HP Laptops : HP.. ఈ సంస్థ ఇప్పటికే తన కస్టమర్స్ కోసం ఎన్నో అదిరిపోయే లాప్టాప్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అదిరిపోయే అప్డేట్స్ సైతం ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా క్లైంట్స్ తో కమ్యూనికేట్ అయ్యే ఉద్యోగుల కోసం ప్రత్యేక లాప్టాప్స్ ను తీసుకొచ్చింది. ఇందులో స్లిమ్ డిజైన్ తో పాటు పవర్ ఫుల్ బ్యాటరీ సదుపాయం కూడా ఉంది. ఎంటర్ప్రైజ్ గ్రేడ్ పాయింట్ సెక్యూరిటీతో తాజాగా HP తీసుకువచ్చిన ఈ రెండు లాప్టాప్స్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ గాడ్జెట్ తయారీ సంస్థ HP తాజాగా రెండు లాప్టాప్స్ ను లాంఛ్ చేసింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. HP EliteBook Ultra, HP OmniBook X పేరుతో తీసుకొచ్చిన ఈ రెండు లాప్టాప్స్ ప్రస్తుతం టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ లాప్టాప్స్ కార్పొరేట్, స్టార్టప్, రిటైల్ కస్టమర్స్ కు ఎక్కువగా ఉపయోగపడేలా ఉన్నాయి.
HP కొత్త ల్యాప్‌టాప్‌లలో Snapdragon X Elite ప్రాసెసర్, డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ సైతం ఉన్నాయి. వీటితో పాటు సెకనుకు 45 ట్రిలియన్ ఆపరేషన్‌లు చేయగల సామర్థ్యం కూడా ఉంది. లాంగ్వేజ్ ఛేంజెస్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయం కూడా ఉంది. ఇక బిజినెస్ ప్రొఫెషనల్ కు అవసరమయ్యే సెక్యూరిటీ ఫీచర్స్ తో పాటు రిమోట్ వర్కింగ్ తో ఈ లాప్టాప్స్ వచ్చేసాయి.
HP EliteBook Ultra –
క్లయింట్‌లతో కమ్యూనికేట్ అయ్యే ఎంప్లాయిస్ కోసం ప్రత్యేకంగా లాప్టాప్ ను హెచ్పీ కంపెనీ తీసుకొచ్చింది ఇది స్టైలిష్ డిజైన్ తో పాటు బిజినెస్ కు కావలసిన ఇతర ఫీచర్స్ తో డిజైన్ చేశారు ఇక స్లిమ్ డిజైన్ తో చేసిన ఈ లాప్టాప్ టాప్ పవర్ఫుల్ బ్యాటరీస్ ఐటమ్ ఉంది అంతే కాకుండా ఇందులో ఎంటర్ప్రైజ్ గ్రేడ్ అండ్ పాయింట్ సెక్యూరిటీ సైతం అమర్చారు ఇందులో డేటా సేఫ్ గా ఉంచేందుకు ప్రత్యేక ఫీచర్స్ ఉన్న సైతం హెచ్పీ కంపెనీ తీసుకొచ్చింది
HP OmniBook X –
ఈ ల్యాప్‌టాప్ ను HP కంపెనీ ప్రత్యేకంగా ఫ్రీలాన్సర్‌లు, ఇతర రిటైల్ కస్టమర్‌ల కోసం డిజైన్ చేసింది. ఇది వీడియో క్వాలిటీని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. ఇక ఇందులో అధునాతన AI ఫీచర్స్ సైతం ఉన్నాయి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, రిమోట్ మీటింగ్ లాంటి డైనమిక్ లైఫ్‌స్టైల్‌కు సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ ప్రాసెసర్ పనితీరు కావాలనుకునే యూజర్స్ కచ్చితంగా ఈ లాప్టాప్ ను ట్రై చేసేయెుచ్చు.
ఈ లాప్ టాప్స్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు HP ఆఫీషియల్ వెబ్సైట్ లో సైతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటిపై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఈఎంఐ సదుపాయం సైతం కలదు. ఇక ఇంకెందుకు ఆలస్యం.. బెస్ట్ లాప్టాప్స్ ను కొనుగోలు చేయాలనుకున్న యూజర్స్ కచ్చితంగా వీటిని ట్రై చేసేయండి.
ALSO READ : న్యూ ఇయర్‌కు ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్.. అంతరిక్షంలో దర్శనం