Aadhaar Address Update : కొత్త ఇంటికి మారాలి అనుకుంటున్నారా లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి మారాలనుకుంటున్నారా? ఈ సమయంలోనే ఈ కామర్స్ సైట్స్ తో పాటు బ్యాంకు సంబంధించిన పలు ప్లాట్ఫామ్స్ లో సైతం అడ్రస్ ను మార్చాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికంటే ముందు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకూడదు. ఆధార్ అడ్రస్ ను అప్డేట్ చేయడం వల్ల అన్ని సేవలను సులభంగా యాక్సెస్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ ఐడెంటిటీని దుర్వినియోగం కాకుండా నిరోధించే అవకాశం కూడా ఉంటుంది. మరి అసలు ఆధార్ కార్డులో అడ్రస్ ను ఎలా మార్చాలంటే..
ఆధార్ కార్డును అప్డేట్ చేయడం ఎంతో తేలికైన విషయం. ఇందులో అడ్రస్ మార్చడం మరింత తేలిక. ఇందుకోసం యూఐడీఏఐ ఆన్‌లైన్ పోర్టల్ ను ఉపయోగించాలి. ప్రస్తుతం ఆధార్ ఉన్నవారు తమ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును యూఐడీఏఐ పొడిగించింది. డిసెంబర్ 14, 2024 వరకు ఉచితంగా అడ్రస్ వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు. జూన్ 2024లో ప్రారంభ గడువు తర్వాత ఇప్పుడు మరోసారి ఈ గడువును యూఐడీఏఐ పొడిగించింది. అయితే ఈ అప్డేట్ ఎలా చేయాలంటే..!
ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (myaadhaar.uidai.gov.in)ను ఓపెన్ చేయాలి
ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది
ఆధార్ ప్రొఫైల్ అడిగే మిగిలిన వివరాలు ఇవ్వాలి
అడ్రస్ లేదా ఇతర అవసరమైన డేటాను మార్చి అప్‌డేట్ చేయాలి
ఇందుకోసం JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్ (PoA) డాక్యుమెంట్ ను స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి. ఇక గరిష్ట పరిమాణం 2MB వరకూ ఈ డ్యాక్యుమెంట్ ను అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ పంపి, స్టేటస్ ట్రాక్ చేయడానికి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ను సేవ్ చేసుకోవాలి. ఇక ఆధార్ అడ్రస్ అప్డేట్ అయిందో లేదో తెలుసుకోటానికి (SRN) స్టేటస్ క్రమం తప్పకుండా చెక్ చేయాలి.
అయితే ఈ అవకాశం అడ్రస్ ను అప్డేట్ చేయాలనుకునే వారికి మాత్రమే ఉంటుంది. ఫింగర్ ఫ్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్‌లలో మార్పులు చేయడం వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు మాత్రం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక ఈ రోజుల్లో ప్రతీ ఒక్కచోట ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయిన ఆధార్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం వల్ల ప్రభుత్వ పథకాలను యాక్సెస్ చేసేటప్పుడు సమస్యలు రావు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విమానాశ్రయాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా పరిస్థితుల్లో అప్డేట్ చేయకపోతే డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ డేటా అథెంటికేషన్ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. చిన్న పిల్లల ఆధార్ కార్డులను సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. దీంతో వారికి రావల్సిన బెనిఫిట్స్ అన్నీ సకాలంలో అందుతాయి.
ALSO READ : ఆధార్ లో అడ్రస్ మార్చాలా..! ఇంకొన్ని రోజులే గడువు