YOROTO retro Bluetooth speaker: మ్యూజిక్ ఎంజాయ్ చేసే విధానం కాలంతో.. పాటు మారుతున్నప్పటికీ, పాత రోజులను గుర్తు చేసే ‘వింటేజ్’డిజైన్లకు ఉండే క్రేజ్ ఎప్పటికీ తగ్గదు.ఇప్పుడు చాలా మంది గాడ్జెట్ లవర్స్ లేటెస్ట్ ఫీచర్లతో కూడిన క్లాసిక్ లుక్ గల పరికరాలను ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే.. ఈ స్పీకర్ మార్కెట్ లోకి వచ్చింది. వైట్ , క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ వింటేజ్ స్పీకర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. వింటేజ్ డిజైన్ ,లుక్ :
ఈ స్పీకర్ మెయిన్ అట్రాక్షన్ దీని లుక్ అనే చెప్పాలి. ఇది చూడటానికి 90ల నాటి క్లాసిక్ రేడియోలా కనిపిస్తుంది. మీ డెస్క్, బెడ్ రూమ్ టేబుల్ లేదా లివింగ్ రూమ్‌లో ఎక్కడ పెట్టినా ఇది ఇంటి ఇంటీరియర్‌కి ఒక రాయల్ , ట్రెండీ లుక్‌ని ఇస్తుంది. వైట్ , క్రీమ్ షేడ్స్ దీనికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. అంతే కాకుండా కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
2. పవర్‌ఫుల్ 12W స్టీరియో ఛానెల్ సౌండ్ :
చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ, ఇది దాదాపు 12W పవర్‌ఫుల్ స్టీరియో ఛానెల్ ఆడియోను అందిస్తుంది. దీని వల్ల పాటలు వినేటప్పుడు క్లియర్ వాయిస్ ,మంచి బేస్ ఫీల్ కలుగుతుంది. గది మొత్తం చక్కటి సౌండ్‌తో ..నిండిపోతుంది. మ్యూజిక్ లవర్స్‌కి ఇది మంచి ఆడియో ఫీల్ ఇస్తుంది.
3. బ్లూటూత్ కనెక్టివిటీ, ఇతర ఆప్షన్లు:
ఈ స్పీకర్‌లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీని అందించారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్ టాప్‌తో క్షణాల్లో.. వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాకుండా..ఇతర మోడ్స్ ద్వారా కూడా మ్యూజిక్ ప్లే చేసుకునే.. అవకాశం ఇందులో ఉంటుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు.. కూడా ఇది క్లియర్ కనెక్షన్‌ను ఇస్తుంది.
4. బ్యాటరీ బ్యాకప్,పోర్టబిలిటీ:
ఎక్కడికైనా ట్రిప్స్‌కి.. వెళ్ళే టప్పుడు లేదా ఇంట్లో.. వైర్ల గోల లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ..ఈ పోర్టబుల్ స్పీకర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీంట్లో.. ఉన్న బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై తగినంత ప్లేబ్యాక్ టైమింగ్‌ను అందిస్తుంది. దీనిని యూజ్ చేయడం కూడా.. చాలా సింపుల్ కనక పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఆపరేట్ చేయెచ్చు.
Also Read: రూ.999కే బ్లూటూత్ స్పీకర్..పార్టీల కోసం బెస్ట్ ఛాయిస్
ధర:
మార్కెట్లో ఈ మోడల్ ధర కేవలం రూ.668 మాత్రమే ఉంది.ఈ ప్రైస్ రేంజ్‌లో.. వింటేజ్ లుక్, 12W స్టీరియో సౌండ్ రావడం నిజంగా నమ్మ శక్యం కాని విషయమే. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫారమ్‌లలో.. ఇది అందు బాటులో ఉంది.
తక్కువ బడ్జెట్‌లో అందమైన వింటేజ్ లుక్, మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం రూ.668 ధరలో ఇటు ఇంటీరియర్ డెకరేషన్ అటు మ్యూజిక్ అవసరాలు రెండూ తీర్చు కోవాలనుకునే వారు దీన్ని నిరభ్యంతరంగా కొనొచ్చు!