TRIGGR Roar 20 Bluetooth speaker: మ్యూజిక్ వినకుండా రోజు గడపని వారు చాలామందే ఉంటారు. ఇంట్లో పార్టీలైనా, బయట ట్రిప్స్‌కి వెళ్లినా మంచి మ్యూజిక్ ఉంటే.. ఆ మజాయే వేరు. అయితే.. మంచి సౌండ్ క్వాలిటీ ఇచ్చే స్పీకర్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తారు. కానీ కేవలం వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలోనే ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ సౌండ్ అందించే.. స్పీకర్లు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఆ కోవకు చెందినదే TRIGGR Roar 20 బ్లూటూత్ స్పీకర్. ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ స్పీకర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.డిజైన్, లుక్ :
ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలో పటిష్టమైన మెటల్ మెష్ డిజైన్‌ను అందించారు. దీని వల్ల స్పీకర్ చూడటానికి ప్రీమియంగా ఉండటమే కాకుండా.. ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ముఖ్యంగా ‘ఎమరాల్డ్ గ్రీన్’ కలర్ ఈ స్పీకర్‌కు రిచ్ లుక్‌ని ఇస్తుంది. సైజులో కాంపాక్ట్‌గా ఉండటం.. వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు.
యూత్ ను ఎక్కువగా ఆకర్షించే.. ఫీచర్లలో ఆర్‌జీబీ లైటింగ్ ఒకటి. ఈ స్పీకర్‌కు చుట్టూ ఉండే.. ఆర్‌జీబీ లైట్లు మ్యూజిక్‌కు తగినట్టుగా వెలుగుతూ.. అద్భుతమైన పార్టీ వైబ్స్‌ను అందిస్తాయి. చీకటి గదిలో.. లేదా రాత్రి సమయంలో మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయెచ్చు.
చిన్న సైజులో ఉన్నప్పటికీ.. ఇది దాదాపు 20W పవర్ ఫుల్ సౌండ్‌ను అందిస్తుంది. మోనో ఛానెల్ ఆడియో సెటప్‌తో.. కూడిన ఈ స్పీకర్ రూమ్ మొత్తం ప్రతిధ్వనించేలా స్పష్టమైన డీప్ బేస్‌ను ఇస్తుంది. పాటలు వినేటప్పుడు.. లేదా సినిమాలు చూసేటప్పుడు మంచి ఆడియో ఫీల్ కలుగుతుంది.
ఈ స్పీకర్‌లో లేటెస్ట్ వెర్షన్ బ్లూటూత్ v5.4 టెక్నాలజీని వాడారు. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో కనెక్ట్ అయిపోతుంది.సిగ్నల్స్ కట్ అవ్వకుండా స్థిరమైన కనెక్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ..ఇందులో TWS ఫీచర్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మరో స్పీకర్ ఉంటే..రెండింటిని జత చేసి డబుల్ సౌండ్‌ను ఎంజాయ్ చేయెచ్చు.
కేవలం బ్లూటూత్ ద్వారానే కాకుండా..ఎవరికైనా రేడియో వినే అలవాటు ఉంటే వారి కోసం ప్రత్యేకంగా ఎఫ్‌ఎం మోడ్ కూడా అందించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 7 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్‌ను అందిస్తుంది. ప్రయాణాలు చేసేవారికి.. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: రూ.1,799కే బోట్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్! ఫీచర్లు చూస్తే మతిపోతుంది
మార్కెట్లో ఈ మోడల్ బ్లూటూత్ స్పీకర్ అసలు ధర కేవలం రూ.999 మాత్రమే. ఈ ప్రైస్ రేంజ్‌లో 20W పవర్, మెటల్ బాడీ, ఆర్‌జీబీ లైట్స్ రావడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో.. ఇది అందుబాటులో ఉంది.
తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే డిజైన్, కలర్‌ఫుల్ లైట్లు , మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ.1,000లోపు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గాడ్జెట్ కావాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా కొనొచ్చు!