E-Paper
Advertisement

ప్రియుడిని పరీక్షించమని ఫ్రెండ్‌నే పంపింది… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్…

ప్రియుడిని పరీక్షించమని ఫ్రెండ్‌నే పంపింది… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్…
Advertisement

Cocktail 2 OTT : పదేళ్లుగా కలిసి ఉంటున్న ప్రేమజంట… పెళ్లి అనే బంధం అవసరం లేదని అనుకుంటారు. కానీ సరదాగా మొదలైన ఓ ఇటలీ వెకేషన్ వారి జీవితాల్లో ఊహించని మూడో వ్యక్తిని తీసుకొస్తే ? అప్పటి వరకు ఎంతో బలంగా కనిపించిన ప్రేమలో ఒక్కసారిగా అనుమానాలు, ఆకర్షణలు, అపార్థాలు మొదలైతే పరిస్థితి ఎలా మారుతుంది ? ఒకవైపు తనతో పదేళ్లుగా కలిసి జీవిస్తున్న దియా… మరోవైపు కొత్తగా తన మనసును ఆకర్షిస్తున్న అల్లీ… వీరిద్దరి మధ్య కునాల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? ఆధునిక ప్రేమ, లివ్-ఇన్ రిలేషన్‌షిప్, పెళ్లిపై భిన్నమైన ఆలోచనలు, ఫ్రెండ్‌షిప్, ఎమోషనల్ కన్ఫ్యూజన్‌ను వినోదాత్మకంగా చూపించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail 2). 2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’కు ఆధ్యాత్మిక సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమాను తెలుగులోనూ చూడొచ్చా ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కునాల్, దియా దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న జంట. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ఇష్టపడుతుంటారు. కలిసి జీవిస్తూ తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగానే కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా పెళ్లి అనే సాంప్రదాయ వ్యవస్థపై కునాల్‌కు పెద్దగా నమ్మకం ఉండదు. పెళ్లి చేసుకున్నప్పుడే ప్రేమకు విలువ వస్తుందనే ఆలోచనను అతను అంగీకరించడు. అందుకే ఎలాంటి పెళ్లి తంతు లేకుండా, ఒకరితో ఒకరు సంతోషంగా ఉండటమే తమకు సరిపోతుందని భావిస్తాడు.

Advertisement

ఇలా ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలో ఓ ఇటలీ వెకేషన్ కొత్త మలుపు తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసి సిసిలీ దీవులకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అక్కడ అనుకోకుండా దియాకు చిన్ననాటి స్నేహితురాలైన అల్లీ పరిచయం అవుతుంది. గ్లామరస్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండే అల్లీ ఆ ఇద్దరి జీవితాల్లోకి వచ్చిన తర్వాత వారి వెకేషన్ మరింత సరదాగా మారుతుంది. మొదట్లో ముగ్గురి మధ్య స్నేహం ఎంతో సరదాగా సాగుతుంది. కలిసి తిరగడం, పార్టీలు, నవ్వులు, అల్లరి… ఇలా అంతా హ్యాపీగానే ఉంటుంది. దియా కూడా అల్లీని తన స్నేహితురాలిగానే చూస్తుంది. కానీ రోజులు గడిచేకొద్దీ కునాల్, అల్లీ మధ్య ఓ కొత్త ఆకర్షణ మొదలవుతుంది. అది మొదట చిన్న ఫీలింగ్‌లా కనిపించినా… క్రమంగా కునాల్ మనసులో పెద్ద గందరగోళానికి కారణమవుతుంది.

ఒకవైపు తనతో పదేళ్లుగా కలిసి జీవిస్తున్న దియా. ఆమెతో ఉన్న అనుబంధం, ప్రేమ, జ్ఞాపకాలు ఒకవైపు ఉంటే… మరోవైపు అల్లీతో ఏర్పడుతున్న కొత్త ఆకర్షణ మరోవైపు లాగుతుంది. ఇన్నేళ్లుగా తనకు తెలుసు అనుకున్న ప్రేమ నిజంగా ఎంత బలమైనది? కొత్తగా కలిగిన ఆకర్షణ కేవలం క్షణికమైనదేనా ? అనే ప్రశ్నలు కునాల్‌ను వెంటాడడం మొదలవుతుంది. ఇదే సమయంలో దియా, అల్లీల మధ్య కూడా ఓ చిన్న సరదా ఆట మొదలవుతుంది. కునాల్ భావోద్వేగాలతో ఆడుకున్న ఈ వ్యవహారం ఊహించని స్థాయిలో గందరగోళానికి దారితీస్తుంది. సరదాగా మొదలైన విషయం క్రమంగా సంబంధాల్లో నమ్మకం, నిజాయితీ, కమిట్‌మెంట్‌లను ప్రశ్నించే పరిస్థితికి తీసుకెళ్తుంది.

