Washing Machine: మీరు మంచి ఫీచర్లతో ఉన్న తక్కువ ధర వాషింగ్ మిషన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. సరైన వాషింగ్ మిషన్ ఎంపిక చేసుకునే విషయంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటగా మీ కుటుంబ సభ్యుల సైజుతోపాటు వాషింగ్ మిషన్ ఫీచర్లను కూడా పరిశీలించాలి. టాప్ లోడింగ్ లేదా ఫ్రంట్ లోడింగ్ మోడల్స్ ఎంచుకోవడంలో ఎనర్జీ రేటింగ్ వంటి అంశాలను గుర్తుంచుకోవాలి. దీంతోపాటు బ్రాండ్, వాషింగ్ సామర్థ్యం, నీటి వినియోగం కూడా కీలకమైన అంశాలుగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆఫర్ ధరల్లో ఉన్న బ్రాండెడ్ వాషింగ్ మిషన్ వివరాల గురించి ఇక్కడ చూద్దాం.
Read Also: Smartphone: 7,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్స్..
ఈ వాషర్‌కు ప్రస్తుతం సగటు రేటింగ్ 4.5/5గా ఉంది. పలువురు వినియోగదారులు దీని శుభ్రత, డ్యూరబిలిటీ, సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు. కొన్ని సమీక్షలు మరింత ప్రొఫెషనల్ ఫీచర్లు లేనట్లుగా పేర్కొన్నాయి. కానీ ఈ ధర శ్రేణిలో ఇది మంచి ఎంపిక అని చెబుతున్నారు. సాధారణంగా Voltas Beko 7.5 kg Washer మంచి పనితీరు, సరైన ధరతోపాటు వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఉంటుంది. ఈ వాషర్ మీ రోజువారీ వాషింగ్ అవసరాలను తీర్చడంలో మీకు సహాయపడుతుంది.
7.5 కిలోల సామర్థ్యం ఉన్న ఈ వాషర్, చిన్న, మధ్య స్థాయి కుటుంబాలకు అనువైనది. దీని ద్వారా ఒకేసారి ఎక్కువ డ్రెస్సులను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇది సరైన ధరతోపాటు వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు మీ ఇంటి అందాన్ని పెంచుతాయి. ఈ వాషర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు, దీని పనితీరు, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో దీని ధర రూ. 5083 కాగా, మీరు దీనిని ఈఎంఐ ద్వారా తీసుకుంటే మీరు రూ. 888 చెల్లిస్తే సరిపోతుంది. ఆ క్రమంలో మీరు ఆరు నెలల పాటు రూ. 888 చెల్లిస్తే ఈ వాషింగ్ మిషన్ మీ సొంతమవుతుంది.