E-Paper
Advertisement

విడాకుల నోటీసు ఇచ్చిన 2 రోజులకే శవమయ్యే భార్య… తెలుగులో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

విడాకుల నోటీసు ఇచ్చిన 2 రోజులకే శవమయ్యే భార్య… తెలుగులో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
Advertisement

Death of the Pastor’s Wife OTT: సమాజంలో గౌరవంగా కనిపించే ఓ పాస్టర్… ఇంట్లో మాత్రం భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు వస్తే ? భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న ఓ మహిళ, విడాకుల నోటీసులు ఇచ్చిన రెండు రోజులకే అనుమానాస్పదంగా చనిపోతే ? పోలీసులు దాన్ని ఆత్మహత్యగా తేల్చినా, కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని పోరాడితే ? అమెరికాలో సంచలనం సృష్టించిన మికా మిల్లర్ మరణం వెనుక ఉన్న అసలు నిజమేంటి ? ఇదే ఉత్కంఠభరితమైన కథతో వచ్చిన ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘Death of the Pastor’s Wife’. ఈ సిరీస్ ను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అన్న విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సౌత్ కరోలినాకు చెందిన మికా మిల్లర్, పాస్టర్ జాన్-పాల్ మిల్లర్‌ను వివాహం చేసుకుంటుంది. బయట ప్రపంచానికి వారి జీవితం సాధారణంగానే కనిపించినా, మికా మాత్రం భర్త తనపై నిఘా పెట్టడం, ఆర్థిక స్వేచ్ఛను కంట్రోల్ చేయడం, సైబర్ స్టాకింగ్ చేయడం వంటి వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తుంది. ఈ పరిస్థితులతో విసిగిపోయిన మికా చివరకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ భర్తకు విడాకుల నోటీసులు అందిన కేవలం రెండు రోజులకే, అంటే 2024 ఏప్రిల్ 27న నార్త్ కరోలినాలోని ఓ స్టేట్ పార్క్ సమీపంలోని నదిలో ఆమె మృతదేహం కనిపిస్తుంది.

Advertisement

మరణానికి కొద్దిసేపటి ముందు మికా ఎమర్జెన్సీ సేవలకు ఫోన్ చేసి తనను తాను చంపుకోబోతున్నట్లు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆమె మరణాన్ని ఆత్మహత్యగా పరిగణించారు. కానీ మికా కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆమె భర్తపై ఉన్న ఆరోపణలు, మరణానికి ముందు జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక మికా మరణించిన మరుసటి రోజే జాన్-పాల్ చర్చిలో ఆమె మరణం గురించి మాట్లాడిన తీరు కూడా అనేక అనుమానాలకు కారణమైంది.

దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మికాపై జరిగిన వేధింపులకు సంబంధించిన అంశాలు బయటకు వచ్చాయి. FBI దర్యాప్తులో కూడా జాన్-పాల్ ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు పరిశీలనకు వచ్చాయి. అతనిపై సైబర్ స్టాకింగ్‌కు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అసలు మికా ఎలా చనిపోయింది ? ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా ? లేక ఆమె కుటుంబం అనుమానిస్తున్నట్లుగా మరేదైనా జరిగిందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలే ఈ డాక్యుమెంటరీ.

Advertisement

మికా మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాయిస్ నోట్స్, కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలను కూడా ఇందులో చూపించారు. దీంతో ఇది కేవలం ఓ మిస్టరీ డెత్ కథ కాకుండా, ఓ మహిళ ఎదుర్కొన్న వేధింపులు, ఆమె మరణం చుట్టూ నెలకొన్న అనుమానాలు, ఆ తర్వాత జరిగిన దర్యాప్తును చూపించే ట్రూ క్రైమ్ సిరీస్‌గా మారింది.

Also Read : కాస్ట్యూమ్ కోసం వెళ్తే ఎర్రటి ఆకారం ఎంట్రీ… పాప్ స్టార్ ను పరుగులు పెట్టించే హర్రర్ స్టోరీ

తెలుగులో ఏ ఓటీటీలో చూడాలి ?

‘డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్’ మూడు ఎపిసోడ్ల అమెరికన్ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. మైక్ గ్యాస్పారో, జూలియా విల్లోబీ నాసన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆగస్టు 26 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగుతో పాటు ఇంగ్షీషు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

 

Tags

Related News

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×