Advertisement

ఇంతకాలం తమ బంధానికి పెళ్లి అవసరం లేదని భావించిన కునాల్‌కు ఇప్పుడు అసలు సంబంధం అంటే ఏమిటనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి ? ఒకరితో కలిసి జీవించడం మాత్రమే బంధానికి సరిపోతుందా ? కొత్త వ్యక్తిపై ఆకర్షణ కలిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ? అనే ప్రశ్నలు కథలో కీలకంగా మారతాయి. మరోవైపు దియా కూడా పరిస్థితిని సాధారణంగా తీసుకోలేకపోతుంది. తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి తనను మోసం చేశాడా ? ఇన్నేళ్ల ప్రేమకు అసలు విలువ లేదా ? అనే బాధ ఆమెను వెంటాడుతుంది. అల్లీతో ఉన్న స్నేహం కూడా ఇప్పుడు మరో పరీక్షను ఎదుర్కొంటుంది.

కునాల్ జీవితంలో ఏర్పడిన ఈ లవ్ ట్రయాంగిల్ చివరకు ఎక్కడికి దారితీసింది? దియా, అల్లీల మధ్య స్నేహం నిలిచిందా? పదేళ్ల ప్రేమను కునాల్ కాపాడుకున్నాడా? లేక కొత్త ఆకర్షణకు లొంగిపోయాడా? ముఖ్యంగా తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణ నిజమేనా? అనేది సినిమా చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది.

తెలుగులో కూడా చూడవచ్చు

షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ఆధునిక సంబంధాలు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్, ప్రేమలో వచ్చే కన్ఫ్యూజన్, ఫ్రెండ్‌షిప్, ఎమోషనల్ డ్రామాతో పాటు కామెడీని కలిపి ఈ కథను రూపొందించారు. ‘కాక్‌టెయిల్ 2’లో భారీ యాక్షన్ లేదా సీరియస్ డ్రామా కంటే… నేటి తరం రిలేషన్‌షిప్స్‌లో కనిపించే కన్ఫ్యూజన్, ప్రేమలో స్వేచ్ఛ, కమిట్‌మెంట్ వంటి అంశాలే ప్రధానంగా కనిపిస్తాయి. రొమాంటిక్ కామెడీలు, లవ్ ట్రయాంగిల్ కథలు, రిలేషన్‌షిప్ డ్రామాలను ఇష్టపడేవారికి ఇది మంచి టైమ్‌పాస్ వాచ్. ప్రస్తుతం Netflixలో హిందీతో పాటు తెలుగు ఆడియోలో ‘కాక్‌టెయిల్ 2’ను చూడొచ్చు.

Read Also: పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

Tags

Related News

జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

బెంగాల్ మొత్తం ఈ జంట వెంటే.. హార్డ్ డ్రైవ్ కోసం ఇదేం అరాచకం భయ్యా

చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్

ఫేస్ ఇంటర్నేషనల్ స్టార్ లా ఉందని జీవితమే నరకం చేశారు… సమాజం చేసిన పనికి దిమ్మతిరిగిపోతుంది

తల్లి కొడుకుల మధ్యే పవర్ వార్… సొంత కుటుంబంతోనే ఇంత పెద్ద వార్ ఏంట్రా బాబూ

గురువుతో గొడవ పెట్టుకున్న స్టూడెంట్… టీవీ లైవ్‌లో రచ్చ రచ్చ.. అసలు గుట్టేంటి భయ్యా?

ఆర్టిస్టులకు ‘గుడ్ లక్’ చెబితే ఇంత ఘోరమా ? ఈ నమ్మకం వెనకున్న అసలు స్టోరీనే ఈ మూవీ

Big Stories

Advertisement
×