Spirit movie:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhash) హీరోగా సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy vanga) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం స్పిరిట్ (Spirit). ఈ సినిమాలో మొదట ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న త్రిప్తి డిమ్రి (Tripti dimri) ని హీరోయిన్గా సెలెక్ట్ చేయడమే కాకుండా ఆ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ప్రభాస్ తో పాటు ఆమె లుక్ ని కూడా రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇకపోతే ఈ సినిమా నుండి దీపికాను తొలగిస్తూ సందీప్ రెడ్డివంగా చేసిన కామెంట్లు, అటు దీపిక ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహానిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) స్పందించారు. ముఖ్యంగా దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటలు చర్చలు జరిపినప్పటికీ.. స్పిరిట్ మూవీ లో ఆమె ఎంపిక కాకపోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. “సందీప్ సుమారుగా ఏడాదిన్నర పాటు దీపికా పదుకొనేతో స్పిరిట్ మూవీ గురించి, కథ గురించి, అందులో ఆమె పాత్రకు సంబంధించి ఎన్నో చర్చలు జరిపారు. నిజానికి ఆమెకు కథ విపరీతంగా నచ్చింది. కానీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకోలేకపోయాం.
also read:సాహసం చేయరా డింభకా? లేక అగ్ని పరీక్షా? చంపేస్తారా ఏంటి?
ముఖ్యంగా సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అడగడంతో పాటు సినిమా లాభాలలో ఏకంగా 10 శాతం ఆమె వాటా కావాలని డిమాండ్ చేసింది. అంతే కాదు రోజు వారి షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా నిర్మాణానికి అనుకూలంగా అనిపించలేదు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణానికి ఇలాంటి షరతులు సమంజసంగా అనిపించకపోవడం వల్లే పరస్పర అంగీకారంతో ఆమె స్థానంలో వేరే హీరోయిన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాం” అంటూ సోషల్ మీడియాలో దీపిక తప్పుకోవడం పై జరుగుతున్న రకరకాల ఊహాగానాలకు, రూమర్లకు ఒక్కసారిగా చెక్ పెట్టారు ప్రణయ్ రెడ్డి వంగా.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా.. 2027 మార్చి 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా దీపిక ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు గతంలో వార్తలు రావడం, ఆమె టీం సందీప్ పై విచక్షణారహితంగా కామెంట్లు చేయడం, సందీప్ అంతే దీటుగా స్పందించడం, పైగా సెలబ్రిటీలు దీపికాకు అండగా నిలబబడం అంతా ఒక డ్రామా లాగా నడిచింది. అయితే ఆ డ్రామా కి ఇప్పుడు ప్రణయ్ రెడ్డి వంగా చెక్ పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హీరో రేంజ్ లో దీపికా తన డిమాండ్కు తగ్గట్టుగా లాభాల్లో వాడా అడిగిందా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.