Spider-Man : brand new day Movie review:ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సినిమాకి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా చూసే సినిమా ఇది. అలాంటి ఈ స్పైడర్ మాన్ కి సీక్వెల్ గా స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man : brand new day) సినిమా ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇది ఆడియన్స్ ను ఆకట్టుకుందా? స్పైడర్ మ్యాన్ మూవీ రేంజ్ లో సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.. టామ్ హాలెండ్, జెండ్యా, జాకబ్ బాటాలాన్, సాదీ సింక్, జాన్ బెర్నథాల్ పలువురు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వంలో మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఒకరోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు. మరి ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. గత సినిమాలో స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్ (టామ్ హాలెండ్) (Tom Holland )తన అత్త మే పార్కర్ చనిపోవడంతో తనే స్పైడర్ మ్యాన్ అనే జ్ఞాపకాలని అందరిలో చెరిపేస్తారు. తన గర్ల్ ఫ్రెండ్ ఎంజే (జెండ్యా), ఫ్రెండ్ నెడ్ (జాకబ్ బాటాలాన్) కూడా మర్చిపోయేలా చేసి ఒంటరిగా బాధపడుతూ బ్రతుకుతూ ఉంటాడు. పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని అందరూ మర్చిపోయినా.. అతను మాత్రం ఒక పోలీస్ మహిళ అధికారికి టచ్ లో ఉంటూ న్యూయార్క్ సిటీను పలు నేరాల నుంచి ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అయితే ఒకరోజు న్యూయార్క్ డామేజ్ కంట్రోల్ సిస్టంపై ఎవరో దాడి చేసి జైలులో ఉన్న స్పార్కియన్ (మైఖేల్ మాండో) తప్పించుకునేలా చేస్తారు.
ఆ తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి పలుమార్లు స్పైడర్ మ్యాన్ ని హెచ్చరించడం, డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ పై దాడి చేయడం లాంటివి చేస్తారు. అలాగే డామేజ్ కంట్రోల్(DODC) ఆఫీస్ మీద పడి వీ మ్యాక్స్ అనే ఒక సీక్రెట్ వస్తువును లేపేయాలని చూస్తాడు. ఇక అదే అజ్ఞాత వ్యక్తి స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ పై కూడా దాడి చేస్తానని బెదిరించడంతో తనని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు స్పైడర్ మ్యాన్. ఇక మనుషుల మైండ్స్ లోకి దూరే జెన్ గ్రే నే ఆ అజ్ఞాత వ్యక్తి అని తెలుస్తుంది. ఇక డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ హెడ్ బిల్ మెట్జర్ జేన్ గ్రే ను పట్టుకోవడానికి స్పైడర్ మాన్ సహాయం అడుగుతారు. మరి స్పైడర్ మ్యాన్ గ్రేని పట్టించాడా? అసలు జెన్ గ్రే ఎవరు? స్పైడర్ మ్యాన్ అతడిని ఎలా ఆపాడు? లాంటి తదితర విషయాలు తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.
ALSO READ:శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?
పనీషర్ ఎంట్రీ, హల్క్ తో గొడవ.. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించారు. పనీషర్ సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్లలో అరుపులు, కేకలే. అతడితో స్నేహం చేస్తూనే విలన్ తో హీరో చేసే ఫైట్లు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.. హల్క్ ఉన్నట్టుండి కంట్రోల్ తప్పి కోపంతో ఊగిపోతుంటే.. అతడిని ఆపడానికి స్పైడర్ కలిసి చేసే ఫైట్ నిజంగా థియేటర్లలో పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి. క్లైమాక్స్ లో నింజాతో చేసే ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. డైరెక్టర్ విషయానికి వస్తే.. గతంలో షాంగ్ – చీ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ ఈ సినిమాను చెక్కిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఎమోషన్ సన్నివేశాలు పీక్స్ లో చూపిస్తూనే.. విజువల్స్ తో మాయ చేశాడు. 3d గ్లాసులు పెట్టుకొని చూస్తుంటే స్పైడర్ మ్యాన్ నిజంగా మన పక్కనుంచి ఎగిరి దూకినట్టు అనిపిస్తుంది. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయనే భావన కలుగుతుంది.
మాస్ యాక్షన్ కోసం వెళ్లే వాళ్లకు కొంచెం డల్ గా అనిపించినా.. ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ మాత్రం గుండెలకు హత్తుకుంటుంది. రక్తం చుక్క కనపడదు.. వల్గర్ సీన్లు అసలే లేవు.. ఫ్యామిలీతో కలిసి అందరూ చక్కగా హ్యాపీగా చూసే సినిమా ఇది. హల్క్ స్క్రీన్ టైము తక్కువ ఉండడం ఒక్కటే కొంచెం ఫాన్స్ ను నిరాశకు గురి చేసినా.. సినిమా మాత్రం పైసా వసూల్ అని చెప్పవచ్చు.