E-Paper
Advertisement

రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
Advertisement

Acer 6GB RAM 4G tablet: ప్రస్తుత డిజిటల్ కాలంలో.. స్మార్ట్‌ఫోన్ ఎంత అవసరమో, పెద్ద స్క్రీన్ ఉండే.. ట్యాబ్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. ఆన్‌ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో.. సినిమాలు చూడటం, గేమింగ్ లవర్స్ కోసం చాలా మంది ట్యాబ్స్‌ను కొననికి ఆసక్తి చూపుతున్నారు. అయితే. ఎక్కువ ధర పెట్టి కొనలేము అనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ప్రముఖ టెక్ కంపెనీ ‘ఏసర్’ అద్భుతమైన ఫీచర్లతో.. కూడిన ‘ఏసర్ ఐకానియా ట్యాబ్’ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 16,999 బడ్జెట్‌లో.. లభించే ఈ ట్యాబ్ ఫీచర్లు , పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

ఫూర్తి ఫీచర్లు:

1. డిస్‌ప్లే, విజువల్ ఫీల్:

ఈ ట్యాబ్ 10.36 ఇంచుల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. వీడియోలు చూసేటప్పుడు, చదువుకునేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు క్లియర్ అండ్ షార్ప్ విజువల్స్ లభిస్తాయి. పెద్ద స్క్రీన్.. ఉండటం వల్ల పిల్లలు ఆన్‌ లైన్ క్లాసులు.. వినేటప్పుడు కంటిపై ఒత్తిడి తగ్గడానికి ఇది సహాయ పడుతుంది. స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ కారణంగా.. చేతిలో పట్టుకోవడానికి కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

2. పెర్ఫార్మెన్స్, ప్రాసెసర్:

Advertisement

బడ్జెట్ ధరలో వస్తున్నప్పటికీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఏసర్ ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు 6GB RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మీరు ఒకే.. సమయంలో అనేక యాప్స్ రన్ చేసినప్పటికీ ట్యాబ్ ఎలాంటి లాగ్ లేకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది. అలాగే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్‌ను మరింత పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.

3. కనెక్టివిటీ:

చాలా బడ్జెట్ ట్యాబ్స్‌లో కేవలం వైఫై.. ఆప్షన్ మాత్రమే ఇస్తుంటారు. కానీ ఈ ఏసర్ ఐకానియా ట్యాబ్‌లో.. Wi-Fi తో పాటు 4G సిమ్ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దీని వల్ల మీరు ఈజీగా ప్రయాణం .. చేస్తున్నప్పుడు వైఫై లేకపోయినా, మొబైల్ డేటా ద్వారా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఆఫీస్ వర్క్ లేదా స్టడీస్ ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.

Advertisement

Also Read: కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!

4. కెమెరా, బ్యాటరీ లైఫ్:

తరచూ ఉపయోగించు కోవడానికి వీలుగా ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఆన్‌లైన్ క్లాసులు లేదా వీడియో స్ట్రీమింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే..ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాల్స్ ,సాధారణ ఫొటోల కోసం ముందు.. వెనక వైపు మంచి కెమెరాలు ఇవ్వడం జరిగింది.

కేవలం రూ. 16,999ధరలో.. బెస్ట్ స్పెసిఫికేషన్స్ కోరుకునే వారికి ..’ఏసర్ ఐకానియా ట్యాబ్’ ఒక అద్భుతమైన ఆప్షన్. పిల్లల చదువుల నుంచి పెద్దల.. ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ..అన్ని అవసరాలను ఇది చక్కగా ..తీరుస్తుంది. మీరు కూడా బడ్జెట్‌లో మంచి 4G ట్యాబ్ కొనాలనుకుంటే..ఇది బెస్ట్.

Related News

అల్టిమేట్ ఫీచర్లతో..టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్, మీరూ ఓ లుక్కేయండి

కొత్త వైర్డ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్..ఇంత వరకూ లేని ఫీచర్లతో హల్ చల్!

లుక్స్,బ్యాటరీ చూసి ఇయర్‌బడ్స్ కొంటే మోసపోతారు!ఈ ఒక్కటి చెక్ చేస్తే చాలు

కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!

నవంబర్‌లో కొత్త ఫోన్ల జాతర.. వివో, షావోమీ, వన్‌ప్లస్ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే మోడల్స్ ఇవే!

రూ.15 వేలకే 7000mAh బ్యాటరీ 5G ఫోన్.. అమెజాన్‌లో 4 రియల్‌మీ ఫోన్లపై మతిపోయే ఆఫర్లు!

ఒక్కొక్కరికి 50 వేల డాలర్లు.. యూట్యూబర్లకు ఇన్‌స్టా బంపరాఫర్!

Big Stories

Advertisement
×