వివాదం కూడా చోటుచేసుకుంది. మరి నిజంగానే పరభాషా లవ్ స్టోరీల కంటే ఈ కె ర్యాంప్ బాగుందా.. అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం…
కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఓ రిచ్ కిడ్. బిజినెస్ మ్యాన్ కృష్ణ (సాయి కుమార్)కు ఒక్కగాను ఒక్క కొడుకు. వాళ్ల ఫ్యామిలీ ఎంత రిచ్ అయినా… కుమార్ చిల్లర్‌గా పెరుగుతాడు. చదువు రాదు.. ఎప్పుడూ రోడ్ సైడ్ బార్‌లో తాగుతూ ఉంటాడు. ప్లేస్ మారిస్తే మారుతాడేమో అని కుమార్‌ను కేరళలో కృష్ణ బావమరిది (నరేష్) దగ్గరకు పంపిస్తాడు.
అక్కడ కాలేజీలో ఓ సందర్భంలో కుమార్‌ను మెర్సి (యుక్తి తరేజా) కాపాడుతుంది. దీంతో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. మెర్సి – కుమార్ ప్రేమ స్టార్ట్ అయిన తర్వాత… కుమార్ పరిస్థితి ఒక్క సారిగా మారిపోతుంది. జాలీగా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండే కుమార్ లైఫ్ అలా మారడానికి కారణం ఏంటి. మెర్సితో కుమార్‌కు ఉన్న సమస్య ఏంటి ? అసలు మెర్సికి ఉన్న సమస్య ఏంటి? వీరి లవ్ చివరికి నిలబడిందా ? అనేదే ఈ కె ర్యాంప్ మూవీ స్టోరీ.
కె ర్యాంప్ మూవీ కంప్లీట్‌గా లవ్ స్టోరీనే. కానీ, దానికి ఓ వ్యాధిని యాడ్ చేసి… కామెడీ టచ్‌తో ప్రేక్షకులను కాస్త ఎంటర్‌టైన్ చేయాలని అనుకున్నాడు కొత్త డైరెక్టర్ జైన్స్ నాని. కథ అలా రాసుకున్నా… కథనాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చూసుకోవడంలో చాలా వరకు తడబడ్డాడు.
స్టోరీ చెప్పుకోవడానికి రెగ్యూలర్ స్టోరీలా కనిపించినా… ఆ వ్యాధి ట్విస్ట్‌తో కాస్త నడిపించొచ్చు. కానీ, ఇక్కడ… మెయిన్ ట్విస్ట్ కూడా ప్రెడిక్ట్ చేసేలానే ఉంది. ఆ ఒక్క ట్విస్ట్ మాత్రమే కాదు… సినిమా మొత్తాన్ని థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడు అంచనా వేస్తాడు. అది సినిమాకు.. కథకు ఓ మైనస్.
ఫస్టాఫ్… మొత్తం హీరో పరిచయానికే వాడుకున్నట్టు ఉన్నాడు. హీరో ఓ పెద్ద చిల్లర్ అని చూపించడానికి ఫస్టాఫ్ యూజ్ చేసుకున్నాడు. లాస్ట్‌లో ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ అది ప్రెడిక్టెబుల్ ట్విస్ట్ అయినా… సెకండాఫ్‌పై కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగింది.
ఇక సెకండాఫ్… ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ట్విస్ట్‌ను సెకండాఫ్‌లో సరిగ్గా డీల్ చేశాడు. హీరోయిన్‌తో వచ్చే కొన్నీ సీన్స్ బాగున్నాయి. హీరోను కూడా కొన్ని సందర్బాల్లో హీరోయిను యుక్తి తరేజా డామినేట్ చేసింది. సరిగ్గా అదే టైంలో… వెన్నల కిషోర్ ఎంట్రీ. అప్పటి వరకు భరించాలి అన్నట్టు సాగిన సినిమా ఒక్క సారిగా మారిపోతుంది. వెన్నల కిషోర్ ఉన్న కొద్ది నిమిషాలే అయినా.. సినిమాను గట్టేక్కించేలా చేశాడు. తర్వాత క్లైమాక్స్ కాస్త ఇమోషనల్ టచ్‌తో ఎండ్ చేశాడు.
సెకండాఫ్‌ను డీల్ చేసినట్టు… ఫస్టాఫ్ ను కూడా సరిగ్గా డీల్ చేస్తే కె ర్యాంప్ మూవీ ఈ దీపావళికి పెద్ద సౌండ్ వచ్చేలా పేలే బాంబ్ అయ్యేది. కానీ, ఫస్టాఫ్, నరేష్ ఇరిటేట్ చేసే ట్రాక్.. వల్ల సగం సౌండ్ వచ్చే నాసిరకం బాంబ్‌లా తూస్ మని అన్నది. సినిమాలు పాటలు ఉన్నా.. సినిమా అయిపోయాక… ఆడియన్స్ కు అవి గుర్తుకు వచ్చేలా మాత్రం లేవు.
సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే.. హీరోను హీరోయిన్ టార్చర్ చేస్తుంది. హీరో… వాళ్ల నాన్ను టార్చర్ చేస్తాడు. అలా మొత్తం సినిమా చూస్తే ఆడియన్స్ టార్చర్ ఫీల్ అవుతారు. అలాంటి టైంలో వెన్నల కిషోర్ వచ్చి ఆడియన్స్‌కు కాస్త ఉపశమనాన్ని ప్రసాదిస్తాడు.
కిరణ్ అబ్బవరం… బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ యుక్తి తరేజాకు మంచి క్యారెక్టర్ దొరికింది. కిరణ్ అబ్బవరంను కూడా డామినేట్ చేసేలా చేసింది తను. సాయి కుమార్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సినిమాలో నరేష్ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. నరేష్ గతంలో సామజవరగమన సినిమాలో అచ్చం ఇలాంటి ట్రెండీ అంకుల్ పాత్రే చేశాడు. ఆ పాత్ర ఆడియన్స్‌కు చాలా బాగా ఎక్కింది. ఎంటర్‌టైన్ చేసింది. కానీ, ఈ కె ర్యాంప్‌లో మాత్రం ఇరిటేట్ చేసేలా ఉంది.
అలాగే.. హీరో పక్కన ఓ క్యారెక్టర్ ఉంటుంది. మూవీలో అతని పేరు అనన్య. ఫస్టాఫ్‌లో సినిమాపై సగం అసహనం క్రియేట్ అవ్వడానికి కారణం ఆ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఓవరాయక్షన్‌తో కూడిన పాత్రలో వేరే వాళ్లను తీసుకుంటే బాగుండేదేమో. అలాగే అలీని సరిగ్గా వాడుకోలేదు. ఇక కెమెరా వర్క్ సినిమాలో బానే ఉంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేయాల్సింది. ఈ ట్రిమ్ విషయంలో ఎడిటర్ కంటే… డైరెక్టర్ కాస్త ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వలేదు.
కిరణ్ అబ్బవరం & యుక్తి తరేజ
సెకండాఫ్
క్లైమాక్స్
వెన్నల కిషోర్
నరేష్
ఫస్టాఫ్
పాటలు
ల్యాగ్ సీన్స్
మొత్తంగా… చివరి 30 నిమిషాల కోసం… ఆడియన్స్ కె ర్యాంప్‌ను భరిస్తూ చూడాలి.