Vivo Y31T: వివో తమ పాపులర్ Y సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. Vivo Y31T పేరుతో రానున్న ఈ మొబైల్ బడ్జెట్ ధరలోనే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ, మన్నిక విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ Vivo Y31T స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో రానుంది. రోజూవారీ వాడకంతో పాటు వీడియా చూసేందుకు ఈ స్క్రీన్ బాగుంటుంది. ఇక ఫోన్ పనితీరు విషయానికి వస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీనికి తోడు 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!
ఇక ఫొటోగ్రఫీ కోసం Vivo Y31Tలో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. అందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చనున్నారు. సాధారణ ఫొటోగ్రఫీకి ఈ కెమెరాలు సరిపోతాయి.
Vivo Y31Tలో అత్యంత ఆకర్షణీయమైన అంశం దీని బ్యాటరీనే. ఏకంగా 7200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇవ్వబోతున్నారు. దీనికి సపోర్ట్‌గా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఫోన్ ఉపయోగించవచ్చు. దీనికి తోడు నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కూడా ఇస్తున్నారు. బడ్జెట్ ఫోన్లలో ఈ రేటింగ్ ఉండటం చాలా అరుదు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఆఫ్‌లైన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తోంది. భారతదేశంలో దీని ధర సుమారు రూ.25,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి మన్నిక కోరుకునే వారికి ఈ వివో Y31T ఒక మంచి ఆప్షన్‌గా మారనుంది.
Also Read: టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?