BigTV English
Advertisement

ISRO SpaDeX Mission : స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించబోతున్న ఇస్రో.. అంతరిక్షంలో జాయింట్ శాటిలైట్లు

ISRO SpaDeX Mission : స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించబోతున్న ఇస్రో.. అంతరిక్షంలో జాయింట్ శాటిలైట్లు

ISRO SpaDeX Mission : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) త్వరలోనే ఒక విన్నూతన్న .. స్పేడ్ ఎక్స్ (SpaDeX) ప్రయోగం చేయబోతోంది. ఇందుకోసం భారత దేశంలో తొలిసారిగా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించబోతోంది. డిసెంబర్ 30న బుల్లెట్ కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించే రెండు శాటిలైట్లు (ఉపగ్రహాలు) అంతరిక్షంలోకి పంపనుంది. రెండు శాటిలైట్లు జాయింట్ గా అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. ఈ క్లిష్టమైన ప్రక్రియ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు.


అయితే ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని ఇప్పటివరకు ప్రపంచంలో రష్యా, అమెరికా, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే విజయవంతంగా ప్రయోగించాయి. ఇప్పుడు ఇస్రో కూడా దీన్ని ఉపయోగించడంతో భారత దేశం టెక్నాలజీ రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలువనుంది. స్పెస్ డాకింగ్ అంటే అంతరిక్షంలో స్వతంత్రంగా భ్రమణం చేసే రెండు శాటిలైట్లు కనెక్ట్ చేయడం. అయితే ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవి రెండూ కూడా చాలా హై వెలాసిటీ (అత్యంత వేగంగా)తో అంతరిక్షంలోని నియర్ వ్యాక్యూంలో (శూన్య ప్రదేశానికి సమీపంలో) భ్రమణం చేస్తూ ఉంటాయి.

డిసెంబర్ 30, 2024న చేయనున్న ఈ ప్రయోగం కోసం ఇస్రో రెండు ప్రత్యేక శాటిలైట్లను డిజైన్ చేసింది. ఒక్కో శాటిలైట్ బరువు 220 కేజీలు. ఈ శాటిలైట్లను పిఎస్‌ఎల్‌వి రాకెట్ సాయంతో అంతరిక్షంలోకి లాంచ్ చేస్తారు. ఈ ఉపగ్రహాలు భూగ్రహానికి ఆకాశంలో 470 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతాయి. కనుక అంత ఎత్తులో ఈ శాటిలైట్లను తీసుకెళ్లాలి. దీన్నే డాకింగ్ అంటారు. ఈ డాకింగ్ ప్రక్రియని భారతీయ డాకింగ్ సిస్టమ్ పర్యవేక్షిస్తుంది.


lso Read: 2024లో మారిన ప్రపంచ రాజకీయాలు.. ఏ దేశంలో ఏం జరిగిందంటే..

భారతీయ డాకింగ్ సిస్టమ్ ని ఇస్రో సొంతంగా అభివృద్ధి చేయడం ప్రత్యేకం. పైగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తయారు చేసిన ఇంటర్నేషన్నల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ కు భారత్ ఇస్రో తయారు చేసిన డాకింగ్ సిస్టమ్ సరితూగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే భారతీయ డాకింగ్ సిస్టమ్ ని భారత దేశం పేటెంట్ చేసింది. ఎందుకంటే ఈ డాకింగ్ సిస్టమ్ టెక్నాలజీ వివరాలను ఏ దేశాలు కూడా ఇతర దేశాలతో అంతర్జాతాయంగా పంచుకోవు. ఈ టెక్నాలజీ వివరాలు అంత రహస్యంగా ఉంచుతారు.

ఇక డిసెంబర్ 30న ప్రయోగించబోయే జాయింట్ శాటిలైట్ల స్పీడ్ విషయానికి వస్తే.. ఇవి గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఒక కమర్షియల్ విమానం కంటే 36 రెట్లు ఎక్కువ వేగంగా, బుల్లెట్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంగా దూసుకుపోతుంటాయి. ఇంతటి స్పీడుతో ప్రయాణం చేసేందుకు ఇస్రో ప్రత్యేకంగా వీటి కోసం రాకెట్లు డిజైన్ చేసింది. వీటి స్పీడ్ ని తగ్గించడానికి సెన్సార్లు కూడా ఇందులోనే అమర్చుతారు. వీటిని డాక్ చేసేముందు వీటి స్పీడ్ ని గంటకు 0.036 కిలోమీటర్ల వేగానికి తగ్గించేస్తారు.

ఈ హై స్పీడ్ శాటిలైట్ల పేర్లు చేజర్, టార్గెట్. ఒక్కసారి డాకింగ్ చేశాక.. ఇవి రెండూ కలిసి ఒక అంతరిక్ష విమానంలా వ్యవహరిస్తాయి. అయితే ఈ రెండు జాయింట్ శాటిలైట్ల ప్రయోగంలో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు శాటిలైట్లు కూడా ఒకే అర్బిట్ లో ఉంటూనే ఒకదానితో మరొకటి ఢీకొనకుండా జాగ్రత్త పడాలి.

ఈ స్పేస్ మిషన్ ఇండియాక అంతరిక్ష ప్రయోగాల్లో చాలా కీలకమైనది. ఇప్పటివరకు చంద్రుడిపై ఒక భారతీయుడిని పంపడం, చంద్రుడిపై ఒక స్పేస్ స్టేషన్ ని నిర్మించడం, చంద్రుడిపై నుంచి శాంపిల్స్ ని తిరిగి తీసుకొచ్చే మిషన్ ని విజయవంతంగా పూర్తి చేయడం.. ఇస్రో సాధించిన ఘనతలు. వీటికి తోడు ఇప్పుడు ఈ జాయింట్ శాటిలైట్ స్పేడ్‌ఎక్స్ మిషన్ చేపట్టడం కూడా ఇస్రో చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోనందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అనంత్ టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం చేయబోతోంది. అనంత్ టెక్నాలజీస్.. శాటిలైట్ అసెంబ్లీ, టెస్టింగ్ ప్రక్రియలో ఇస్రోకు సాయపడుతుందని సమాచారం.

ఈ స్పేస్ డాకాంగ్ మిషన్ విజయవంతంగా పూర్తి చేస్తే.. ప్రపంచంలో ఈ టెక్నాలజీతో వేగవంతమైన శాటిలైట్లు ప్రయోగించిన నాలుగవ దేశంగా భారత దేశం నిలువనుంది.

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×