boAt Chrome Iris: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్ అనేది కేవలం గ్యాడ్జెట్ మాత్రమే కాదు, మన పర్సనల్ స్టైల్‌ని ఎలివేట్ చేసే ఒక ఫ్యాషన్ యాక్సెసరీ. ముఖ్యంగా మార్కెట్లో ఎన్నో.. మోడల్స్ ఉన్నా, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం, లగ్జరీ లుక్ ఇచ్చే వాచీల కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి వారి కోసమే.. ప్రముఖ ఆడియో, వేరబుల్ బ్రాండ్ ‘బోట్’ నుంచి సరికొత్తగా లాంచ్ అయింది boAt Chrome Iris. కేవలం రూ.3,299 బడ్జెట్ ధరలోనే అల్ట్రా-స్లీక్ మెటల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్, అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఒక బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్, అది కూడా లగ్జరీ లుక్‌తో దొరకడం చాలా అరుదు. ‘boAt Chrome Iris’ ఆ లోటును భర్తీ చేస్తూ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ముఖ్యంగా స్టైలిష్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్‌ని మనస్సులో ఉంచుకుని డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌లోని టాప్ హైలైట్స్ ఏంటంటే..
ఈ వాచ్ చూడటానికి చాలా క్లాసీగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. దీనికి వాడిన జింక్ అల్లాయ్ మెటల్ బాడీ కేవలం 8mm స్లిమ్‌గా ఉంటుంది. కాబట్టి చేతికి పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా, కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. రోజ్ పింక్, వెల్వెట్ వైన్, సిల్క్ స్కిన్ వంటి అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌తో పాటు సిలికాన్, మెటల్ మెష్ స్ట్రాప్స్ వెరైటీలలో ఇది లభిస్తుంది. ఆఫీస్ వేర్ కైనా, క్యాజువల్ జీన్స్ కైనా లేదా పార్టీస్ కైనా ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.
boAt Chrome Iris లో 1.32 ఇంచుల రౌండ్ అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 466×466 పిక్సెల్స్ హై-రిజల్యూషన్‌తో వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. అంటే మండుటెండలో బయటికి వెళ్లినా సరే, స్క్రీన్ పై ఉండే అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా.. ఇందులో ‘ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే’ సపోర్ట్ కూడా ఉండటం వల్ల ప్రతిసారీ స్క్రీన్‌ని టచ్ చేయకుండానే టైమ్ చూసుకోవచ్చు.
ఈ వాచ్‌లో సరికొత్త బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇన్-బిల్ట్ మైక్రోఫోన్, పవర్‌ఫుల్ స్పీకర్ ఉండటం వల్ల ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది.
Also Read: స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ ఇయర్‌ఫోన్స్ కావాలా? తక్కువ ధరలో.. బోట్ బేస్‌హెడ్స్ 220 !
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వాచ్‌లో ప్రత్యేకంగా ఫీమేల్ వెల్నెస్ ట్రాకింగ్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా పీరియడ్స్ సైకిల్, ఓవ్యులేషన్ పీరియడ్‌ను ఈజీగా ట్రాక్ చేయవచ్చు. సమయానికి అలర్ట్స్ , రిమైండర్స్ పంపడం ద్వారా రోజువారీ ప్లానింగ్‌ను ఇది మరింత ఈజీ చేస్తుంది.
ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఇందులో ఏకంగా 700 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. రన్నింగ్, వాకింగ్, యోగా, డ్యాన్సింగ్ ఇలా మీరు ఏ వర్కౌట్ చేసినా ఇది ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. దాంతో పాటు 24×7 హార్ట్ రేట్ మానిటర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ , బ్రీతింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ వల్ల వర్షానికి లేదా చెమటకు ఇది పాడవ్వదు. దీని బ్యాటరీ నార్మల్ యూసేజ్‌లో దాదాపు 4 నుంచి 5 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది.
సుమారు రూ.3,500 లోపు బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, బ్లూటూత్ కాలింగ్ , బెస్ట్-ఇన్-క్లాస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉన్న వాచ్ కోసం చూస్తుంటే, boAt Chrome Iris బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. స్టైల్, హెల్త్ ట్రాకింగ్ రెండూ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ .