E-Paper
Advertisement

టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?

టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?
Advertisement

Independence Day Sale: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ఫోన్ లేదా ఇతర గాడ్జెట్లు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ వేదికల్లో సేల్స్ షురూ అయ్యాయి. నథింగ్, శాంసంగ్, మోటరోలా, రియల్‌మీ, వివో, సోనీ, కానన్, అంబ్రేన్ వంటి బ్రాండ్లు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుండి ఆడియో డివైజ్‌లు, పవర్ బ్యాంక్‌లు, కెమెరాల వరకు ప్రతి కేటగిరీలోనూ రకరకాల డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

బడ్జెట్ & మిడ్‌రేంజ్ ఫోన్లు కావాలంటే..

కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ సేల్‌లో మంచి ఆప్షన్లు ఉన్నాయి. డిజైన్, ఫీచర్లకు పేరుగాంచిన నథింగ్ ఫోన్ 4(బి) (8GB RAM + 128GB) ప్రారంభ ధర రూ.29,999గా ఉంది. ఇక తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారి కోసం మోటో G37 పవర్ రూ. 13,999కే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. దీనిలో 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి.

Advertisement

మరోవైపు శాంసంగ్ అభిమానుల కోసం గెలాక్సీ A27 5G రూ.28,999కి లభిస్తుండగా.. దీనిలో 120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 50MP కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక రియల్‌మీ సి100ఎక్స్ రూ. 14,499 ధరతో 8,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌తో రాగా, వివో టి5ఈ మోడల్ రూ.13,999 వద్ద అందుబాటులో ఉంది.

Also Read: ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

ఆడియో, పవర్ బ్యాంక్, కెమెరా డీల్స్..

Advertisement

స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రియులకు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. సోనీ SRS-XV500 స్పీకర్ అసలు ధర రూ.39,990 కాగా, ఈ సేల్‌లో రూ.25,990కే లభిస్తోంది. దీనికి రూ.2,599 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా తోడైతే రూ.23,391కే లభిస్తుంది. అలాగే సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారి కోసం అంబ్రేన్ స్టెల్లార్ 40K పవర్ బ్యాంక్ రూ.5,499కి దొరుకుతోంది. ఇది 40,000mAh కెపాసిటీతో సెమీసోలిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

అలాగే ఈ సేల్‌లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల కోసం కానన్ EOS R6 మార్క్ III కెమెరా రూ.2,43,995 ధరకు అందుబాటులో ఉంది. ఇది 32.5MP ఫుల్‌ఫ్రేమ్ సెన్సార్, సెకనుకు 40 ఫ్రేమ్‌ల షూటింగ్ స్పీడ్‌ కలిగి ఉంటుంది. ఫొటోగ్రఫీ లవర్స్‌కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదనే చెప్పాలి.

కొనే ముందు గమనించాల్సినవి..

సేల్‌లో డిస్కౌంట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ.. కేవలం ప్రకటనల ఆధారంగానే నిర్ణయం తీసుకోవద్దు. కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లను ఒకసారి బాగా పరిశీలించుకోవడం మంచిది. అలాగే ప్లాట్‌ఫారమ్‌ను బట్టి, సెల్లార్లను బట్టి ధరలు, స్టాక్ లభ్యత మారే అవకాశం ఉంది. మీ అవసరం, బడ్జెట్‌కు సరిపోయే ప్రొడక్ట్‌ను ఎంచుకుని సరైన ఆఫర్‌ను వినియోగించుకుంటే మంచి డీల్ పొందినట్లే.

Also Read: ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?

Tags

Related News

సింగిల్ ఛార్జ్‌తో 48 గంటలే పనిచేసే వివో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలోనే వాటర్ ప్రూఫ్ ఫీచర్!

డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్

200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×