Fastrack Limitless FS1: ప్రస్తుత డిజిటల్ జనరేషన్‌లో చేతికి ఒక స్టైలిష్ స్మార్ట్‌వాచ్ లేకపోతే.. లుక్కే అసంపూర్ణంగా ఉంటుంది. అయితే.. మార్కెట్లో వందల కొద్దీ లోకల్ బ్రాండ్స్ ఉన్నా, ‘ఫాస్ట్‌ట్రాక్’లాంటి నమ్మకమైన బ్రాండ్ నుండి వచ్చే క్రేజ్ వేరు. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే.. ఫీచర్లతో యూత్‌ని ఆకట్టుకోవడానికి వచ్చిన సరికొత్త మోడలే Fastrack Limitless FS1. కేవలం రూ.1,999 బడ్జెట్‌లోనే బ్లూటూత్ కాలింగ్, పెద్ద డిస్‌ప్లే, అలెక్సా సపోర్ట్ వంటి ఎన్నో ప్రీమియం ఫీచర్లను అందిస్తున్న ఈ వాచ్ రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ వాచ్ కొనాలనుకునే.. ప్రతి ఒక్కరూ చూసేది లుక్, బ్రాండ్ వాల్యూ, తక్కువ ధర. ఈ మూడింటి కాంబినేషన్‌తో లాంచ్ అయిందే.. ఫాస్ట్‌ట్రాక్ లిమిట్‌లెస్ FS1. రెండు వేల లోపు లభించే ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్‌లోని టాప్ హైలైట్స్ ..
ఈ స్మార్ట్ వాచ్‌లో మొదటిగా మిమ్మల్ని ఆకట్టుకునేది దీని డిస్‌ప్లే. ఇందులో 1.95 ఇంచుల పెద్ద హారిజన్ కర్వ్డ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 240×296 పిక్సెల్స్ రిజల్యూషన్ , మంచి బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో వెళ్లినా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని కర్వ్డ్ టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా, ల్యాగ్ లేకుండా ప్రీమియం ఫీల్ ఇస్తుంది.
రూ. 1,999 ధరలోనే ఇందులో అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. సింగిల్ సింక్ టెక్నాలజీ వల్ల ఫోన్‌తో.. చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. ఇన్-బిల్ట్ మైక్ , స్పీకర్ ద్వారా ఫోన్ జేబులో నుంచి తీయకుండానే వాచ్ నుంచే నేరుగా మాట్లాడవచ్చు. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ ప్రైస్ రేంజ్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ రావడం నిజంగా ఒక అద్భుతమైన విషయం. కేవలం మీ వాయిస్ కమాండ్‌తో వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు. అలారమ్స్ సెట్ చేయవచ్చు లేదా స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు.
ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం ఇందులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా 24×7 హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ , స్ట్రెస్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇకపోతే.. ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి చెమట లేదా చిన్నపాటి వర్షపు చినుకులకు పాడైపోతుందనే భయం లేదు.
Also Read: రూ.5వేలలోపే పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ !
నెక్స్ట్ జనరేషన్ చిప్‌సెట్ వాడటం వల్ల ఈ వాచ్ తక్కువ బ్యాటరీని ఉపయోగిస్తుంది. నార్మల్ యూసేజ్‌లో దీని బ్యాటరీ దాదాపు 5 రోజుల వరకు వస్తుంది. బ్లాక్, బ్లూ, పింక్ వంటి ట్రెండీ కలర్స్ , స్టైలిష్ సిలికాన్ స్ట్రాప్స్‌తో వస్తున్న ఈ వాచ్ కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీస్ గోయర్స్ అందరికీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.
చేతిలో ఎక్కువ బడ్జెట్ లేనప్పుడు, వారంటీ లేని ఏవో లోకల్ బ్రాండ్స్ వాచీలపై రూ.1,500 నుంచి రూ. 2,000 పెట్టే బదులు, నమ్మకమైన టాప్ బ్రాండ్ అయిన టైటాన్ ఫాస్ట్‌ట్రాక్ నుంచి వస్తున్న ఈ ‘Limitless FS1’ ను రూ.1,999 కే సొంతం చేసుకోవడం చాలా స్మార్ట్ డీల్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్‌లో.. లగ్జరీ లుక్ కావాలనుకునే వారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.