E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా స్కూటీ డ్రైవింగ్.. మనీష దెబ్బకు నారాయణ అవుట్.. చక్రికీ అవమానం..

Podarillu Today Episode : మహా స్కూటీ డ్రైవింగ్.. మనీష దెబ్బకు నారాయణ అవుట్.. చక్రికీ అవమానం..
Advertisement

Podarillu Today Episode June 19th :మహాలక్ష్మి ఎలాగైనా సరే బండిని నేర్చుకుని నా పరువు నేను నిలబెట్టుకోవాలి అని అనుకుంటుంది. మహాలక్ష్మి ఎలాగైనా సరే నేను బండి నేర్చుకుంటాను అని అనుకుంటుంది.. కన్నా భయపడకు వదిన నేను మీ వెనకాల అండగా ఉంటాను కదా.. మొత్తానికి కన్నా సాయంతో మహాలక్ష్మి బండిని బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. మహాలక్ష్మి ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది అని మరోసారి నిరూపించేసింది.. అందరూ మహాలక్ష్మిని చూసి చాలా బాగా స్కూటీ నేర్చుకున్నావ్ అమ్మా అని చప్పట్లు కొడతారు.. మొత్తానికి మహాలక్ష్మి స్కూటీని నేర్చుకొని అందరిని ఆశ్చర్యపరుస్తుంది..

చక్రిని తిట్టిన మహా..

మహాలక్ష్మి నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కన్నా కేశవ ఇద్దరూ కూడా మహాని స్కూటీ నేర్చుకోవడానికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ చక్రి మాత్రం మహా స్కూటీ నేర్చుకుంటూ ఉంటే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. మీరు ఇలా అడ్డంగా వాగితే నేను స్కూటీ నేర్చుకోలేను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోని అని మహా మొహం మీద చెప్పేస్తుంది. దాంతో చక్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకు వదిన అలా అంటావ్ చక్రి అన్నయ్య బాధపడతాడు అని కన్నా అంటాడు.. నేర్పించేవాడు ప్రతి దానికి ఇలా ఎగతాళి చేస్తూ ఉంటాడు. అతను ఇక్కడే ఉంటే నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది.

మనీష ఎంట్రీతో ఫన్..

Advertisement

మహాలక్ష్మి స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండగా మనిషా రావడం చూసి ఎవరు ఈ అమ్మాయి అని అందరూ అడుగుతారు. మాధవ్ మన బంతి చెల్లెలు జైపూర్ నుంచి వచ్చింది అని చెప్తాడు. తనకు తెలుగు రాదని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటారు. అలా ఎలా ఏదోలా అలా మనీషతో మాట్లాడతారు. నారాయణ వచ్చి మనిషా తో హిందీలో మాట్లాడడంతో మనిషా మీకు హిందీ కూడా వచ్చా అని అడుగుతుంది.. నాకు ఒక హిందీ మాత్రమే కాదు ఏడు భాషలు తెలుసు అని నారాయణ అనగానే అందరూ షాక్ అవుతారు. మనీషా నారాయణను ఆశీర్వదించమని అడుగుతుంది..

చక్రికీ ఘోర అవమానం..

చక్రి స్కూటీ నేర్చుకోవడానికి మహా తనని తీసుకెళ్లలేదని బాధ పడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి నన్ను మాత్రం దగ్గరికి రానివాడు అని బాధపడిపోతూ కారేశ్వర్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్లి పోతాడు చక్రి. అక్కడ తన కారుని వేరే వ్యక్తి తుడుస్తూ ఉండటంతో చాలా బాధపడతాడు. అయితే ఆ కారు మీద చెయ్యి వేస్తేనే అసలు ఊరుకోను అని చక్రి గొడవకు దిగుతాడు. అందుకే ఓంకారేశ్వర్ గారే మీ కారుని తుడవమని చెప్పారు.. అందుకే తుడుస్తున్నాను అని చక్రి చెప్పిన సరే వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ చక్రి ఆక్సిడెంట్ చేసిన విషయం గురించి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడంతో చక్రి అవమానంగా ఫీల్ అవుతాడు.. ఇక కార్యశ్వర్ నాకు కారుని ఇలా పెట్టుకొని ఉంచుకోలేను కదా డ్రైవింగ్ చేయించాలి కదా అని అంటాడు.. నా లైసెన్స్ పోయింది అని నువ్వు కూడా నన్ను చీఫ్ గా చూస్తున్నావా అని బాధపడిపోతూ ఇంటికి వెళ్తాడు చక్రి..

చక్రీ కోసం మహా వెయిటింగ్..

Advertisement

చక్రి ఇంకా ఇంటికి రాలేదని బాధ పడిపోతూ ఉంటుంది మహా.. అయితే ఎందుకు ఇంకా చక్రి రాలేదు అని అడగ్గానే ఎవరి గురించి వెతుకుతున్నారు అని కేశవ్ అంటాడు. మీ అన్నయ్య చక్రి గురించే నేను వెయిట్ చేస్తున్నాను. మరి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. అవునన్నయ్య ఇప్పుడు బండి కూడా లేదు కదా ట్రిప్పు వెళ్లే పని కూడా లేదు కదా ఎక్కడికి వెళ్ళాడు.. రావచ్చు కదా తొందరగా అని కేశవ కూడా తిడతాడు. వాడు లైసెన్స్ పోయిన బాధలో ఉన్నాడు రా వస్తూ ఉంటాడు అని మాధవ్ ఉంటాడు.. నాకు స్కూటీ ఇచ్చే సర్ప్రైజ్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది.. ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి కారు కూడా లేదు కదా మరి అంత ఖర్చు పెట్టి స్కూటీ కొనడం ఎందుకు అని మహాలక్ష్మి అంటుంది. అన్నయ్య నీకోసం కష్టపడకుండా ఉండాలని ఇదంతా చేశాడు అని వాళ్ళు చెప్పగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది.. మహాలక్ష్మి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారని చక్రి బయట నుంచి చూసి బాధపడిపోతూ ఉంటాడు. నేను లేకపోయినా వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు అని అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటారు. నారాయణ, చక్రీ ఇద్దరు గొడవ పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిన ప్రభావతి.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. మనోజ్ కు కడుపుమంట..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×