BigTV English

Shane Bond: ఇలాగే ఆడితే… బుమ్రా కెరీర్ క్లోజ్.. డేంజర్ బెల్స్ పంపిన బాండ్!

Shane Bond: ఇలాగే ఆడితే… బుమ్రా కెరీర్ క్లోజ్.. డేంజర్ బెల్స్ పంపిన బాండ్!

Shane Bond: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని గెలుచుకోవడంతో భారత క్రీడాభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు. లెజెండరీ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీలో లేకపోయినప్పటికీ భారత జట్టు కప్ గెలుచుకుంది. అందువల్ల ఈ విజయం భారత అభిమానులకు కూడా చాలా ప్రత్యేకమైనది. గాయం కారణంగా బుమ్రా ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు. మొదట ఈ టోర్నీ కోసం బుమ్రా ని ఎంపిక చేసినప్పటికీ.. గాయం తగ్గకపోవడంతో అతడు ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు.


 

అతడు త్వరగా కోలుకొని తిరిగి వస్తాడని భావించిన భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. వాస్తవానికి ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా కచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించే అతికొద్దీ మంది బౌలర్లలో ఇతడు కూడా ఒకరు. తన పదునైన యార్కర్లు, స్వింగ్ తో ఎంతటి బ్యాటర్ ని ఐనా బోల్తా కొట్టించగలడు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న బుమ్రాకి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కీలక హెచ్చరికలు జారీ చేశాడు.


దీంతో బుమ్రా కెరియర్ డేంజర్ లో పడనుందా..? షేన్ బాండ్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఐసీసీ వేదికలపై టీమిండియాని ఛాంపియన్ గా నిలిపిన బూమ్రాని మళ్లీ చూడలేమా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు భారత క్రీడాభిమానులు. బూమ్రా గాయంపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ మాజీ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ఏమన్నారంటే.. ” రాబోయే ప్రపంచ కప్ కి బుమ్రా అత్యంత కీలకం. అతడు జట్టులో ఉండడం చాలా ముఖ్యం.

బుమ్రా ని ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడించాలని చూస్తున్నారు. నేను అయితే అతడిని రెండు టెస్టుల కంటే ఎక్కువ ఆడించాలని కోరుకోవట్లేదు. అతడు ఫిట్ గా ఉంటే అన్ని మ్యాచ్లు ఆడించాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతడు ఇండియాకు బెస్ట్ బౌలర్. అన్ని ఫార్మాట్లలో అతడిని ఆడించి రెస్టు లేకుండా చేస్తే అతడి కెరీర్ కే ప్రమాదం పొంచి ఉంది. అతడు మళ్లీ అదే చోట గాయపడితే.. అది అతని కెరీర్ ని ముగించే అవకాశం ఉంది.

ఎందుకంటే మళ్లీ అదే చోట శస్త్ర చికిత్స చేయలేరని నేను అనుకుంటున్నాను. అయితే బూమ్రా వెన్నునొప్పితో బాధపడడం ఇది మొదటిసారి కాదు. రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ కారణంగానే 2020 టి-20 ప్రపంచ కప్ కూడా ఆడలేక పోయాడు. దాదాపు సంవత్సరం పాటు క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. ఆ తరువాత న్యూజిలాండ్ కి చెందిన ఓ ప్రముఖ వైద్యుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

 

ఇక గాయం తగ్గిన తర్వాత తిరిగి 2023 ప్రపంచ కప్ లో విధ్వంసం సృష్టించాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరోసారి వెన్ను నొప్పికి గురయ్యాడు. ఆ కారణంగా ఇప్పటికీ ఇంకా కోలుకోలేదని సమాచారం. బుమ్రా క్రికెట్ లోకి తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ప్రారంభ మ్యాచ్ లకు కూడా దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి నాలుగు మ్యాచ్లకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో బుమ్రా కెరీర్ పై షేన్ బాండ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×