మూవీ : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
రిలీజ్ డేట్ : 08 నవంబర్ 2024
నటీనటుల : నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు, అజయ్, జాన్ విజయ్
డైరెక్టర్ : సుధీర్‌వర్మ
నిర్మాత : బీవీఎస్‌ఎన్ ప్రసాద్
మ్యూజిక్ : కార్తీక్
Appudo Ippudo Eppudo Movie Rating : 1.5/5
Appudo Ippudo Eppudo Review : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గతంలో కార్తికేయ 2 తో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఆ మూవీ తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఆ సినిమానే ‘ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. ఈ మూవీ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. హీరో నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో స్వామి రారా, కేశవ లాంటి సినిమాల తర్వాత తెరకెక్కిన మూడో చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ వచ్చింది.. టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా ఎప్పడు షూట్ చేశారో కూడా తెలియదు. ఉన్నపళంగా రిలీజ్ అని ప్రకటించారు. ఇప్పటికి థియేటర్లలోకి తీసుకొని వచ్చారు. ఈ మూవీ కార్తికేయ 2 అంత టాక్ ను సొంతం చేసుకుందా? నిఖిల్ ఖాతాలో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లో తెలుసుకుందాం..
కథ :
హీరో నిఖిల్ ఎంపిక చేసుకొనే కథల సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.. అలాగే ఈ సినిమా కూడా కొత్త కథ తో వచ్చింది.. ఇదంతా ఒక కొత్త లవ్ స్టోరీగా వచ్చింది. హైదరాబాద్ లో జులాయిగా తిరిగే ఓ కుర్రాడుగా ఈ సినిమాలో నటించాడు నిఖిల్.. అతని లవ్ ఫెయిల్ అవ్వడంతో లండన్ కు వెళ్తాడు. అక్కడ రేస్ డ్రైవర్ గా ట్రైనింగ్ తీసుకుంటూ.. పాకెట్ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. లండన్ లో పరిచయమైన తులసిను ప్రేమించి ఆమెను పెళ్లాడాలనుకుంటాడు. అయితే అక్కడ తులసి మిస్ అవ్వడం, హైదరాబాద్ లో తాను ప్రేమించిన తార లండన్ లో ప్రత్యక్షం అవ్వడంతో జీవితం మీద మళ్లీ ఆశలు చిగురిస్తాయి హీరోకు.. అతను ఎలాగైనా తన ప్రేమను గెలిపించుకోవాలని ప్లాన్స్ వేస్తాడు. అక్కడ ఉండే లోకల్ డాన్ చేతికి చిక్కుతాడు.. అతని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే సినిమా కథ.. అసలు బద్రి నారాయణ ఎవరు? రిషితో అతడికి ఏం పని? అతడి నుండి రిషి ఎలా తప్పించుకున్నాడు? ఈ కథలో తార, తులసిల పాత్ర ఏమిటి? అనేది ఈ సినిమా స్టోరి.. అతను ఎలా ఈ వ్యూహన్ని చేదిస్తాడు అన్నది ఈ మూవీ స్టోరీ..
విశ్లేషణ :
డైరెక్టర్ విషయానికొస్తే.. సుధీర్ వర్మ మార్క్ అనేది ప్రతి టెక్నికాలిటీలోనూ కనబడుతుంది. కెమెరా వర్మ్ మొదలుకొని లైటింగ్, మ్యూజిక్ వరకు “ఇది సుధీర్ వర్మ చిత్రం” అనేది ఎలివేట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా కథను మూడో వ్యక్తి కోణంలో చూపించడం సినిమాను కాస్త వేగవంతం చేసింది.. అయితే ప్రజెంట్ చెయ్యాలనుకున్న మొత్తం ట్విస్ట్ ను సింపుల్ గా చూపించడం సినిమాకు మైనస్ అయ్యింది. ఇదే సినిమాకు యావరేజ్ టాక్ ను అందించిందని పబ్లిక్ చెబుతున్నారు. ఫస్టాఫ్ మరీ పేలవంగా సాగింది. సెకండాఫ్ కాస్త బెటర్ గా ఉన్నప్పటికీ.. కీలకమైన సన్నివేశాల రూపకల్పన ఆకట్టుకునేలా లేకపోవడంతో అది కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ మరియు కార్తీక్ పాటలు సోసోగా ఉన్నాయి.. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కొంతవరకు స్టోరీని ల్యాగ్ చెయ్యడంతో కాస్త బోరింగ్ అనిపిస్తుంది.
గతంలో వచ్చిన ఆరెంజ్ లాంటి సినిమాలే ప్లాప్ అయ్యాయి.. అలాంటి కథనే ఇందులో చూపించాడని టాక్ ను అందుకుంది. కొన్ని సినిమాలు ట్రెండ్ తో సంబంధం లేకుండా చాలా లేటుగా విడుదలవుతుంటాయి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సరిగ్గా అలాంటి సినిమానే. నిఖిల్ ఈ సినిమా ఎప్పుడో చేసాడని లుక్స్ పరంగానే తెలిసిపోతుంది. కంటెంట్ అంతంతమాత్రానే ఉండడం, కమర్షియాలిటీ పాళ్లు తక్కువవ్వడం, మరీ ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ డిజైన్ చేసిన తీరు పెద్దగా ఆడియన్స్ ను మెప్పించలేక పోయాయి.
ప్లస్ పాయింట్స్ :
నిఖిల్
దివ్యాంశ కౌశిక్
కొంత మేర కామెడీ
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్
సెకండాఫ్‌లో కొంత
మ్యూజిక్, సాంగ్స్
Appudo Ippudo Eppudo Movie Rating: 1.5/5