E-Paper
Advertisement

‘తేమ’ను తరిమికొట్టే మిషన్.. పోర్టబుల్ బెటరా? హోల్ హౌస్ మంచిదా?

‘తేమ’ను తరిమికొట్టే మిషన్.. పోర్టబుల్ బెటరా? హోల్ హౌస్ మంచిదా?
Advertisement

Dehumidifier Comparison: వర్షాకాలంలో ప్రధానంగా వెంటాడే సమస్యల్లో తేమ (Humid) ఒకటి. ఇంట్లో తేమ ఎక్కువగా ఉంటే ఉక్కపోతగా అనిపించడంతో గోడలపై బూజు పట్టడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే గాలిలోని ఈ అదనపు తేమను తొలగించడానికి ‘డీహ్యూమిడిఫైయర్’ (Dehumidifier) అందుబాటులోకి వచ్చింది. అయితే మార్కెట్లోకి ఇవి ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్ (Portable) కాగా, రెండోది హోల్ హౌస్ డీహ్యూమిడిఫైయర్ (Whole House). మరి ఈ రెండింటిలో ఏది ఇంటికి సరిపోతుంది? ఏది కొంటే లాభం ఎక్కువ? అన్నది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్

ఇది చిన్న సైజు పరిణామంలో ఉంటుంది. ఇది చక్రాలను కలిగిన ఉండి.. ఇంట్లోని ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలోకి సులభంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా ఒక సింగిల్ రూమ్, బెడ్‌రూమ్, బేస్‌మెంట్‌లో తేమను తగ్గించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్.. గాలిలోని తేమను లాగేసి, ఒక చిన్న ట్యాంక్‌లో నీటి రూపంలో భద్రపరుస్తుంది. ఆ ట్యాంక్ నిండినప్పుడు చేతితో తీసి ఆ నీటిని పారబోయాల్సి ఉంటుంది.

హోల్ హౌస్ డీహ్యూమిడిఫైయర్ సంగతేంటి?

Advertisement

ఇది ఇంటి సెంట్రల్ హీటింగ్ లేదా ఎయిర్ కండిషనింగ్ (HVAC) సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కేవలం ఒక గదికి మాత్రమే పరిమితం కాకుండా ఇల్లంతటా ఒకేసారి గాలిలోని తేమను తొలగిస్తుంది. దీనికి ప్రత్యేకంగా నీటి ట్యాంకులు అంటూ ఉండవు. సేకరించిన తేమ (నీరు) డ్రైనేజీ పైపు ద్వారా నేరుగా బయటకు వెళ్లిపోతుంది.

దేని లాభం ఎంత?

బడ్జెట్ పరంగా పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. కొని తెచ్చుకుని ప్లగ్ పెడితే చాలు అవి వెంటనే పనిని ప్రారంభిస్తాయి. కానీ హోల్ హౌస్ డీహ్యూమిడిఫైయర్ ధర చాలా ఎక్కువే కాకుండా దీనిని ఫిట్ చేయడానికి టెక్నిషియన్ల సహాయం తప్పనిసరి. ఇక నిర్వహణ పరంగా చూస్తే.. పోర్టబుల్ వాటిల్లో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నీటి ట్యాంక్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేదంటే అది పని చేయడం ఆగిపోతుంది. హోల్ హౌస్ సిస్టమ్‌లో ఆ తలనొప్పి ఉండదు. నీరు నేరుగా బయటకు పోతుంది. ఏడాదికి ఒకసారి ఫిల్టర్లు మారిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. పైగా పోర్టబుల్ డివైజ్ తో పోలిస్తే.. హోల్ హౌస్ లో శబ్దం కూడా చాలా తక్కువ.

Advertisement

Also Read: UPI వాడుతున్నారా? రేపు మీ అకౌంట్ ఖాళీ కాకూడదంటే.. ఇప్పుడే ఇది చదవండి!

ఫైనల్గా ఏది బెస్ట్?

అద్దె ఇంట్లో ఉంటున్నా, ఇంటి మొత్తంలో కాకుండా కేవలం ఒకే ఒక్క గదిలో మాత్రమే తేమ సమస్య ఉంటే పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్ ట్రై చేయవచ్చు. అలా కాకుండా.. సొంత ఇల్లు ఉండి, ఇల్లంతా ఎప్పుడూ ఉక్కపోతగా, తేమతో బ్యాడ్ స్మెల్ వస్తుంటే.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా హోల్ హౌస్ డీహ్యూమిడిఫైయర్ కొనుగోలు చేయడం బెటర్. ఇది ఏసీపై భారాన్ని తగ్గించి.. కరెంట్ బిల్లు ఆదా అవ్వడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మీ అవసరం, అభిరుచి తగ్గట్లు సరిపోయే దానిని మీరు ఎంచుకోండి.

Also Read: టీవీ సౌండ్ నచ్చట్లేదా? రూ.5 వేలలో క్రేజీ సౌండ్‌బార్లు.. ఇంటిని థియేటర్‌లా మార్చేయండి!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×