AI Death Calculator : ఆధునిక ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతీ విషయం ఎంతో తేలిక అయిపోయింది. మనిషి ఆలోచనలు, నడక, గుండె పనిచేసే తీరును సైతం కనిపెట్టగలిగే టెక్నాలజీ వచ్చేసింది. ప్రతిక్షణం మనిషిని నీడలా పసిగడుతూ ప్రతీ విషయాన్ని అంచనా వేయగలిగే అద్భుతమైన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇక ఈ నేపథ్యంలో వందల ఏళ్లుగా ఎవరూ కనిపెట్టలేని మనిషి పుట్టుక, చావుల గురించి సైతం చెప్పే టెక్నాలజీ వచ్చేస్తోంది. అయితే అసలు ఈ టెక్నాలజీ ఏంటి.. ఎలా పని చేస్తుంది.. పూర్తి వివరాలు ఇవే.
ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా తేలికగా ఊహించవచ్చు. టెక్నాలజీతో ప్రతి విషయాన్ని పసిగట్టే అవకాశం ఉంటుంది. కంటికి కనిపించని విషయాలను సైతం మనిషి అద్భుతంగా ఆలోచించగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసిన ఈ కాలంలో రెండు విషయాలు మాత్రం ఎప్పటికి మిస్టరీగానే మిగిలిపోయాయి .అవి ఒకటి మనిషి పుట్టుక.. రెండు మనిషి చావు. ఈ రెండు ఎప్పుడు వస్తాయి.. ఎలా వస్తాయి.. అనే విషయం ఎవ్వరూ ఊహించలేరు. పుట్టిన తేదీని బట్టి చెప్పడం ఒక లెక్క అయితే.. అసలు మనిషి పుట్టుక వెనక ఉన్న అద్భుతాన్ని ఎవరూ ఊహించలేరు. ఇక చనిపోయే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేక ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేసి నిరాశ చెందారు. ఇక ఇప్పుడు నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో అది కూడా సాధ్యమేనని నిపుణులు చెప్పుకొస్తున్నారు. మనిషి ఎప్పుడు చనిపోతాడు అని చెప్పేసే టెక్నాలజీని త్వరలోనే తీసుకువస్తామని.. ఈ టెక్నాలజీ కచ్చితంగా ప్రతీ ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ విషయం అత్యంత తేలిక అవుతుందని తెలుపుతున్నారు.
శాస్త్రవేత్తలు చెప్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే డెత్ కాలిక్యులేటర్ (AI Death Calculator) ఎలా పనిచేస్తుందంటే.. లాన్సర్ డిజిటల్ హెల్త్ ప్రచురించిన ఓ శీర్షికలో పూర్తిగా వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి ఎలా చనిపోతాడో ఎప్పుడు చనిపోతాడో చెప్పవచ్చని ప్రచురించిన ఈ పత్రిక.. ఈ క్యాలిక్యులేటర్ ట్రైల్ యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసు కు చెందిన రెండు హాస్పిటల్లో త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని వెల్లడించింది. ఇక ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ అసలు పేరు AIRE. పూర్తి అర్థం AI ECG రిస్క్ ఎస్టిమేటర్ (AI ECG Risk Estimator).
ఈ క్యాలిక్యులేటర్ గుండె పనితీరుని అంచనా వేస్తుంది. గుండెకు రక్తాన్ని పంపించేయడం ఎప్పుడు ఆగిపోతుందో ఈ డెత్ కాలిక్యులేటర్ కరెక్ట్ గా చెప్పేస్తుందంట. సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాన్ని అంచనా వేయగలుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే పరిశోధనలు చేపడుతున్నామని.. బ్రిటన్ లో ఉన్న ఆసుపత్రుల్లో వేలాదిమంది ఇప్పటికే ట్రైల్స్ లో పాల్గొన్నారని తెలుపుతుంది. ఇక ప్రజలకు సైతం ఈ డెత్ క్యాలిక్యులేటర్ పై ఆసక్తి ఎక్కువగా ఉందని.. వైద్యులు గుర్తించలేని వ్యాధులను సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు పలుమార్లు ట్రైల్స్ సైతం నిర్వహించామని.. ఈ ట్రైల్స్ లో 78% డెత్ క్యాలిక్యులేటర్ కరెక్ట్ గానే సమాధానం చెప్పిందని తెలుపుతున్నారు. ఇక ఈ డెత్ కాలిక్యులేటర్ ఇప్పటికే 11.60 లక్షల మంది రోగులకు ఈసీజీ రిపోర్ట్లను సేకరించిందని.. వీటి ద్వారా వారి మరణం ఎప్పుడు సంభవిస్తుందో పూర్తిస్థాయిగా చెప్పగలుగుతామని హామీ ఇస్తున్నారు.
ALSO READ : జియో, ఎయిర్టెల్ ప్లాన్స్ లో ఏది బెస్ట్? ఈ ప్లాన్ తో మీ డబ్బులు ఆదా!