Smartwatch Discount: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలో పలు ఉత్పత్తులపై ఏకంగా 88 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఇదే సమయంలో ప్రముఖ వాచ్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్‌పై 88 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్‌లో 1.39 అంగుళాల భారీ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది ప్రామాణికంగా మరింత స్పష్టమైన రంగులు, వివరాలతో ఉంటుంది. కాబట్టి మీరు సులభంగా, స్పష్టంగా నోటిఫికేషన్లు, కాల్స్, మెసేజెస్ వంటి ఇతర వాచ్ ఫీచర్లను చూడవచ్చు.
ఈ వాచ్ మరో ప్రత్యేకత బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. మీరు దీనిని మీ ఫోన్ ద్వారా అందుకు సంబంధించిన యాప్ ఇన్ స్టాల్ చేసుకుని లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చే అన్ని కాల్స్ చేసుకోవడంతోపాటు స్వీకరించుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా ట్రావెల్ సమయంలో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ క్రమంలో మీ ఫోన్ తీసుకెళ్ళకుండా కూడా మీరు కాల్స్ చేసుకోవచ్చు.
ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. మీరు వాయిస్ కమాండ్ల ద్వారా ఈ వాచ్‌కి ఆదేశాలు ఇవ్వవచ్చు. ఇది ఎంతో మంది వినియోగదారులకు సౌకర్యవంతమైన ఆప్షన్‌గా మారింది.
ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అనేక స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఇందులో 120+ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మీరు గేమ్స్, ఫిట్‌నెస్, వ్యాయామం, రన్నింగ్ సహా అనేక ఫీచర్లను దీనిలో పొందవచ్చు. ఈ క్రమంలో మీరు ఈ వాచ్ ద్వారా మీ శారీరక కార్యకలాపాలను ట్రాక్ చేసుకోవచ్చు.
ఈ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (ఆక్సిజన్ saturation) సెన్సార్ ఉన్నాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను, హార్ట్ రేట్ ను నిరంతరంగా మానిటర్ చేస్తాయి. వ్యాయామం లేదా శారీరక కార్యకలాపాల తరువాత, హార్ట్ రేట్ స్థాయిలను, ఆక్సిజన్ లెవల్స్ ను ట్రాక్ చేయవచ్చు. ఇది ఆరోగ్యంపై మరింత దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది.
Read Also: Washing Machine: రూ. 888కే బ్రాండెడ్ వాషింగ్ మిషన్.. ఐదేళ్ల వారంటీతోపాటు..
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్‌లో మెటల్ బాడీ ఉంటుంది. దీంతోపాటు డిజైన్ కూడా చాలా స్టైలిష్, ప్రీమియమ్ మాదిరిగా కనిపిస్తుంది.
ఈ వాచ్ లో 350mAh బ్యాటరీ ఉంది. ఇది 5 -10 రోజులు పని చేస్తుంది. కానీ బ్లూటూత్ కాలింగ్, ట్రాకింగ్, ఇతర ఫీచర్లు ఉపయోగించినప్పుడు బ్యాటరీ life తగ్గిపోవచ్చు. అయినప్పటికీ, సాధారణంగా ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రీమియమ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 11,999 కాగా, ప్రస్తుతం 88 శాతం తగ్గింపు ధరతో అమెజాన్లో రూ. 1399కి అందుబాటులో ఉంది. ఈ హోలీ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరగా కొనుగోలు గురించి నిర్ణయం తీసుకోండి మరి.