E-Paper
Advertisement

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!
Advertisement

AI smartphones under Rs 30,000: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏఐ టెక్నాలజీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా రూ. 30,000 బడ్జెట్ విభాగంలో అత్యాధునిక ఏఐ కెమెరా ఫీచర్లు, గంటల తరబడి ఛార్జింగ్ అవసరం లేని భారీ బ్యాటరీలు, అద్భుతమైన ప్రాసెసర్లతో కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విభాగంలో పోటీపడుతున్న టాప్- 5 స్మార్ట్‌ఫోన్లు, వాటి ప్రధాన ఫీచర్లను ఈ కథనంలో చూద్దాం.

OnePlus Nord CE 6

వన్‌ప్లస్ కంపెనీకి చెందిన ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. OxygenOS AI ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్.. ఫోటో ఎడిటింగ్, సిస్టమ్ ఆప్టిమైజేషన్‌తో అద్భుతంగా పనిచేస్తుంది. 144Hz 1.5K AMOLED డిస్‌ప్లేతో పాటు ఏకంగా 8000 mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను దీనికి అందించారు.

Redmi Note 17 5G

Advertisement

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Redmi Note 17 5G ఇటీవలే విడుదలైంది. దీనికి ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 అందించారు. ఇందులోని AI ఆధారిత 50 ఎంపీ కెమెరా.. ఫోటోలను చాలా క్లారిటీగా క్యాప్చర్ చేయనుంది. స్నాప్ డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 6.99-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 8000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Realme 16x 5G

రియల్ మీ సైతం ఈ ఫోన్ ను రీసెంట్ గానే లాంచ్ చేసింది. ఇది 7,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో లభిస్తుంది. మీడియాటెక్ Dimensity 6300 5G ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో.. GT Boost గేమింగ్ ఇంజిన్, AI కెమెరా ప్రాసెసింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ లోని 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే.. గేమ్స్ ఆడటానికి, వీడియోలు చూడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Poco M8 Power

Advertisement

పోకో నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. 50MP AI ప్రైమరీ కెమెరాతో పాటు 6.83 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 8,000mAh బిగ్ బ్యాటరీతో రోజంతా నిరంతరాయంగా పనిచేసేలా ఈ ఫోన్ ను రూపొందించారు.

Also Read: ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

Motorola Edge 70

మోటో ఏఐ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్.. యూజర్ అలవాట్లను బట్టి బ్యాటరీ, నోటిఫికేషన్‌లను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, డిసెంట్ డిజైన్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Also Read: తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

Tags

Related News

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!

ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

BoAt Vs Noise..బ్యాటరీ, సౌండ్,ధర పరంగా ఏది కొంటే బెటర్?

ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

Big Stories

Advertisement
×