Coconut for White Hair: వయసు పైబడక ముందే.. వైట్ హెయిర్ వచ్చిందని బాధపడుతున్నారా..? ఒక్కసారి కొబ్బరి నూనెలో ఈ నాచురల్ పదార్ధాలు కలిపి జుట్టుకు అప్లై చేస్తే.. కొద్ది రోజుల్లోనే వైట్ హెయిర్ అనేది శాశ్వతంగా తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు ఈ హెయిర్ ఆయిల్ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు, చుండ్రు సమస్యలను నివారించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాలిసిన పదార్ధాలు..
కొబ్బరి నూనె
అలోవెరా జెల్
విటమిన్ ఇ క్యాప్సూల్స్
ఉల్లిపాయ రసం
తయారుచేసుకునే విధానం..
ముందుగా ఒక చిన్న బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, ఉల్లిపాయ రసం తీసుకుని వీటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. క్రమంగా తెల్లజుట్టు అనేది తగ్గుతుంది. ఇందులో వాడే ప్రతి ఒక్కటి జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఇలా వారానికి రెండుసార్లు ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
తెల్లజుట్టు నివారించేందుకు మరొక చిట్కా.. పసుపులో ఈ పదార్ధాలు కలిపి జుట్టుకు అప్లై చేయండి. తెల్లజుట్టును నివారించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం..
కావాల్సిన పదార్ధాలు..
పసుపు..
కొబ్బరి నూనె
నిమ్మరసం
అలోవెరా జెల్
తయారు చేసుకునే విధానం..
ముందుగా ఐదు టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పసుపు వేసి, బాగా నల్లగా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలో తీసుకొని.. అందులో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలపి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళకు పట్టించండి. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. పసుపు చర్మ సౌందర్యానికే కాదు.. జుట్టు సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. జన్మలో జుట్టు రాలదు
తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మారాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఇందుకోసం..
కావాలిసిన పదార్ధాలు
గోరింటాకు పొడి
కాఫీ పొడి
ఆలివ్ ఆయిల్
పెరుగు
నిమ్మరసం
తయారు చేసుకునే విధానం..
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో కావాల్సినంత గోరింటాకు పొడి తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కాఫీ పొడి, టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తెల్లజుట్టు శాశ్వతంగా నివారించడంతో పాటు.. జుట్టు ఒత్తుగా పెరగటంలో సహాయపడుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.