Panasonic 7kg top load washing machine: ఉదయాన్నే ఆఫీసులకు పరిగెత్తే బిజీ లైఫ్‌లో బట్టలు ఉతకడం అనేది పెద్ద విసిగించే పని! అందుకే ప్రతీ ఇంట్లో ఒక మంచి వాషింగ్ మెషీన్ ఉండటం అత్యవసరంగా మారింది. అయితే నేటి కాలంలో తక్కువ ధరలో.. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ ఎంచుకోవడమే అసలైన ఛాలెంజ్. ప్రముఖ జపాన్ బ్రాండ్ ‘పానాసోనిక్’ నుంచి వచ్చిన 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ. 17,190 ధరలో మార్కెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ మెషిన్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
పానాసోనిక్ ఈ వాషింగ్ మెషీన్‌ను చాలా మోడ్రన్ అండ్ కాంపాక్ట్ డిజైన్‌తో తీర్చిదిద్దింది. మీ ఇంట్లో లేదా బాల్కనీలో తక్కువ స్థలం ఉన్నా ఇది చాలా ఈజీగా అమరిపోతుంది. దీని టాప్ డోర్ క్వాలిటీ.. అద్భుతంగా ఉండి, వేగంగా పడిపోకుండా.. స్మూత్‌గా క్లోజ్ అయ్యే సాఫ్ట్-క్లోజ్ మెకానిజమ్‌తో వస్తుంది. దీని డిజిటల్ డిస్‌ప్లే అండ్ కంట్రోల్ ప్యానెల్ వాడటానికి చాలా ఈజీగా ఉంటుంది.
3 నుంచి 5 మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు ఈ 7 కేజీల కెపాసిటీ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. రోజూవారీ ఉతికే బట్టలతో పాటు బెడ్ షీట్లు, కర్టెన్లు లేదా జీన్స్ వంటి బరువైన బట్టలను కూడా ఇందులో చాలా ఈజీగా ఉతుక్కోవచ్చు. డ్రమ్‌లో తగినంత స్థలం ఉండటం వల్ల బట్టలు ఒకదానికొకటి చిక్కుకోకుండా శుభ్రపడతాయి.
ఈ మెషీన్‌లోని అడ్వాన్స్‌డ్ వాష్ టెక్నాలజీ బట్టల్లోని కఠినమైన మురికిని, మరకలను ఈజీగా వదిలిస్తుంది. దీంట్లోని ‘అక్వా స్పిన్ వాష్’ ఫీచర్ వల్ల సబ్బు నీరు బట్టలను మూలమూలకూ సమానంగా విస్తరిస్తుంది. దీని వల్ల కాలర్లు, పిన్స్ దగ్గర ఉన్న మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది. అదే సమయంలో బట్టల రంగులు మసకబారకుండా, ఫాబ్రిక్ క్వాలిటీ పాడవకుండా ఇది జాగ్రత్త పడుతుంది.
కరెంట్, నీరు వాడకం విషయంలో ఈ పానాసోనిక్ మోడల్ చాలా పొదుపుగా పనిబచేస్తుంది. దీని స్మార్ట్ సెన్సార్లు బట్టల బరువును బట్టి ఎంత నీరు, ఎంత సమయం కావాలో .. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటాయి. దీని వల్ల అదనంగా వాటర్ వృథా కాకుండా, నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లు కూడా అదుపులో ఉంటుంది.
Also Read: అమ్మాయిల కోసం స్టైలిష్ & సేఫ్ స్మార్ట్‌వాచ్ ..ధర కూడా చాలా తక్కువ
మెషీన్ లోపల ఇచ్చే వాష్ డ్రమ్ పూర్తి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది. దీని వల్ల డ్రమ్ తుప్పు పట్టే అవకాశం ఉండదు. బ్యాక్టీరియా చేరకుండా బట్టలు శుభ్రంగా ఉంటాయి. ఎక్కువ కాలం నిలిచేలా చేసిన పవర్ ఫుల్ మోటార్ వల్ల వాషింగ్ అండ్ డ్రైయింగ్ ప్రాసెస్ చాలా వేగంగా అండ్ శబ్దం లేకుండా పూర్తి అవుతుంది.
మన నిత్య జీవితంలో వాడే వేర్వేరు రకాల బట్టల కోసం ఇందులో ప్రత్యేకమైన వాష్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కాటన్, సిల్క్, సారీస్, డెలికేట్ లేదా క్విక్ వాష్ (తక్కువ సమయంలో ఉతికే మోడ్) వంటి ఆప్షన్లను ఒకే ఒక్క బటన్ ప్రెస్‌తో సెలెక్ట్ చేసుకోవచ్చు.
కేవలం రూ. 17,190 ధరలో జపాన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, 7 కేజీల లార్జ్ కెపాసిటీ, బెస్ట్ వాషింగ్ పవర్ అండ్ డ్యూరబుల్ బిల్డ్ క్వాలిటీ అందిస్తున్న ఈ మోడల్ ప్రతీ మిడిల్ క్లాస్ కుటుంబానికి ఒక వర్త్ అండ్ పైసా వాసూర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.