BigTV English
Advertisement

SreeLeela: అందుకే వరుస సినిమాలు చేయడం లేదు.. అసలు నిజం చెప్పిన శ్రీలీల..!

SreeLeela: అందుకే వరుస సినిమాలు చేయడం లేదు.. అసలు నిజం చెప్పిన శ్రీలీల..!

SreeLeela:సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఒక ఎత్తైతే, అందులో సక్సెస్ అవ్వడం మరో ఎత్తు. హీరో అయినా, హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం, నటనతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా అదృష్టం వుండి, అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని, ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీలా(Sree Leela) కూడా ఒకరు. ‘పెళ్లి సందD’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి, రవితేజ (Raviteja)హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఈమె చేసిన డాన్స్ కి థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోయాయి. ఇంత పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడానికి కూడా కారణం శ్రీలీల అని అప్పట్లో విశ్లేషకులు కూడా రివ్యూలు ఇచ్చారు.


లక్ అంటే ఈమెదే..

ఈ సినిమా తర్వాత అరడజనుకు పైగా సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే అందులో బాలయ్య(Balayya) హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా మినహా మిగిలినవన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూశాయి. దీంతో అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో ఇండస్ట్రీకి దూరమైందనే వార్తలు వినిపించాయి. అందరూ అనుకున్నట్టుగానే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో శ్రీ లీల నుండి కేవలం ‘గుంటూరు కారం’ సినిమా మినహా మరో సినిమా రాలేదు. దీంతో అందరూ ఈమెను పక్కన పెట్టేసారని అనుకున్నారు. కానీ దీనికి గల కారణాన్ని ఆమె తాజాగా వెల్లడించింది.


నితిన్ మూవీతో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు..

ప్రస్తుతం శ్రీ లీల నితిన్(Nithin) హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ పాటను ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ విడుదల చేయగా.. ఆ ఈవెంట్ కి శ్రీలీలా కూడా హాజరైంది. ఈవెంట్ లో భాగంగా శ్రీ లీల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు అనుమానాలన్నింటికీ తెర దించాయి.

అందుకే సినిమాలు తగ్గించాను..

గత ఏడాది మీ నుండి నెలకు ఒక సినిమా వచ్చేది.? కానీ ఈ ఏడాది సినిమాలను ఎందుకు బాగా తగ్గించేశారు.? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. శ్రీలీలా మాట్లాడుతూ..”ఈ ఏడాది నా మెడికల్ స్టడీస్ కి చాలా కీలకం. గత ఏడాది వరుసగా సినిమాలు చేయడం వల్లే నా అటెండెన్స్ చాలా తగ్గిపోయింది. అందుకే ఈ ఏడాది సినిమాలను తగ్గించి, చదువు పైన దృష్టి పెట్టాను. అందుకే సినిమాలు చేయలేకపోతున్నాను” అంటూ అసలు నిజం చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం..

ఇక శ్రీ లీల మరోవైపు హరీష్ శంకర్ (Hareesh Shankar), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×