E-Paper
Advertisement

మీ ఫోన్ స్క్రీన్ ఈ 5 సంకేతాలు చూపిస్తోందా? అస్సలు నిర్లక్ష్యం చేయెుద్దు.. భారీ నష్టం జరగొచ్చు!

మీ ఫోన్ స్క్రీన్ ఈ 5 సంకేతాలు చూపిస్తోందా? అస్సలు నిర్లక్ష్యం చేయెుద్దు.. భారీ నష్టం జరగొచ్చు!
Advertisement

Display Warning: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్.. ప్రతీ ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న అవసరానికి చాలామంది ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. ఇదిలాఉంటే ఫోన్ కు డిస్ ప్లే అత్యంత ముఖ్యమైంది. కొన్నిసార్లు డిస్ ప్లేకు వచ్చే సమస్యల వల్ల రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే తనకు వచ్చే సమస్యల గురించే ఫోన్ డిస్ ప్లే ముందే హెచ్చరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే.. జేబుకు చిల్లుపడటం ఖాయమని అంటున్నారు. ఫోన్ స్క్రీన్ ప్రమాదంలో పడిందని హెచ్చరించే ఆ 5 ముఖ్యమైన సిగ్నల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్క్రీన్‌పై రంగురంగుల గీతలు

ఫోన్ డిస్‌ప్లేపై నిలువుగా లేదా అడ్డంగా తెల్లటి, పచ్చటి లేదా గులాబీ రంగు గీతలు కనిపిస్తున్నాయా? అయితే దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు అంటున్నారు. ఫోన్ కింద పడినప్పుడు లేదా స్క్రీన్‌పై ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు ఇలా జరుగుతుందని పేర్కొంటున్నారు. మొదట్లో ఒకటి లేదా రెండు గీతలతో ప్రారంభమై కాలక్రమేణా స్క్రీన్ మొత్తం నల్లగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

టచ్ సరిగ్గా పని చేయకపోవడం

Advertisement

స్క్రీన్‌పై ఒకచోట నొక్కితే వేరే చోట క్లిక్ కావడం, తాకకపోయినా ఫోన్ స్క్రీన్ అదే పనిగా ఓపెన్ అవ్వడం కూడా డిస్ ప్లే త్వరలో పాడవుతుందని చెప్పే సంకేతమని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ సమస్య మాత్రమే కాకపోవచ్చని.. స్క్రీన్ కింద ఉండే టచ్ సెన్సార్ లేయర్ దెబ్బతిన్నప్పుడు ఇలా జరుగుతుందని పేర్కొంటున్నారు. .

డిస్‌ప్లే బ్లింక్ అవ్వడం

ఫోన్ స్క్రీన్ వెలుతురు హఠాత్తుగా తగ్గిపోవడం, పెరగడం లేదా స్క్రీన్ నిరంతరం బ్లింక్ అవుతూ ఉండటాన్ని స్క్రీన్ ఫ్లికరింగ్ అంటారు. ఇంటర్నల్ హార్డ్‌వేర్ కనెక్షన్లు లూజ్ అయినప్పుడు, డిస్‌ప్లే కనెక్టర్ పాడైనప్పుడు ఈ సమస్య వస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే కొద్ది రోజుల్లోనే స్క్రీన్ పూర్తిగా బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది.

స్క్రీన్‌పై నల్లటి మచ్చలు

Advertisement

ఫోన్ స్క్రీన్‌పై ఎక్కడైనా నల్లటి చుక్క లేదా మచ్చ కనిపించి.. అది రోజురోజుకూ పెద్దదవుతుంటే.. వెంటనే అలర్ట్ అవ్వాలి. దీన్ని ‘డెడ్ పిక్సెల్స్’ అంటారు. స్క్రీన్ లోపల ఉండే లిక్విడ్ లీక్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ నల్లటి మచ్చలు క్రమంగా స్క్రీన్ మొత్తాన్ని కమ్మేస్తాయని ఆ తర్వాత స్క్రీన్‌ను మార్చడం మినహా మరో మార్గం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా మామ? ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో.. ఆఫీస్ లైఫ్‌ను హ్యాపీగా మార్చేయ్!

స్క్రీన్ గ్లాస్ పగలడం

మెుబైల్ స్క్రీన్ పగిలినప్పటికీ మార్చకుండా దానిని అలాగే కొందరు వాడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. స్క్రీన్‌పై పగుళ్లు ఉంటే.. ఫోన్ మాట్లాడేటప్పుడు చేతిలోని చెమట, గాలిలోని తేమ ఫోన్ లోపలికి సులభంగా వెళ్లిపోతుంది. ఇది లోపల షార్ట్ సర్క్యూట్‌కు దారితీసి మదర్‌బోర్డును సైతం పాడు చేస్తుంది.

Also Read: ‘తేమ’ను తరిమికొట్టే మిషన్.. పోర్టబుల్ బెటరా? హోల్ హౌస్ మంచిదా?

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×