E-Paper
Advertisement

రూ.1,799కే బోట్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్! ఫీచర్లు చూస్తే మతిపోతుంది

రూ.1,799కే బోట్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్! ఫీచర్లు చూస్తే మతిపోతుంది
Advertisement

boAt Airdopes Prime Supreme: మ్యూజిక్ లవర్స్, ఎప్పుడూ కాల్స్‌లో బిజీగా ఉండే వారికి మంచి వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ ఉండటం ఇప్పుడు చాలా అవసరంగా మారింది.అయితే.. బ్రాండెడ్ ఇయర్‌ బడ్స్ అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’తక్కువ ధరలోనే.. ప్రీమియం ఫీచర్లను అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కోవకే.. చెందిన సరికొత్త మోడల్ఇది. ప్రస్తుతం టెలికాం,గాడ్జెట్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ.1,799 ధరకే లభిస్తున్న ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్,లుక్ :

బోట్ ప్రొడక్ట్స్ ఎప్పుడూ తమ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటాయి. ఈ ఇయర్‌బడ్స్ ‘స్టెల్లార్ బ్లాక్’రంగులో చాలా ప్రీమియంగా కనిపిస్తాయి. చెవుల్లో.. సౌకర్యవంతంగా.. ఇమిడి పోయేలా ఇయర్-టిప్స్ డిజైన్ చేశారు.ఇవి ఎంత సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి కలగకుండా చాలా లైట్‌వెయిట్‌గా ఉంటాయి. డైలీ యూజ్ చేసే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

2. సౌండ్, స్పేషియల్ ఆడియో :

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో స్పేషియల్ ఆడియో ఫీచర్ ఉండటం విశేషం. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు.. లేదా సినిమాలు చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. బేస్ లవర్స్‌కు కూడా ఇది చక్కటి మ్యూజిక్ ఫీల్ ఇస్తుంది. స్పష్టమైన వాయిస్ ,డీప్ బీట్స్ దీని ప్రత్యేకత.

3. క్వాడ్ మైక్ , ENx టెక్నాలజీ:

ఆఫీస్ కాల్స్ లేదా ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయ్యే వారికి క్లియర్ కాలింగ్ చాలా ముఖ్యం. ఈ ఇయర్‌ బడ్స్‌లో క్వాడ్ మైక్ , ENx టెక్నాలజీని అందించారు. దీని వల్ల మనం మాట్లాడుతున్నప్పుడు చుట్టు పక్కల ఉండే అనవసరమైన నైజ్ తగ్గిపోయి, అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

4. బ్యాటరీ బ్యాకప్ , ASAP ఛార్జ్ :

Advertisement

ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్‌లో బ్యాటరీ లైఫ్ చాలా కీలకం. ఈ మోడల్ లో ఛార్జింగ్ కేసుతో కలిపి దాదాపు 60 గంటల (60H) వరకు.. నాన్‌ స్టాప్ ప్లేబ్యాక్ టైమింగ్‌ను అందిస్తుంది. అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. వారమంతా హాయిగా వాడొచ్చు. ఒక వేళ బ్యాటరీ అయిపోయినా టెన్షన్ అవసరం లేదు. ఇందులో.. ఉన్న ASAP ఛార్జ్ టెక్నాలజీ ద్వారా కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే.. గంటల కొద్ది మ్యూజిక్ ఆస్వాదించవచ్చు.

5. లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ:

ఇందులో లేటెస్ట్ వెర్షన్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఫోన్‌తో క్షణాల్లో పేరింగ్ అయిపోతుంది. కనెక్షన్ డిస్‌కనెక్ట్ కాకుండా సిగ్నల్ లభిస్తుంది. గేమ్స్ ఆడేవారి కోసం తక్కువ లేటెన్సీ మోడ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది.

Also Read: తక్కువ ధరలో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనాలా?వీటిని మించినవి లేవు!

ధర:మార్కెట్లో దీని అసలు ధర రూ.1,799 వద్ద అందుబాటులో.. ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో జరిగే.. సేల్స్‌లో ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో అన్నిలేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ , క్లియర్ కాలింగ్ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ అని చెప్పొచ్చు. రూ.1,799 ధరలో ఇది నిజంగా వర్త్ !

Related News

వాయు కాలుష్యానికి చెక్ పెట్టే..అడ్వాన్స్‌డ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!

తక్కువ ధరలో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనాలా?వీటిని మించినవి లేవు!

కొత్త 5G ఫోన్ నెట్‌వర్క్ సమస్యలకు..చెక్ పెట్టే సింపుల్ టిప్స్!

మీ వాట్సాప్ ప్రైవసీ సేఫ్..చాట్ లాక్ ఫీచర్‌ని ఇలా వాడండి!

తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

దీపావళికి పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలా? ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే సరి

Big Stories

Advertisement
×