నిశితంగా గమనించే లక్షణం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే బ్రెయిన్ అంత యాక్టివ్ గా పని చేస్తుంది. మెదడు ఎంత యాక్టివ్ గా ఉంటే క్లిష్టమైన సమస్యలను అంత ఈజీ సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. మీలో పరిశీలన సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే.. ఈ ఫోటోను పరిశీలించండి. ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డంతో కార్లన్నీ రోడ్డు మీదే నిలిచిపోయాయి. కార్లతో నిండిన రోడ్డును జాగ్రత్తగా గమనించండి. ఈ కార్లు అన్ని ఓవైపు వెళ్తుంటే కొన్ని కార్లు మాత్రం కాస్త డిఫరెంట్ యాంగిల్ లో ఎదురుగా ఉన్నాయి. వాటిలో ఓ యెల్లో కలర్ కారు ఉంది. కార్లు ముందు వైపు వెళ్తుంటే, యెల్లో కారు మాత్రం ఇతర కార్లకు వ్యతిరేక దిశలో వస్తోంది. మీరు ఓసారి ప్రయత్నించి చూడండి. 10 సెకెన్లలో రివర్స్ లో ఉన్న యెల్లో కారును కనిపెట్టగలరేమో ట్రై చేయండి.
మెదడును యాక్టివ్ గా ఉంచే టిప్స్
ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, టెస్టులు మెదడుకు సంబంధించిన పరిశీలనా నైపుణ్యాలను పెంచుతాయి. ఎలాంటి కఠిన సమస్యలను అయినా తెలివితో పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి పరీక్షలు మనస్సును కూడా మరింతగా ఆహ్లాదకరంగా మార్చుతాయి. అంతేకాదు, మనిషి ఐక్యూను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి మెదడును చక్కగా పని చేసేలా చేస్తాయి. మనిషి ఐక్యూను పెంచడంలో సాయపడుతాయి. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం..
10 సెకెన్లలో యెల్లో కారును గుర్తించండి!
ఇప్పుడు మనం పదునైన పరిశీలనా గుణాన్ని పెంపొందించే ఈ ట్రాఫిక్ ఫోటోను మరోసారి పరిశీలిద్దాం. ఆప్టికల్ ఇల్యూషన్ కోసం టైమర్ ను ప్రారంభిద్దాం.. ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది! మీ టైమ్ అయిపోయింది. పసుపు కారును గుర్తించారా? లేదంటే దాన్ని పట్టుకునేందుకు మీకు క్లూ అవసరమా? ఇప్పుడు మీ కోసం ఓ క్లూ అందిస్తాం. అదేంటంటే, రోడ్డుకు చివరి వైపుల ప్రయత్నంచండి. ఇప్పటికైనా యెల్లో కలర్ కారును గుర్తించారా? గుర్తిస్తే.. మీ పరిశీలనా సామర్థ్యం చక్కగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ గుర్తించలేదంటే మాత్రం ఇప్పుడు మేం ఆఫోటోను చూపిస్తాం.
యెల్లో కారు ఇక్కడ ఉంది చూడండి!
ఇదిగో ఇక్కడ ఉంది పసుపు కారు. పసుపు కారుతో పాటు రివర్స్ లో ఎరుపు రంగు కారు కూడా ఉంది. కావాలంటే ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఇకపై మీ పరిశీలన శక్తిని పెంచుకోవాలంటే.. సోషల్ మీడియాలో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్స్ ఫోటోలను తరచుగా గమనిస్తూ ఉండండి. మీలో పరిశీలనా శక్తి పెరుగుతుంది. బ్రెయిన్ షార్ప్ గా పని చేయడం మొదలుపెడుతుంది. నిజ జీవితంలోనూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా వీలుంటే క్విజ్ లు, పదసోపానాలను ట్రై చేస్తూ ఉండండి. రూబిక్ క్యూబ్ ఆడుతూ ఉండండి. ఈ పద్దతుల ద్వారా పరిశీలనా సామర్థ్యం, మెమరీ పవర్ పెరుగుతుంది.
Read Also: వస్తువులన్నీ చిందర వందరగా ఉన్న ఈ గదిలో 3 చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి.. కనుక్కోండి చూద్దాం!