E-Paper
Advertisement

ఏదైనా ఉంటే ముఖంపైనే చెప్పండి..రిటైర్మెంటైనా తీసుకుంటా

ఏదైనా ఉంటే ముఖంపైనే చెప్పండి..రిటైర్మెంటైనా తీసుకుంటా
Advertisement

Mohammed Shami On Ajit Agarkar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami) జట్టులోకి రీ- ఎంట్రీ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు. దేశవాళి నుంచి మొదలుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వరకు అన్నింటిలో అద్భుతంగా రాణిస్తూ, ముందుకు సాగుతున్నాడు. ఫిట్నెస్ కూడా అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. ఇంత చేసిన కూడా టీమిండియాలో అతడికి అవకాశం రావడం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup) దగ్గర పడుతున్నప్పటికీ కూడా అతడిని పట్టించుకునే నాధుడే లేడు.. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ ఇద్దరు జట్టులో బాధ్యతలు తీసుకున్న తర్వాత మహమ్మద్ షమీకి అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు.

ఏదైనా ఉంటే ముఖంపైనే చెప్పండి..రిటైర్మెంటైనా తీసుకుంటా

టీమిండియాలో అవకాశం రాకపోవడంపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు మహమ్మద్ షమీ. ఇంకా ఎన్ని రోజులు నన్ను సెలెక్ట్ చేయకుండా ఉంచుతారు.. ఏదైనా ఉంటే నా ముఖం మీదే చెప్పేయండి.. రిటైర్మెంట్ తీసుకొని హాయిగా ఉంటానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఎన్నిసార్లు పెర్ఫార్మెన్స్ చూపించాలి.. ఎన్ని వికెట్లు పడగొట్టాలి ? ఇలాగే ఆడుకుంటూ వెళ్లాలా ? ఇక నాకు ఛాన్స్ ఇవ్వరా ? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దీనిపై నాకు సమాధానం చెప్పాల్సిందేనని టీమిండియా సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు మహమ్మద్ షమీ. ఎంపిక చేసే సెలెక్టర్ ల నుంచి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

భూతద్దాలు పెట్టుకోని..నా ప్ర‌ద‌ర్శ‌న చూడండి

తాను నిరంతరం దేశవాళి క్రికెట్ ఆడుతున్నానని.. రంజీ ట్రోఫీలో 200 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశానని గుర్తు చేశారు. తాను రెడ్ బాల్ క్రికెట్ ఆడగలిగినప్పుడు… ఖచ్చితంగా వన్డే క్రికెట్ ఆడడానికి కూడా శారీరకంగా దృఢంగా ఉన్నట్లే కదా ? ఇది మీ కళ్ళకు కనిపించడం లేదా? అంటూ ఫైర్ అయ్యారు. తాను నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రతి ఫిట్నెస్ పరీక్షలో కూడా పాస్ అవుతున్నానని వివరించారు. ఎంపిక చేసే వారు ఎవరు కూడా తన ఫిట్నెస్ నివేదిక గురించి అడగలేదని మండిపడ్డారు. తన ఫిట్నెస్ వివరాలను వారికి అందించడం తన బాధ్యత కాదు… ఎంపిక చేసేవారికి ఆ విషయం తెలిసి ఉండాలని చురకలు అంటించారు మహమ్మద్ షమీ. ఈ నేప‌థ్యంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా టీమిండియా జట్టులో చాలామంది క్రికెటర్లు గాయాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. బుమ్రా నుంచి మొదలుకొని హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ ఆటగాళ్లు గాయపడినప్పుడు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటి వాళ్లను సెలెక్ట్ చేయకుండా టీమిండియా సెలక్టర్లు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

రీల్స్ పిచ్చికి భారీ మూల్యం..జెమిమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!

హార్దిక్ పాండ్యాకు డబ్బే సర్వస్వం..అందుకే సీజ‌న్ కో ఫ్రాంచైజీ మారుతున్నాడు

నా దారికే అడ్డొస్తావా ? బంగ్లా బ్యాట‌ర్ మిరాజ్ కు స్టార్క్ వార్నింగ్..వేలు చూపిస్తూ మ‌రీ

బంగ్లాదేశ్ దూకుడు చూస్తే…ఆస్ట్రేలియా ఓడిపోయేలా ఉంది

హ్యారీ బ్రూక్ లాంటి వెధ‌వ‌ల‌ను మ‌ళ్లీ ఐపీఎల్ లోకి రానివ్వొద్దు !

మా పాకిస్తాన్ కెప్టెన్లు ద‌ద్ద‌మ్మ‌లు..400 వికెట్లు తీయ‌డానికి న‌ర‌కం అనుభ‌వించా

విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ దెబ్బ అదుర్స్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న పాకిస్తాన్‌

Big Stories

Advertisement
×