AC Compressor: వేసవి కాలంలో ఇల్లు చాలా వేడిగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ సమయం ఏసీ నడపడం తప్ప వేరే మార్గం ఉండదు. కానీ రోజంతా ఆన్‌లో ఉంచడం వల్ల ఏసీ కూడా వేడెక్కి కాలిపోతుందని మీకు తెలుసా. ఎయిర్ కండిషనర్లు ఓవర్ హీటింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇది చాలా మంది లైట్ తీసుకునే అంశం అనే చెప్పాలి. కానీ రోజంతా ఏసీ ఉపయోగించినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. AC వేడెక్కకుండా కాపాడటానికి 10 మార్గాలను అనురించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి నెలా అవుట్‌డోర్ యూనిట్‌ను శుభ్రం చేయండి:
ప్రతి నెలా AC యొక్క అవుట్‌డోర్ యూనిట్‌ను శుభ్రం చేయాలి. ఇది ఇంటిని చల్లగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. కానీ ఆకులు, దుమ్ము దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఏసీ ఆపివేసి ప్రతి నెలా కండెన్సర్ కాయిల్స్‌ను సున్నితంగా శుభ్రం చేయాలి.
నిర్వహణ చేయించండి:
ఏసీ వ్యవస్థను సంవత్సరానికి కనీసం ఒకసారి నిపుణుడితో చెక్ చేయించండి. కంప్రెసర్‌లో ధూళి, శిధిలాలు లేదా లీక్‌లు ఉంటే వాటిని తొలగించడం ద్వారా అతివేడిని నివారించవచ్చు. రెగ్యులర్ సర్వీసింగ్ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కంప్రెసర్ జీవితకాలాన్ని పొడిగిస్తుంది.
ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయండి లేదా మార్చండి:
మురికి ఎయిర్ ఫిల్టర్లు గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల కంప్రెసర్ అధికంగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా త్వరగా వేడెక్కుతుంది. ప్రతి 1-2 నెలలకు ఫిల్టర్లను శుభ్రం చేయండి లేదా అవసరమైతే మార్చండి. ఇది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కంప్రెసర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది.
తగిన వెంటిలేషన్ :
కంప్రెసర్ యూనిట్ చుట్టూ కనీసం 2-3 అడుగుల ఖాళీ స్థలం ఉండేలా చూడండి. గోడలు, ఫర్నిచర్ లేదా ఇతర వస్తువులతో యూనిట్‌ను కప్పకూడదు. ఇది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చుట్టూ వేడి చేరకుండా నిరోధిస్తుంది.
రిఫ్రిజెరాంట్ స్థాయిలను చెక్ చేయండి:
తక్కువ లేదా అధిక రిఫ్రిజెరాంట్ స్థాయిలు కంప్రెసర్‌పై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి. రిఫ్రిజెరాంట్ స్థాయిలను నిపుణుడితో చెక్ చేయించండి. అవసరమైతే రీఫిల్ చేయండి.
విద్యుత్ కనెక్షన్ల భద్రత:
విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండేలా చూడండి. వోల్టేజ్ లేదా తప్పుడు వైరింగ్ కంప్రెసర్‌ను దెబ్బతీస్తుంది. కనెక్షన్లను ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించండి. సరైన గ్రౌండింగ్ కూడా ఉండేలా చూడండి.
Also Read: అదే జరిగితే ఐఫోన్ రేటు రూ. 3 లక్షలు
అతిగా ఉపయోగించకండి:
ఏసీని రోజంతా ఎక్కువ గంటలు నడపడం కంప్రెసర్‌పై ఒత్తిడిని పెరుగుతుంది. థర్మోస్టాట్‌ను 24-26°C వద్ద సెట్ చేయడం ద్వారా ఏసీ యొక్క లోడ్‌ను తగ్గించవచ్చు. ఇది శక్తిని ఆదా చేయడంతో పాటు కంప్రెసర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పర్యావరణ జాగ్రత్తలు:
అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజులలో ఏసీని అతిగా ఉపయోగించకుండా ఉండండి. గది ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడం ద్వారా కంప్రెసర్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే.. గదిలోని కిటికీలు, తలుపులు సరిగ్గా మూసివేసి ఉండేలా చూడండి. ఇది ఏసీ సామర్థ్యాన్ని పెంచుతుంది.