Pushpa 2 Trailer : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టిన మేకర్స్ తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
ట్రైలర్ లో జగపతి బాబు పవర్ ఫుల్ డైలాగులతో మొదలవుతుంది. ఎవడు రా వాడు డబ్బులు అంటే లెక్క లేదు పవర్ అంటే భయం లేదు.. ప్రాణం అంటే లెక్క లేదు అంటూ జగపతి బాబు ఇంట్రడక్షన్ డైలాగుతో మొదలవుతుంది. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని శ్రీవళ్లి చెప్పే డైలాగు హైలెట్ అవుతుంది. ఇక శ్రీవళ్లి నా పెళ్ళాం అని పుష్ప చెప్పే డైలాగులు.. మాస్ యాక్షన్ సీన్స్ ట్రైలర్ లో కనిపిస్తాయి. ఈ ట్రైలర్ బీజీఏం మాత్రం ప్రేక్షకులకు గూస్ బంబ్స్ తెప్పిస్తుంది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూసేయ్యండి..
పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ను పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పుష్ప టీమ్ తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. ఇక గతంలో వచ్చిన పుష్ప సినిమాకు మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి చేస్తున్నారు. అయితే.. ఈ ట్రైలర్ తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ , తమిళ్ లో AGS ఎంటర్టైన్మెంట్స్ , హిందీ లో T- సిరీస్ యూట్యూబ్ ఛానల్, మలయాళం లో e4 ఎంటర్టైన్మెంట్స్ , కన్నడ లో అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశాయి.. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేశారు. డీఎస్పీతో పాటు తమన్ నేపథ్య సంగీతం అందించారు.