E-Paper
Advertisement

200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ

200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ
Advertisement

Xiaomi 32 inch HD Ready Smart Google TV:  మీ ఇంటికి ఒక మంచి స్మార్ట్ టీవీ తీసుకోవాలని చూస్తున్నారా? ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ప్రముఖ టెక్ బ్రాండ్ షియోమి ఒక అద్భుతమైన ఆప్షన్ తెచ్చింది. అదే ‘షియోమి 32 ఇంచ్‌ల HD రెడీ LED స్మార్ట్ గూగుల్ టీవీ’. చూడటానికి ట్రెండీ మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌తో వచ్చే ఈ టీవీ, మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది రూ. 13,499 ధరకే.. లభించే ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ ఆడియో, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ , వందలాది ఉచిత ఛానెల్స్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్రెండీ గ్యాడ్జెట్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

షియోమి 32 ఇంచుల టీవీ ఫీచర్లు:

1.డిజైన్,లుక్:

ఈ టీవీ అతిపెద్ద హైలైట్ దాని ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్. స్క్రీన్ చుట్టూ అంచులు దాదాపుగా లేకపోవడం.. వల్ల ఇది చూడటానికి చాలా పెద్దదిగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. గోడకు మౌంట్ చేసినా లేదా టేబుల్ మీద.. స్టాండ్ పైన ఉంచినా.. మీ ఇంటర్‌డెకర్‌కు ఇది సరి కొత్త లుక్‌ను తీసుకువస్తుంది. మోడర్న్ హోమ్స్‌కు తగినట్టుగా దీన్ని డిజైన్ చేశారు.

2.పిక్చర్ క్వాలిటీ, హెచ్‌డీఆర్ 10:

Advertisement

షియోమి 32 ఇంచ్‌ల HD రెడీ LED డిస్‌ప్లేతో.. వచ్చే ఈ టీవీలో కలర్స్ చాలా రిచ్‌గా, షార్ప్‌గా కనిపిస్తాయి. ఇందులో.. ఉన్న HDR 10 సపోర్ట్ కారణంగా వీడియోలు చూసేటప్పుడు బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమాలు, సిరీస్‌లు లేదా లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు ప్రతి చిన్న పిక్ఛర్ చాలా స్పష్టంగా కనబడుతుంది.

3.సౌండ్  :

కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా.. ఆడియో పరంగా కూడా ఈ టీవీ అదుర్స్ అనిపిస్తుంది.ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ తో పాటు DTS X, DTS Virtual:X టెక్నాలజీలను అమర్చారు. దీని వల్ల బాహ్య స్పీకర్లు అవసరం లేకుండానే ఇంట్లోనే థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ పొందవచ్చు. మాటలు చాలా క్లియర్‌గా వినిపిస్తాయి.

Advertisement

Also Read: పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

4.గూగుల్ టీవీ ,ఫ్రీ ఛానెల్స్ :

ఇది గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. దీని వల్ల నెట్‌ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌ స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా ఇన్‌ స్టాల్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా.. ఎలాంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ లేకుండా 200+ పైగా ఉచిత లైవ్ ఛానెల్స్‌ను పొందే అవకాశం కూడా ఇందులో ఉంది.

5.ధర :

మార్కెట్లో ఈ షియోమి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అధికారిక ధర సుమారు రూ.13,499 గా ఉంది. ఈ బడ్జెట్‌లో ఇన్ని రకాల ప్రీమియం ఫీచర్లు లభించడం నిజంగా గొప్ప విషయమే. మీ ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ డబుల్ చేయాలనుకుంటే.. ఈ షియోమి స్మార్ట్ టీవీ ఒక బెస్ట్ ఛాయిస్!

Related News

డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్

టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!

Big Stories

Advertisement
×