E-Paper
Advertisement

నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!

నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!
Advertisement

Konidela Nagababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ముఖ్యమైన పదవి లభించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖకు చెందిన గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు ఆయనకు క్యాబినెట్ హోదాను కూడా కల్పించింది.

మంత్రవర్గంలో నాగబాబుకు చోటు..

Advertisement

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని లేదా రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సమీకరణాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, పార్టీ బలోపేతంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఆయన వహించిన కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

నేరుగా క్యాబినెట్ హోదా..

Advertisement

పర్యావరణ పరిరక్షణ, అటవీ ప్రాంతాల అభివృద్ధి, హరిత కార్యక్రమాల పర్యవేక్షణలో గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. నేరుగా క్యాబినెట్ హోదా దక్కడంతో ఆయనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరిగింది. పొత్తు నిర్వహణతో పాటు పార్టీలో క్రియాశీలకంగా ఉంటూనే, ఈ నూతన పదవి ద్వారా పర్యావరణ రక్షణ రంగంలో తన సేవలను అందించే అవకాశం ఆయనకు లభించింది.

 Also Read: జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్‌మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!

Tags

Related News

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

Big Stories

Advertisement
×