E-Paper
Advertisement

పాకిస్తాన్ ఓ బికారి దేశం…లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించిన ఇంగ్లాండ్

పాకిస్తాన్ ఓ బికారి దేశం…లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించిన ఇంగ్లాండ్
Advertisement

PAK VS ENG:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ లో పర్యటించింది బాబర్ ఆజం సేన. ఈ క్రమంలో మొన్న ఆగస్టు 19వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. లీడ్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పైన కంప్లీట్ గా ఆధిపత్యం చెలాయిస్తోంది ఇంగ్లాండ్. అయితే నిన్న రెండవ రోజు మ్యాచ్ కొనసాగుతున్న క్రమంలో పాకిస్తాన్ దేశాన్ని అవమానిస్తూ, ఇంగ్లాండ్ దారుణంగా వ్యవహరించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. పేదరికంలో పాకిస్తాన్ కూరుకుపోయిందని.. అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉందని మ్యాచ్ జరుగుతుండగా ఓ యాడ్ బౌండరీ గేటు దగ్గర ప్రదర్శించారు. దీంతో వివాదం రాజుకుంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పిలిచి మరీ, పాకిస్తాన్ ను ఇంగ్లాండ్ అవమానించిందని మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు.

అప్పుల్లో పాకిస్తాన్‌… అసలు వివాదం ఏంటి ?

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ తొలి టెస్ట్ నేపథ్యంలో నిన్న రెండవ రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ బౌలర్లు… ఇంగ్లాండ్ వికెట్లను తీసేందుకు నాన‌ కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో బౌండరీ గేటు దగ్గర Remitly అనే యాడ్ ప్రదర్శించారు. ఈ యాడ్ లో సెండ్ మనీ టూ పాకిస్తాన్ అని రాసి ఉంది. దీంతో ట్రోల్స్ మొదలయ్యాయి. పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని… అందుకే అందరూ కలిసి వాళ్లకు డబ్బులు దానం చేయాల‌ని ఈ యాడ్ ప్రదర్శించినట్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

ఐఎంఎఫ్ ద్వారా కోట్లలో పాకిస్తాన్ డబ్బులు తీసుకుందని.. ఆ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. అందుకే ఇంగ్లాండు పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ కు డబ్బులు ఇవ్వండి అని అర్థం వచ్చేలా ఈ యాడ్ ప్రదర్శించినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ బౌలర్ అలీ ఉస్మాన్ అల్లాకు దండం పెట్టినట్లు ఓ ఫోటోను కూడా వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ లు ఆడెందుకు రాలేదని… ఇంగ్లాండ్ దగ్గర డబ్బులు అడుక్కునేందుకు వచ్చిందని కూడా సెటైర్లు పేల్చుతున్నారు.

వివాదం పై క్లారిటీ ఇచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో సెండ్ మనీ టు పాకిస్తాన్ అనే యాడ్ రావడం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఇది పాకిస్తాన్ దేశాన్ని కించపరిచినట్లు కాదని… కేవలం మనీ ట్రాన్స్ ఫర్ యాప్ యాడ్ మాత్రమేనని తెలిపింది. ఇంగ్లాండులో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు… తమ దేశానికి డబ్బులు పంపించుకునేందుకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని వెల్లడించింది. అంటే యూనిమోని తరహాలో డబ్బులను ఎక్స్చేంజ్ చేస్తుందన్నమాట. ఇది తెలియక చాలా మంది పాకిస్తాన్ దేశాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అవమానించినట్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ అప్పుల్లో ఉన్నది నిజమే. ఆ దేశం దాదాపు 12 లక్షల 44,490 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. అమెరికా, చైనా దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా అప్పులు తీసుకుంది.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

 

?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

Related News

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

గంభీర్ కు బుర్ర ఉందా? తలా తోక తెలియ‌ని బౌలర్లతో 2027 వరల్డ్ కప్ గెలవ‌లేం !

జై షా చేతుల మీదుగా గోల్డ్ మెడ‌ల్స్ తీసుకోవ‌డం ఇష్టం లేక, కావాల‌నే ఓడిపోయాం

Big Stories

Advertisement
×